Asianet News TeluguAsianet News Telugu

కర్తార్పూర్ సాహిబ్ గురుద్వారా విషయంలో పాక్ వైఖరిని తప్పుబట్టిన విశ్వహిందూ పరిషత్

ప్రపంచంలోనే అత్యంత ప్రాశస్త్యమైన గురుద్వారా ను ప్రబంధక్ కమిటీ పరిపాలన నుండి తొలగించి దానిని వేరే సంస్థకు, అందునా ముస్లిం మాత విశ్వాసాన్ని పాటించే సంస్థకు అప్పగించడం పూర్తిగా అనైతికమని, దీనిని భారత ప్రభుత్వం కూడా వ్యతిరేకించిందని, ప్రభుత్వానికి విశ్వహిందూ పరిషత్ ఈ విషయంలో సంపూర్ణ మద్దతును తెలియజేయడమే కాకుండా ఈ పోరులో భాగస్వాములమవుతున్నామని పేర్కొన్నారు. 

VHP Condemns Pakistan Governments decision over kartarpur sahib gurudwara
Author
Hyderabad, First Published Nov 6, 2020, 5:04 PM IST

పాకిస్తాన్ లోని కర్తార్పూర్ సాహిబ్ గురుద్వారా  పరిపాలనా  బాధ్యతలను పాకిస్తాన్ సిక్కు గురుద్వారా  ప్రబంధక్ కమిటీ నుండి తీసుకొని స్థానిక ఇవాక్యు ట్రస్ట్ బోర్డు కు అప్పగించదాన్ని విశ్వ హిందూ పరిషద్ తీవ్రంగా ఖండించింది. 

గురుద్వారా ప్రబంధక్ కమిటీ సైతం పరిపాలనలో భాగస్వాములేనని పాకిస్తాన్ చెబుతున్నప్పటికీ....  కొత్తగా బాధ్యతలను స్వీకరించిన బోర్డులో ఒక్క సిక్కు కూడా లేకపోవడం, ప్రభుత్వ అసలు సిసలు ఉద్దేశాన్ని బయటపెడుతుందని వారు ఆరోపించారు. 

ప్రపంచంలోనే అత్యంత ప్రాశస్త్యమైన గురుద్వారా ను ప్రబంధక్ కమిటీ పరిపాలన నుండి తొలగించి దానిని వేరే సంస్థకు, అందునా ముస్లిం మాత విశ్వాసాన్ని పాటించే సంస్థకు అప్పగించడం పూర్తిగా అనైతికమని, దీనిని భారత ప్రభుత్వం కూడా వ్యతిరేకించిందని, ప్రభుత్వానికి విశ్వహిందూ పరిషత్ ఈ విషయంలో సంపూర్ణ మద్దతును తెలియజేయడమే కాకుండా ఈ పోరులో భాగస్వాములమవుతున్నామని పేర్కొన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios