Asianet News TeluguAsianet News Telugu

''కిత్నే ఆద్మీ థే'' - కతువా, ఉన్నావా రేప్ లపై రేణుకా చౌదరి ఘాటు వ్యాఖ్యలు

మహిళలు తమపై అత్యాచారాలు జరిగినప్పటికి పోలీస్ స్టేషన్ కు వెళ్లడానికి ఎందుకు భయపడుతున్నారో వివరించారు కాంగ్రెస్ నాయకురాలు రేణుకా చౌదరి. ఉన్నావో,కతువా దారుణాల గురించి ఉత్తర ప్రదేశ్ పాట్నాలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె ఓ సినిమా డైలాగ్ తో మహిళ సమస్యల గురించి వివరించే ప్రయత్నం చేశారు. మహిళలపై అత్యాచారం జరగ్గానే పోలీస్ స్టేషన్ కు వెళితే  నీచమైన ప్రశ్నలతో వేధిస్తారని అందువల్లే బాధిత మహిళలు పోలీసులకు ఫిర్యాదు చేయడానికి భయపడుతున్నారని అన్నారు.

ఈ విషయాన్ని వివరించడానికి రేణుకా చౌదరి షోలే సినిమాలోని ఓ హిందీ డైలాగ్ వాడారు. '' ఆజ్ కల్ కోయీ మహిళా ఘర్ సె భాహర్ నహి నికల్తా హై. కొయీ ఘర్ సె బాహర్ నికల్తా హై ఉస్ కా బలత్కార్ హో జాతా హై. థానె మే జబ్ జాతా హై తబ్ యహీ పూచా జాతా హై ' కిత్నే ఆద్మీ థే''' ( ఇటీవల కాలంలో మహిళలు ఇంటి నుండి బైటికి రావడానికే భయపడుతున్నారు. ఒక వేళ బైటికి వస్తే వారిపై అత్యాచారాలు జరుగుతున్నాయి. దీనిపై ఫిర్యాదు చేయడానికి పోలీస్ స్టేషన్ కు వెళితే అక్కడ మొదట ఎదురయ్యే ప్రశ్న 'ఎంత మంది కలిసి రేప్ చేశారు')  ఇలాంటి ప్రశ్నలకు భయపడే మహిళలు తమపై జరిగే అకృత్యాలపై నోరు విప్పడం లేదని అన్నారు. దీన్ని అవకాశంగా తీసుకుని కామాంధులు రెచ్చిపోతున్నారని రేణుకా చౌదరి మండిపడ్డారు. 

దేశంలో మహిళల పరిస్థితిపై  ఎంపి రేణుకా వ్యాఖ్యానిస్తూ, ప్రస్తుతం చట్ట పరిధి మరింత దిగజారిందని పేర్కొన్నారు. అసలు చట్టాలే కఠినంగా ఉంటే కతువా, ఉన్నావా లో జరిగినటువంటి అఘాయిత్యాలు జరిగేవి కావని అన్నారు. దీనిపై ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం స్పందించి నిందితులను శిక్షించేలా, మహిళల్ని కాపాడే విధంగా చట్టాలు చేయాలని సూచించారు.

Congress leader Renuka Chowdhury kicks row over comment on gangrape

మహిళలు తమపై అత్యాచారాలు జరిగినప్పటికి పోలీస్ స్టేషన్ కు వెళ్లడానికి ఎందుకు భయపడుతున్నారో వివరించారు కాంగ్రెస్ నాయకురాలు రేణుకా చౌదరి. ఉన్నావో,కతువా దారుణాల గురించి ఉత్తర ప్రదేశ్ పాట్నాలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె ఓ సినిమా డైలాగ్ తో మహిళ సమస్యల గురించి వివరించే ప్రయత్నం చేశారు. మహిళలపై అత్యాచారం జరగ్గానే పోలీస్ స్టేషన్ కు వెళితే  నీచమైన ప్రశ్నలతో వేధిస్తారని అందువల్లే బాధిత మహిళలు పోలీసులకు ఫిర్యాదు చేయడానికి భయపడుతున్నారని అన్నారు.

ఈ విషయాన్ని వివరించడానికి రేణుకా చౌదరి షోలే సినిమాలోని ఓ హిందీ డైలాగ్ వాడారు. '' ఆజ్ కల్ కోయీ మహిళా ఘర్ సె భాహర్ నహి నికల్తా హై. కొయీ ఘర్ సె బాహర్ నికల్తా హై ఉస్ కా బలత్కార్ హో జాతా హై. థానె మే జబ్ జాతా హై తబ్ యహీ పూచా జాతా హై' కిత్నే ఆద్మీ థే''' ( ఇటీవల కాలంలో మహిళలు ఇంటి నుండి బైటికి రావడానికే భయపడుతున్నారు. ఒక వేళ బైటికి వస్తే వారిపై అత్యాచారాలు జరుగుతున్నాయి. దీనిపై ఫిర్యాదు చేయడానికి పోలీస్ స్టేషన్ కు వెళితే అక్కడ మొదట ఎదురయ్యే ప్రశ్న 'ఎంత మంది కలిసి రేప్ చేశారు')  ఇలాంటి ప్రశ్నలకు భయపడే మహిళలు తమపై జరిగే అకృత్యాలపై నోరు విప్పడం లేదని అన్నారు. దీన్ని అవకాశంగా తీసుకుని కామాంధులు రెచ్చిపోతున్నారని రేణుకా చౌదరి మండిపడ్డారు. 

దేశంలో మహిళల పరిస్థితిపై  ఎంపి రేణుకా వ్యాఖ్యానిస్తూ, ప్రస్తుతం చట్ట పరిధి మరింత దిగజారిందని పేర్కొన్నారు. అసలు చట్టాలే కఠినంగా ఉంటే కతువా, ఉన్నావా లో జరిగినటువంటి అఘాయిత్యాలు జరిగేవి కావని అన్నారు. దీనిపై ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం స్పందించి నిందితులను శిక్షించేలా, మహిళల్ని కాపాడే విధంగా చట్టాలు చేయాలని సూచించారు.

Follow Us:
Download App:
  • android
  • ios