ఇది పక్కా: డిసెంబర్ చివరికల్లా విపణిలోకి మోటరోలా ‘ఫోల్డబుల్’ న్యూఢిల్లీ: స్మార్ట్‌ ఫోన్‌ జీవితంలో భాగమైపోయింది. అందునా ఈ ఏడాది ఫోల్డబుల్ కెమెరా అంటే క్రేజీ విపరీతంగా పెరిగింది. దీంతో ప్రతి ఒక్కరూ స్మార్ట్‌ ఫోన్‌ కస్టమరే కావడంతో కంపెనీల మధ్య పోటీ విపరీతంగా పెరిగిపోయింది.

శామ్‌సంగ్‌, హువావే ఫోన్ సంస్థలు ఈ విషయంలో ముందడుగు వేయగా.. ఇప్పుడు తాజాగా మోటోరోలా కూడా ఫోల్డబుల్‌ ఫోన్‌ తయారీలోకి అడుగుపెట్టింది. ఈ ఏడాది చివరికల్లా మోటరోలా ఫోల్డబుల్ ఫోన్ విపణిలోకి అడుగు పెడుతుందని భావిస్తున్నారు.

మోటోరోలా తన మోటో రేజర్‌ మోడల్‌నే ఫోల్డబుల్‌ ఫోన్‌గా మలచబోతోందని అంటున్నారు. స్క్రీన్‌ సైజ్‌, బ్యాటరీ లైఫ్‌, సెల్ఫీ కెమెరా, ఇన్‌-స్క్రీన్‌ ఫింగర్‌ ప్రింట్‌ కస్టమర్‌ను ఫోన్‌ కొనడానికి ఎక్కువగా ప్రభావితం చేస్తున్న అంశాలు ప్రస్తుతం ఇవే!

ప్రస్తుతం ఉన్న ఫోల్డబుల్‌ డిజైన్లకీ మోటోరోలా నుంచి రాబోతున్నదని ఊహిస్తున్న డిజైన్‌ కీ ఒక ముఖ్యమైన తేడా ఉంది. అదేంటంటే - ఇప్పటివరకూ వస్తున్న ఫోల్డబుల్‌ ఫోన్స్‌ తయారుచేస్తున్న కంపెనీలు తాము చేయబోతున్న ఫోల్డబుల్‌ ఫోన్‌ని మామూలు సైజ్‌లోనే ఉండేలా చూసుకుంటున్నాయి.

మోటోరోలా ఫోన్‌ తయారీ సంస్థ మడత పెట్టి మరింత చిన్నది చేసేందుకు ఫోల్డబుల్ ఫోన్ వాడుతుందని అంటున్నారు. ప్రస్తుతం ఉన్న సైజ్‌ స్క్రీన్‌నే ఇస్తూ - ఫోన్‌ చిన్నగా మారేందుకు ఈ ఫోల్డ్ ఉపయోగపడుతుందన్నమాట.

ఒక విధంగా చెప్పాలంటే మోటోరోలా ఫోల్డింగ్‌ ఫోన్‌ పాతతరం మడత ఫోన్లని గుర్తు చేస్తున్నా వాటికీ దీనికీ తేడా ఉంది. పాత తరం మడత ఫోన్లలో ఒక వైపు స్క్రీన్‌, మరో వైపు కీబోర్డ్‌ ఉండేవి. మోటరోలా ఫోన్ 2జీబీ ర్యామ్‌తో అందుబాటులోకి వచ్చింది. 13 మెగా పిక్సెల్ మెయిల్ కెమెరా, 2 మెగా పిక్సెల్ మాక్రో కెమెరా, 2 మెగా పిక్సెల్ డెప్త్ కెమెరా తదితర ఫీచర్లు ఇందులో ఉన్నాయి.