డ్రోన్ల రూపంలో భారతదేశానికి సరికొత్త రక్షణ సవాల్...
ఇటీవల జమ్మూకశ్మీర్‌లో రాజకీయాలను మళ్లీ గాడిన పెట్టేందుకు దిల్లీలో కశ్మీరీ నేతలతో అఖిలపక్ష సమావేశం నిర్వహించింది కేంద్రం. ఇది జరిగిన కొద్ది రోజులకే డ్రోన్‌లతో దాడులు చేశారు ఉగ్రవాదులు
కాశ్మీర్ లో పరిస్థితిని సాధారణ స్థితికి తీసుకురావడానికి భారత్ ప్రయత్నించిన ప్రతిసారి అక్కడ ఏదో ఒక మేజర్ సంఘటన జరగడం సర్వసాధారణం అయిపోయింది. ఇలాంటి ఒక అత్యున్నత స్థాయి నిర్ణయం తీసుకున్న సమయంలోనైనా ఇలాంటి అవరోధం ఏర్పడటం సర్వసాధారణం అయిపోయింది. దీనివల్ల కేవలం రక్షణ రంగ పరంగానే కాకుండా.. దేని పరిణామాలు రాజకీయంగానూ మనకు కనబడుతున్నాయి.
1999లో అప్పటి ప్రధాని అటల్ బిహారి వాజపేయి పాకిస్తాన్ కి బస్సు యాత్రను చేపట్టారు. ఆ తరువాత వెంటనే కార్గిల్ ల ఎటువంటి దుశ్చర్య ద్వారా చరబాట్లు జరిగాయో మనందరికీ తెలిసిన విషయమే..! భారత్-పాకిస్థాన్ రిలేషన్స్ బలోపేతం చేసుకునేందుకు 2015డిసెంబర్ లో ప్రధాని నరేంద్రమోడి...నవాజ్ షరీఫ్ ఇంటికి వెళ్లారు. అక్కడి ఆతిథ్యం స్వీకరించారు. ఇది జరిగిన కొద్ది రోజులకే పఠాన్‌కోట ఇన్సిడెంట్ జరిగింది.
ఇక ఆపరేషన్ ఆలౌట్‌లో భాగంగా ఉగ్రవాదుల ఏరివేతపై భారత్ దళాలు దృష్టి సారించటాన్ని ఏ మాత్రం జీర్ణించుకోలేకపోయారు ముష్కరులు. 2019లో పుల్వామా దాడి...వారి క్రూరత్వానికి క ప్రత్యక్ష ఉదాహరణగా నిలిచింది.
ఇక ఇటీవల జమ్మూకశ్మీర్‌లో రాజకీయాలను మళ్లీ గాడిన పెట్టేందుకు దిల్లీలో కశ్మీరీ నేతలతో అఖిలపక్ష సమావేశం నిర్వహించింది కేంద్రం. ఇది జరిగిన కొద్ది రోజులకే డ్రోన్‌లతో దాడులు చేశారు ఉగ్రవాదులు. జమ్మూకశ్మీర్..కేంద్రం అధీనంలో ఉండటం ఏ మాత్రం రుచించటం లేదు టెర్రరిస్టులకు. ఈ నేపథ్యంలోనే...డ్రోన్ల దాడి మరోసారి యుద్ధ వాతావరణాన్ని తలపిస్తోంది.
2016 ఉరి ఎటాక్, 2019 పూలవమ దాడుల ద్వారా భారత్ ల అనిశ్చితిని నెలకోల్పేందుకు ముష్కరులు తీవ్ర స్థాయిలో ప్రత్నాలను చేస్తూనే ఉన్నారు. పూర్తిస్థాయిలో యుద్ధం జరగడానికి ఇవి సంకేతాలు కానీ భారతదేశం ముష్కరుల దాడులను ఎదుర్కొనేందుకు పూర్తిస్థాయి సన్నద్ధత చేసుకున్నప్పటికీ... వారి ఆత్మహుతి దాడులను మాత్రం నిలువరించలేకపోయింది.
