Asianet News TeluguAsianet News Telugu

భార‌త‌ కీర్తి ప్రతిష్టలు పెంచారు.. నీర‌జ్ చోప్రాతో ప్ర‌ధాని మోడీ ఫోన్ కాల్

Neeraj Chopra - PM Modi : పారిస్ ఒలింపిక్స్ లో సిల్వ‌ర్ మెడ‌ల్ గెలిచిన నీర‌జ్ చోప్రాతో ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ ఫోన్‌లో మాట్లాడి అభినందనలు తెలిపారు. అలాగే, అత‌ని గాయం గురించి విష‌యాల‌ను అడిగి తెలుసుకున్నారు.
 

PM Narendra Modi congratulates Neeraj Chopra for winning silver for India Paris 2024 Olympics RMA
Author
First Published Aug 9, 2024, 3:58 PM IST | Last Updated Aug 9, 2024, 3:58 PM IST

Neeraj Chopra : పారిస్ ఒలింపిక్స్ 2024 పురుషుల జావెలిన్ త్రో ఈవెంట్‌లో భారత స్టార్ అథ్లెట్ నీరజ్ చోప్రా రజత పతకాన్ని గెలుచుకున్నాడు. టోక్యో ఒలింపిక్స్ లో గోల్డ్ మెడ‌ల్ గెలిచిన నీర‌జ్ పై యావ‌త్ భార‌తావ‌ని గోల్డ్ తీసుకువ‌స్తాడ‌ని ఆశించింది. కానీ, దీనికి అత‌ని గాయం అడ్డుత‌గిలింది. ఇదే స‌మ‌యంలో పాకిస్తాన్ స్టార్ అథ్లెట్ ఒలింపిక్ రికార్డును బ్రేక్ చేస్తూ 92.97 మీట‌ర్లు విసిరి గోల్డ్ మెడ‌ల్ గెలుచుకున్నాడు. నీర‌జ్ చోప్రా 89.45 మీటర్లు విసిరి సిల్వర్ మెడల్ గెలిచాడు.

పారిస్ ఒలింపిక్స్ లో సిల్వ‌ర్ మెడ‌ల్ గెలిచిన త‌ర్వాత నీర‌జ్ చోప్రాకు ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ ఫోన్ చేసి అభినందించారు. మరోసారి దేశానికి కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెట్టార‌నీ, దీని కోసం యావ‌త్ భార‌తావ‌ని రాత్రి ఎదురుచూసింద‌ని తెలిపారు. స్వ‌ర్ణం గెల‌వ‌క‌పోవ‌డం గురించి నీర‌జ్ మాట్లాడుతూ..  అందరూ స్వర్ణం ఆశించారు, కానీ గాయం కారణంగా నేను కోరుకున్నంత ప్రయత్నం చేయలేకపోయాను. దీంతో కొంత విచారంగా ఉంద‌ని తెలిపాడు. పోటీ బ‌లంగా ఉన్న స‌మ‌యంలో దేశానికి మెడ‌ల్ తీసుకురావ‌డం సంతోషంగా ఉంద‌న్నాడు. నీర‌జ్ అమ్మ‌తో పాటు వారి కుటుంబంలోని ఇత‌రులు క్రీడ‌ల్లో పాల్గొన్నారా అనే విష‌యాలు కూడా ప్ర‌ధాని అడిగి తెలుసుకున్నారు. అయితే, తాను మాత్ర‌మే త‌మ కుటుంబం నుంచి క్రీడ‌ల్లో ఉన్నాన‌నీ, అయితే హర్యానాలో ఖచ్చితంగా క్రీడల వాతావరణం ఉంటుంది కాబ‌ట్టి అందుకే ఆమె చిన్నతనంలో ఏదో ఒక క్రీడ‌ల్లో ఉన్నార‌ని చెప్పారు.

1 బాల్ కు 17 పరుగులు చేసిన బ్యాట్స్‌మన్ ఎవ‌రో తెలుసా?

 

 

కాగా, ఫ్రాన్స్ రాజధాని పారిస్ లో జరుగుతున్న 33వ ఒలింపిక్స్ ముగింపు ద‌శ‌కు చేరుకున్నాయి. పారిస్ 2024 ఒలింపిక్స్ ముగింపు వేడుకకు కేవలం రెండు రోజుల సమయం మాత్రమే ఉంది. భార‌త్ ఇప్ప‌టివ‌ర‌కు ఐదు మెడ‌ల్స్ మాత్ర‌మే సాధించింది. షూటింగ్ లో మూడు, హాకీలో ఒక‌టి, జావెలిన్ త్రో లో ఒక‌టి మొత్తం ఐదు మెడ‌ల్స్ ను సాధించింది. అయితే, ఇప్ప‌టివ‌ర‌కు ఒక్క గోల్డ్ మెడ‌ల్ కూడా లేక‌పోవ‌డం నిరాశ‌ను మిగిల్చింది. 

చ‌రిత్ర సృష్టించిన నీర‌జ్ చోప్రా.. భార‌త్ కు పారిస్ ఒలింపిక్స్ లో సిల్వర్ మెడ‌ల్

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios