బ్రేకింగ్ న్యూస్... ఎమ్మెల్యే క్వార్టర్స్ లో ఆఫీస్ బాయ్ ఆత్మహత్య

First Published 27, Apr 2018, 12:34 PM IST
office boy suicide at old mla quarters hyderguda
Highlights

ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో ఆఫీస్ బాయ్ ఆత్మహత్య

హైదర్ గూడ ఎమ్మెల్యే క్వార్టర్ లో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనతో ఎమ్మెల్యే క్వార్టర్స్ లో కాస్త గందరగోళం నెలకొంది. ఓ బిజెపి ఎమ్మెల్సీ కి సంబంధించిన కార్యాలయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. 

ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. హైదర్ గూడలోని ఎమ్మెల్యే క్వార్టర్స్ లో బిజెపి ఎమ్మెల్సీ రాంచందర్రావు ఫ్లాట్ నెంబర్ 203 లో నివాసముంటున్నారు. ఆయన వద్ద ఆఫీస్ బాయ్ గా కుర్మయ్య అనే  యువకుడు పనిచేస్తున్నాడు. అయితే  కుర్మయ్య ఇవాళ క్వార్టర్ లోనే ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. 

ఈ ఆత్మహత్యపై సమాచారం అందుకున్న నారాయణగూడ పోలీసులు సంఘటన స్థలాన్న పరిశీలించారు. మృతదూహాన్ని పోస్టు మార్టం కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఆత్మహత్యపై  కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.  

 

loader