ఐఈడీ ల ద్వారా దాడి చేయడాన్ని మనం త్లుత శ్రీలంకలో భారతసేనలపై దాడి విషయంలో చూసాము. అది 1990వ దశకంలో కాశ్మీర్ లోని మొదలవడాన్ని మనం గమనించవచ్చు. ఐఈడీ లను పేల్చే విధానం మొబైల్ రిమోట్లకు మారినప్పుడు వాటిని న్యూట్రలైజ్ చేయడానికి భారత సైన్యం అనేక విధానాల్లో ప్రయత్నించింది. కానీ నిలువరించడం సాధ్యపడలేదనడానికి పుల్వామా ఎటాక్ ఒక ప్రత్యక్ష ఉదాహరణ.
కేవలం భారత దేశం మాత్రమే కాదు... ఇరాక్ లో, ఆఫ్గనిస్తాన్ లో అమెరికా జనాలపై కూడా ఇలాంటి దాడులు జరగడాన్ని మనం చాలానే చూసాము. దానిని న్యూట్రలైజ్ చేయడంలో అమెరికా కూడా విఫలయత్నాలే చేసింది. ప్రతి కొత్త టెక్నాలజీని మనం న్యూట్రలైజ్ చేయడమో, దానికి విరుగుడు కనుక్కోవడమో జరగకపోవచ్చు, కానీ దాని వల్ల జరిగే నష్టాన్ని మనం సాధ్యమైనంత మేర తగ్గించగలిగితే చాలు. ఇప్పుడు డ్రోన్ల విషయంలో కూడా మనం ఇదే తరహా సొల్యూషన్ కి రావాల్సి రావొచ్చు.
ఉగ్రవాదులు, వారి పనిచేసే తీరును బట్టి భవిష్యత్తులో ఇలాంటి డ్రోన్ దాడులు కేవలం మిలిటరీ లేదా సైనిక స్థావరాలకే పరిమితం కాకపోవచ్చు. జనావాసాల మీద కూడా ఇలాంటి దాడులను వారు జరపవచ్చు. ఎంతైనా టెర్రరిస్టుల ప్రధానుద్దేశం జనాలను భయభ్రాంతులకు గురిచేయడమే కదా..!
ఇంతకీ జమ్మూ కాశ్మీర్ లో జరిగిన డ్రోన్ దాడికి ఎథినా ముఖ్య ఉద్దేశం ఉందా అని అందరూ ఆలోచిస్తున్నారు. నా వరకు మాత్రం అందుకు ప్రధానోద్దేశం లేకపోలేదు. హఫీజ్ సయ్యద్ అరెస్ట్ అయినప్పటినుండి లష్కర్ ఏ తోయిబా సంస్థ ఒకింత వెనుకంజలో పడిపోయింది. వారు తిరిగి తమ అస్థిత్వాన్ని చాటుకోబడానికి ఈ డ్రోన్ దాడికి తెగబడి ఉండొచ్చు. డ్రోన్ దాడి వారివద్ద నుండి వచ్చిన నూత ఆవిష్కరణగా చెప్పుకోవాలేమో..!
కొన్ని వర్గాల నుండి వినబడుతున్న మరొక ప్రశ్న. డ్రోన్ దాడిని మనం ఇంతకు యుద్ధానికి హదారి తీసే చర్యగా పరిగణించాలి వద్ద అని.? ఆ ప్రశ్నను మనం ప్రస్తుతానికి నెలకొని ఉన్న భౌగోళిక రాజకీయ పరిస్థితుల దృష్ట్యా ఆలోచిస్తే మనకు సరైన సమాధానం దొరక్కపోవచ్చు. ఇక్కడేదో మనం పాకిస్థాన్ కి అవకాశం ఇచ్చినట్టుగా కాదు, వాస్తవిక పరిస్థితులను పరిగణలోకి తీసుకొని మనం కూడా మన సమాధానాన్ని ప్లాన్ చేసుకోవాలిసి ఉంటుంది.