Asianet News TeluguAsianet News Telugu

ఇండియాలోనే ఉంటా..! కమ్యూనిజాన్ని సమర్థిస్తా.. సంకుచిత చైనా నేతలతోనే సమస్య.. దలైలామా సంచలన వ్యాఖ్యలు

బౌద్ధ గురువు, టిబెట్ ఆధ్యాత్మిక నేత దలైలామా సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను కమ్యూనిజం, మార్క్సిజం వెనుక ఉన్న ఆదర్శాలను సమర్థిస్తానని అన్నారు. కానీ, చైనా కమ్యూనిస్టు నేతలు సంకుచితంగా ఉన్నారని, అందుకే సమస్య అని తెలిపారు. తాను భారత్‌లో ప్రశాంతంగా ఉండిపోవాలని భావిస్తున్నట్టు వివరించారు. భారత్ వీడాలనే ఆలోచన లేదని స్పష్టం చేశారు.
 

will remain in india says dalai lama
Author
New Delhi, First Published Nov 10, 2021, 3:09 PM IST

న్యూఢిల్లీ: Tibetకు చెందిన ఆధ్యాత్మిక గురువు Dalai Lama సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను Communism, Marxism వెనుక ఉన్న ఐడియాలను సమర్థిస్తానని అన్నారు. కానీ, కొందరు China నేతల సంకుచిత ఆలోచనలే అసలు సమస్య అని వివరించారు. చైనా సోదర సోదరీమణులతో తనకు శత్రుత్వం ఏమీ లేదని స్పష్టం చేశారు. వారు తోటి మనుషులే అని వివరించారు. అంతేకాదు, తాను తిరిగి టిబెట్‌కు లేదా చైనాకు వెళ్లలానే ఆలోచనలేవీ చేయడం లేదని, ప్రశాంతంగా Indiaలోనే ఉండిపోవాలని నిర్ణయించుకున్నట్టు వివరించారు. చైనా రాజధాని టోక్యోలో నిర్వహించిన ఓ ఆన్‌లైన్ కాన్ఫరెన్స్‌లో ఇండియా నుంచి దలైలామా పాల్గొని మాట్లాడారు.

చైనాలో మైనార్టీలపై కమ్యూనిజం ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతున్నదని, జిన్‌జియాంగ్ సహా పలుప్రాంతాల్లో Minoritiesను దారుణంగా అణచివేస్తున్నదని కొన్ని కథనాలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే త్వరలో చైనా నిర్వహించబోతున్న టోక్యో వింటర్ ఒలింపిక్స్‌ను బహిష్కరించాలనే ఆలోచనను అంతర్జాతీయ సమాజం ఆలోచన చేయాలా? లేదా? అనే ప్రశ్నకు దలైలామా సమాధానమిచ్చారు. ‘నాకు మావో జెడాంగ్ నుంచి కమ్యూనిస్టు పార్టీ నేతలు తెలుసు. వారి ఆలోచనలు చాలా బాగుంటాయి. కానీ, కొన్ని సార్లు వారు కంట్రోల్ చేయడానికి ఎక్కువ ఒత్తిడి, బలప్రయోగం చేస్తుంటారు’ అని వివరించారు. ‘టిబెట్, జిన్‌జియాంగ్ ప్రావిన్స్‌లలో మాది ప్రత్యేకమైన సంస్కృతి. కానీ, సంకుచిత చైనా కమ్యూనిస్టు నేతలతోనే సమస్య. విభిన్న సంస్కృతుల్లోని వైవిధ్యాన్ని, గొప్పతనాన్ని వారు అర్థం చేసుకోలేరు’ అని విమర్శించారు.

Also Read: కోవిడ్ 19 : పీఎం-కేర్స్ ఫండ్ కు దలైలామా సాయం

చైనాలో కేవలం హాన్ తెగ ప్రజలే లేరని, ఇంకా చాలా సంస్కృుతుల ప్రజలు ఉన్నారని దలైలామా అన్నారు. కానీ, వాస్తవంలో హాన్ ప్రజలే మొత్తం నియంత్రిస్తున్నారని తెలిపారు.

