Asianet News TeluguAsianet News Telugu

స్నేహితుడిపై దాడి చేసి.. మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌పై 10 మంది సామూహిక అత్యాచారం..

స్నేహితుడితో కలిసి బయటకు వెళ్లిన ఓ మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌పై 10 మంది సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. మహిళ స్నేహితుడిపై దాడి చేసి.. అనంతరంపై ఆమెపై సామూహిక అత్యాచారం జరిపారు. 

software engineer raped by 10 men after hit her male friend in Jharkhand
Author
First Published Oct 23, 2022, 10:07 AM IST

స్నేహితుడితో కలిసి బయటకు వెళ్లిన ఓ మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌పై 10 మంది సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. మహిళ స్నేహితుడిపై దాడి చేసి.. అనంతరంపై ఆమెపై సామూహిక అత్యాచారం జరిపారు. ఈ షాకింగ్ ఘటన జార్ఖండ్‌ చైబాసాలో జరిగింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకున్నారు. వివరాలు.. చైచాసాకు చెందిన 26 ఏళ్ల మహిళ ఓ ప్రముఖ  సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. ఆమె ప్రస్తుతం వర్క్ ఫ్రమ్ హోమ్ ద్వారా విధులు నిర్వర్తిస్తున్నారు. 

అయితే ఆమె గురువారం సాయంత్రం 7.30 గంటల ప్రాంతంలో తన స్నేహితుడితో కలిసి ఏరోడ్రోమ్ గ్రౌండ్‌లో షికారు చేస్తున్నారు. అయితే ఆ సమయంలో 10 మంది వారి వద్దకు వచ్చారు. వారు అక్కడ ఉండటంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. అదే సమయంలో ఇద్దరు యువకులు.. మహిళ స్నేహితుడిపై దాడి చేశారు. అనంతరం మహిళపై లైంగిక దాడికి పాల్పడ్డారు. ఆమె దాదాపు స్పృహ తప్పిన తర్వాత దుండగులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆమె ఫోన్, వాలెట్‌ను కూడా తీసుకుని పారిపోయారు. 

అయితే ఆ తర్వాత కొంతసేపటికి ఆమె అతి కష్టం మీద సమీపంలోని దుకాణం వద్దకు చేరుకుంది. అక్కడి నుంచి ఆమె తన తల్లిదండ్రులకు ఫోన్ చేశారు. అనంతరం ఈ ఘటనపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

ఈ ఘటనపై పోలీసులు మాట్లాడుతూ.. ఎఫ్‌ఐఆర్ నమోదు చేయబడిందని.. కేసును ప్రత్యేక దర్యాప్తు బృందం విచారిస్తుందని తెలిపారు. మహిళకు కౌన్సెలింగ్ చేయడానికి సైకాలజిస్ట్‌ను సంప్రదించామని చెప్పారు. నిందితులను గుర్తించగలనని మహిళ చెప్పినట్టుగా వెల్లడించారు. పరీక్షల నిమిత్తం ఆమెను ఆస్పత్రికి తరలించినట్టుగా పేర్కొన్నారు. ఇక, ఈ ఘటనకు సంబంధించి 12 మందిని విచారణ నిమిత్తం అదుపులోకి తీసుకున్నట్లు సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ (సదర్) దిలీప్ ఖల్కో తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios