Asianet News TeluguAsianet News Telugu

ఆస్తి కోసం కల్పిత గ్యాంగ్ రేప్ కథ అల్లిన మహిళ అరెస్టు..

యూపీలో కల్పిత గ్యాంగ్ రేప్ కట్టుకథ అల్లిన మహిళను పోలీసులు అరెస్టు చేశారు. కోర్టులో హాజరు పరిచారు. దీంతో కోర్టు ఆమెకు 14 రోజుల రిమాండ్ విధించింది.

Woman arrested for fabricating fake gang rape story for property
Author
First Published Oct 23, 2022, 11:15 AM IST

ఆస్తులు లాక్కునే క్రమంలో భాగంగా కల్పిత సామూహిక అత్యాచార కట్టుకథ అల్లిన మహిళను పోలీసులు అరెస్టు చేశారు. ఆమెతో పాటు మరో ముగ్గురు సహచరులు అయిన ఆజాద్, అఫ్జల్, గౌరవ్‌లను కూడా మోసం, ఫోర్జరీ కేసులో యూపీ ఘజియాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆమె వాంగ్మూలాన్ని నమోదు చేసేందుకు మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. దీంతో కోర్టు నిందితురాలికి 14 రోజుల జ్యుడీషియల్ విధించింది. 

టాయిలెట్ సీటు దొంగలించాడని దళితుడికి గుండు కొట్టించి, ముఖంపై మసి పూసి, స్తంభానికి కట్టేసి దాడి.. ఎక్కడంటే ?

అసలేం జరిగిందంటే ?
దేశ రాజధానిలో కొన్ని సంవత్సరాల కిందట సంచలనం రేకెత్తించిన నిర్భయ ఘటన మాదిరిగానే ఉత్తరప్రదేశ్ ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలో  ఓ గ్యాంగ్ రేప్ జరిగిందని నాలుగు రోజుల కిందట వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన దేశం మొత్తం ఒక్క సారిగా చర్చనీయాంశం అయ్యింది. దీంతో ఘజియాబాద్ పోలీసులు రంగంలోకి దిగారు. పలు బృందాలుగా ఏర్పడి దర్యాప్తు చేపట్టారు. కానీ వారి దర్యాప్తులో అదంతా ఫేక్ అని తేలింది. ఆస్తి కోసమే మహిళ, కొందరు సహచరులతో కలిసి సామూహిక అత్యాచారం జరిగిందని కట్టుకథ అల్లిందని నిర్ధారించారు. ఈ నేపథ్యంలోనే నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.

స్నేహితుడిపై దాడి చేసి.. మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌పై 10 మంది సామూహిక అత్యాచారం..

జీటీబీ ఎన్‌క్లేవ్‌కి చెందిన ఓ మహిళ తన సోదరుడి పుట్టినరోజును జరుపుకోవడానికి అక్టోబర్ 16న నంద్‌గ్రామ్‌కు వచ్చింది. పార్టీ నుంచి తిరిగి వస్తుండగా నలుగురు వ్యక్తులు స్కార్పియో కారులో ఆమెను బలవంతంగా అపహరించి అడవిలోకి తీసుకెళ్లారని మహిళ ఆరోపించింది. ఆమె సహోద్యోగి ఆ సమయంలో అక్కడే ఉన్నాడు. ఐదుగురు కలిసి ఆమెపై రెండు రోజుల పాటు సామూహిక అత్యాచారం చేసి, ఆమె ప్రైవేట్ పార్ట్‌లో ఇనుప రాడ్‌తో ఉంచారని ఆరోపించారు. నిందితులు ఆమెను అక్టోబరు 18వ తేదీన తెల్లవారుజామున గోనె సంచిలో కట్టి ఆశ్రమ రోడ్డులో వదిలి వెళ్లిపోయారని పేర్కొన్నారు.

భార్యాభర్తల చికెన్ గొడవ ... తలదూర్చిన పక్కింటాయన దారుణ హత్య

అయితే ఈ ఘటనపై బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేపట్టారు. అయితే ఆమె చెప్పిన విషయాలకు, దర్యాప్తులో భాగంగా పోలీసులు సేకరించిన సమాచారానికి పొంతన కుదరలేదు. ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించారు. అందులో ఫిర్యాదులో పేర్కొన్న విధంగా బాధితురాలి ప్రైవేట్ పార్ట్స్ కు ఎలాంటి గాయాలు కాలేదని నివేదికలు వచ్చాయి. దీంతో అనుమానం వచ్చిన పోలీసులు ఆమెను విచారిచడంతో అసలు విషయం బయటకు వచ్చింది. ఇదంతా డ్రామా అని తెలిసింది.

Follow Us:
Download App:
  • android
  • ios