1950లో చైనా బలగాలు టిబెల్‌లో ప్రవేశించి దానిని స్వాధీనంలోకి తీసుకుంది. అప్పటి నుంచి టిబెట్ సున్నిత ప్రాంతంగా, అనేక ఆంక్షలు అమలవుతున్న ప్రాంతంగతా మారింది. చైనా పాలకులపై దలైలామా తిరుగుబాటుకు ప్రయత్నించి భంగపడ్డారు. అనంతరం 1959లో అక్కడి నుంచి పారిపోయి భారత్‌కు వచ్చారు. దలైలామాను వేర్పాటువాదిగా చైనా భావిస్తున్నది. టిబెట్‌లోని భిన్న సంస్కృతి, భాషలు మాట్లాడే ప్రజలకు అంతర్జాతీయ మద్దతు కోసం ప్రయత్నించారు. 

ఈ కాన్ఫరెన్స్‌లో దలైలామా మాట్లాడుతూ తాను కమ్యూనిజం, మార్క్సిజం చెప్పే ఐడియాలను మద్దతిస్తానని అన్నారు. ఈ సందర్భంగా ఓ వృత్తాంతాన్ని గుర్తు చేశారు. తాను ఒకసారి కమ్యూనిస్టు పార్టీలో చేరాలని భావించారని, కానీ, మిత్రులు వారించడంతో ఆగిపోయారని తెలిపారు.

తైవాన్‌ గురించీ ఆ కాన్ఫరెన్స్‌లో దలైలామాను అడిగారు. బలగాలు మోహరించి ఉద్రిక్తతలున్న ప్రాంతంగా ఇప్పుడు తైవాన్ ఉన్నది. ‘ఆర్థికంగా తైవాన్ చైనా నుంచి చాలా సహాయం తీసుకుంటుంది. నిజానికి చైనా బ్రదర్స్, సిస్టర్స్.. తైవాన్ బ్రదర్స్, సిస్టర్స్ నుంచి సంస్కృతి, సంప్రదాయాలను ఎంతో నేర్చుకోవచ్చు. బౌద్ధం సహా చైనా సంస్కృతి తైవాన్‌లోనే భద్రంగా ఉన్నది. చైనాలో ఇవి చాలా వరకు రాజకీయమైపోయాయి’ అని వివరించారు.

Also Read: దలైలామా వారసుడి ఎంపిక: అమెరికా బిల్లును స్వాగతించిన టిబెటన్ నేత

చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌ను కలవాలనే ఆలోచనలేవీ తనకు లేవని తెలిపారు. అయితే, తాను వయోధికుడు కావడంతో తన పాత మిత్రులను కలుసుకోవాలని ఉబలాటపడుతున్నట్టు వివరించారు. కానీ, చైనాతో సంబంధాలు సున్నితంగా మారడంతో తైవాన్ వెళ్లాలనుకోవడం లేదని అన్నారు. మత సామరస్యానికి కేంద్రంగా ఉన్న భారత్‌ను వదిలి వెళ్లాలని భావించడం లేదని వివరించారు. తాను ఇండియాలోనే ప్రశాంతంగా ఉండిపోతానని అన్నారు. భారత్‌లో ముస్లిం ఆరోపణలు ఎక్కువవుతున్న నేపథ్యంలో దలైలామా ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. కాగా, సర్వ మతాలు ఒకే సందేశాన్ని ఇస్తున్నాయని వివరించారు. అన్ని మతాలు వేర్వేరు తత్వాలతోనైనా చివరికి ప్రేమనే పంచుతాయనే సందేశం తెలుసుకోవాలని చెప్పారు. కానీ, కొందరు రాజకీయ నేతలు, ఆర్థిక వేత్తలు ఈ తేడాను అర్థం చేసుకోరని, అందుకే మతాలను రాజకీయం చేస్తుంటారని అన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios