మిత్రులతో కలిసి భార్యపై భర్త అత్యాచారం: ఎందుకంటే...

Newly-married Assam woman raped by husband, his 2 friends
Highlights

మిత్రులతో కలిసి భార్యపై భర్త అత్యాచారం: ఎందుకంటే...

న్యూఢిల్లీ: దేశంలో మహిళలపై అత్యాచారాల పరంపర కొనసాగుతూనే ఉంది. తాజాగా రెండు వేర్వేరు ప్రాంతాల్లో జరిగన సంఘటనలు ఆ విషయాన్ని తెలియజేస్తున్నాయి. తనపై ఇద్దరు మిత్రులతో కలిసి తన భర్త తనపై మూడు రోజుల పాటు అత్యాచారం చేశాడని దక్షిణ అస్సాంలోని కరీంగంజ్ జిల్లాకు చెందిన ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. 

వరకట్నం తేలేదనే కోపంతో తన భర్త అలా చేశాడని ఆమె ఫిర్యాదు చేసినట్లు పోలీసులు తెలిపారు. వరకట్నంగా తన భర్త బంగారు ఆభరణాలు డిమాండ్ చేశాడని, ఆ కోరిక తీర్చకపోవడంతో ఏప్రిల్ 17వ తేదీన తనపై మిత్రులతో కలిసి అత్యాచారం జరిపాడని ఆమె ఆరోపించింది. 

తీవ్రమైన అస్వస్థతతో మహిళ కరీంగంజ్ లోని ప్రభుత్వ ఆస్పత్రికి చికిత్స నిమిత్తం వెళ్లడంతో ఆ సంఘటన వెలుగు చూసింది. మహిళ భర్తను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో ఇద్దరు నిందితుల కోసం గాలిస్తున్నారు. ఏప్రిల్ 20వ తేదీన ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.  

బాలికపై మూడు నెలల పాటు....

త్రిపురలోని ఖోవాయి జిల్లాలో 14 ఏళ్ల బాలికపై 58 ఏళ్ల వ్యక్తి మూడు నెలల పాటు అత్యాచారం చేస్తూ వస్తున్నాడు. ఆ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. చాంప్లాయ్ లోని తన నివాసంలో అతను ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి అఘాయిత్యానికి పాల్పడుతూ వస్తున్నాడు. 

ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి 11 సార్లు అతను తనపై అత్యాచారం చేసినట్లు బాలిక తన ఫిర్యాదులో చెప్పింది. ఈ విషయాన్ని ఎవరికైనా చెప్తే తీవ్ర పరిణామాలుంటాయని కూడా హెచ్చరించినట్లు తెలుస్తోంది. 

బాధితురాలు ఖోవాయి జిల్లాలోని తన ఇంటి నుంచి 76 కిలోమీటర్ల దూరంలో గల సిపాహిజల జిల్లాలోని బిషాల్ గడ్ కు వెళ్లి అక్కడి మహిళా పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. 

నిందితుడు తెలిమురాలో ఏడు వ్యాపారాలు నిర్వహిస్తున్నాడని,త ఆ ప్రాంతంలో అతనికి పలుకుబడి ఉందని పోలీసులు చెబుతున్నారు. కాగా, నిందితుడు విశ్వహిందూ పరిషత్ (విహెచ్ పి) రాష్ట్ర నాయకుడని సిపిఎం ఆరోపిస్తోంది. అయితే తమ సంస్థతో నిందితుడికి ఏ విధమైన సంబంధం లేదని విహెచ్ పి రాష్ట్ర సంస్థాగత వ్యవహారాల కార్యదర్శి అమల్ చక్రవర్తి చెప్పారు.

loader