Tata Nexon : కేవలం 30K సాలరీ ఉన్న చిరుద్యోగులు కూడా... ఈ కారును మెయింటేన్ చేయవచ్చు
భారతదేశంలో ప్రస్తుతం కాంపాక్ట్ SUV టాటా నెక్సాన్ హవా నడుస్తోంది దాని భద్రత, ప్రీమియం ఫీచర్లతో కస్టమర్లను ఆకర్షిస్తోంది. ఈ కారును మీరు చాలా ఈజీగా కొనుగోలు చేయవచ్చు.

టాటా నెక్సాన్
టాటా నెక్సాన్ ప్రస్తుతం భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న కాంపాక్ట్ SUVలలో ఒకటి. దీని విశాలమైన ఇంటీరియర్, సౌకర్యవంతమైన సీట్లు, అద్భుతమైన డిజైన్ ప్రయాణికులను ఆకర్షిస్తాయి.
ఇండియాలో టాటా హవా
భారత కార్ల పరిశ్రమలో టాటా మోటార్స్ వేగంగా ఎదుగుతోంది… ఇది మారుతి సుజుకి తర్వాత స్థానంలో ఉంది. ఇందులో నెక్సాన్ మోడల్ కీలక పాత్ర పోషిస్తోంది. ఇది పెట్రోల్, డీజిల్, CNG, ఎలక్ట్రిక్ (EV) పవర్‌ట్రెయిన్‌లలో అందుబాటులో ఉంది.
టాటా నెక్సాన్ ఈఎంఐ ఎంత?
టాటా నెక్సాన్ బేస్ మోడల్ ఆన్ రోడ్ ధర సుమారు రూ.9 లక్షల నుంచి టాప్ మోడల్ రూ.16 లక్షల వరకు ఉంటుంది. బేస్ మోడల్ కొంటే EMI తక్కువగా ఉంటుంది. ఉదాహరణకు రూ.3 లక్షల డౌన్ పేమెంట్ చెల్లించి 10% వడ్డీ రేటుతో 7 ఏళ్లకు రూ.6 లక్షల పైనాన్స్ తీసుకుంటే, నెలవారీ వాయిదా (EMI) సుమారు రూ.10,000 అవుతుంది. కాబట్టి నెలకు రూ.25-30 వేల సాలరీ ఉన్నవారుకూడా ఈ కారును మెయింటేన్ చేయవచ్చు.
నెక్సాన్ ఫీచర్లు
టాటా నెక్సాన్ ఫీచర్లలో సౌకర్యవంతమైన సస్పెన్షన్, హైవే వేగంతోనూ స్థిరత్వం, ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, అత్యుత్తమ భద్రతా వ్యవస్థలు ఉన్నాయి. దీంతో సుదూర ప్రయాణాల్లోనూ నెక్సాన్ మంచి అనుభూతిని ఇస్తుంది.
నెక్సాన్ మైలేజ్ ఎంత?
బేస్ మోడల్ స్మార్ట్ ప్లస్‌లో 1.2 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ ఉంది. ఇది 118 bhp శక్తిని అందిస్తుంది. దీని ARAI మైలేజ్ సుమారు 17.44 kmpl. ఇందులో LED హెడ్‌ల్యాంప్‌లు, ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ESP, మాన్యువల్ గేర్‌బాక్స్ వంటి అత్యాధునిక ఫీచర్లు ఉన్నాయి.

