బెంగుళూరు: కాఫీ డే వ్యవస్థాపకుడు సిద్దార్ధ అదృశ్యమైన ఘటనపై విచారణ చేపట్టాలని కాంగ్రెస్ నేత డికె శివకుమార్ డిమాండ్ చేశారు. ఈ నెల 28వ తేదీన సిద్దార్ధ తనకు ఫోన్ చేశాడని డికె శివకుమార్  ట్వీట్ చేశాడు. 

 

వీజీ సిద్దార్ద సోమవారం సాయంత్రం నుండి కన్పించకుండా పోయాడు.నేత్రావది నది వద్ద ఆయన కారు నుండి దిగాడు. సిద్దార్ధ అదృశ్యమయ్యే ముందు కంపెనీ ఉద్యోగులకు లేఖ రాశాడు.

 

ఈ నెల 28వ తేదీన సిద్దార్ధ నుండి తనకు ఫోన్ వచ్చిందని ఆయన గుర్తు చేసుకొన్నారు. తనను కలుసుకోవాలని సిద్దార్ధ కోరుకొన్నట్టుగా శివకుమార్ చెప్పారు. సిద్దార్ధ అదృశ్యం వెనుక ఎవరున్నారో బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.


సంబంధిత వార్తలు

వీజీ సిద్ధార్థ ఇష్యూ.. చివరిగా ఫోన్ లో ఎవరితో మాట్లాడారు?

కర్ణాటక మాజీ సీఎం అల్లుడు అదృశ్యం: వంతెనపై నడుస్తూ మాయం

అదృశ్యం కాదు.. ఆత్మహత్య: శవమై తేలిన ఎస్ఎం కృష్ణ అల్లుడు సిద్ధార్ధ

‘ ఓడిపోయాను’’.. సిద్ధార్థ్ రాసిన లేఖ పూర్తి పాఠం ఇదీ..

130ఏళ్లుగా సిద్ధార్థ కుటుంబం ఇదే వ్యాపారంలో...