Upcoming week updates: అక్టోబర్ 19 నుంచి 26వ తేదీ వరకు జాతీయ, అంతర్జాతీయంగా పలు కీలక పరిణామాలు చోటు చేసుకోనున్నాయి. వీటికి సంబంధించిన కొన్ని ఆసక్తికర అప్‌డేట్స్ ఇప్పుడు తెలుసుకుందాం.
వచ్చే వారం బ్యాంకులకు సెలవులు ఇవే
* అక్టోబర్ 19 (ఆదివారం) – ఆదివారం కారణంగా దేశవ్యాప్తంగా బ్యాంకు సేవలు మూసి వేస్తారు.
* అక్టోబర్ 20 (సోమవారం) – దీపావళి : ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, త్రిపుర, మధ్యప్రదేశ్, చండీగఢ్, తమిళనాడు, ఉత్తరాఖండ్, అస్సాం, తెలంగాణ, అరుణాచల్ ప్రదేశ్, కేరళ, నాగాలాండ్, పశ్చిమ బెంగాల్, ఢిల్లీ, గోవా, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, గుజరాత్, మిజోరాం, కర్ణాటక, మేఘాలయ, హిమాచల్ ప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో బ్యాంకులు క్లోజ్ ఉంటాయి.
* అక్టోబరు 22 (మంగళవారం) - గోవర్ధన్ పూజ: గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక, ఉత్తరాఖండ్, సిక్కిం, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాల్లో బ్యాంకులు పని చేయవు.
* అక్టోబర్ 25వ తేదీన నాల్గవ శనివారం కారణంగా దేశంలో అన్ని బ్యాంకులకు సెలవు.
* అక్టోబర్ 26న ఆదివారం బ్యాంకులు పనిచేయవు.
ఈ వారం వినోదల విందు
బాలీవుడ్ సినిమాలు
ల మూవీ, దర్శకత్వం ఆదిత్య సర్పోత్దార్.
ప్రధాన పాత్రల్లో ఆయుష్మాన్ ఖురానా, రష్మిక మందన్నా నటిస్తున్నారు.
నిర్మాతలు దినేష్ విజన్, అమర్ కౌశిక్ (Maddy Films). ఈ హారర్ కామెడీ మూవీ అక్టోబర్ 21న ప్రేక్షకుల ముందుకు రానుంది.
* Ek Deewane Ki Deewaniyat (ఏక్ దీవానే కి దీవానియత్)
రొమాంటిక్ ఎంటర్‌టైనర్, దర్శకత్వం మిలాప్ మిలన్ జవేరి.
హర్షవర్ధన్ రానే, సోనమ్ బజ్వా ప్రధాన పాత్రలు.
ప్రేమ, మోజు, ప్యాషన్ చుట్టూ సాగే కథ.
విడుదల తేదీ: అక్టోబర్ 21, 2025.
తమిళ సినిమాలు
Dude (డ్యూడ్)
రొమాంటిక్ యాక్షన్ కామెడీ, దర్శకత్వం కీర్తిశ్వరన్ (డెబ్యూ).
ప్రదీప్ రంగనాథన్, మమిత బైజు జంటగా నటించారు.
మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం, సంగీతం సాయి అభ్యంకర్.
విడుదల తేదీ: అక్టోబర్ 17, 2025.
Bison (బైసన్)
దర్శకుడు మారి సెల్వరాజ్.
ధ్రువ్ విక్రమ్, అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలు.
క్రీడా నేపథ్యంలోని ప్రేరణాత్మక కథ.
నిర్మాత పా. రంజిత్ (Neelam Productions).
విడుదల తేదీ: అక్టోబర్ 17, 2025.
Diesel (డీజిల్)
హరీష్ కల్యాణ్, అథుల్య రవి హీరోహీరోయిన్లు.
దర్శకుడు శణ్ముగం ముత్తుస్వామి.
థర్డ్ ఐ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మాణం.
యాక్షన్, ఎమోషన్ కలగలిపిన చిత్రం.
విడుదల తేదీ: అక్టోబర్ 17, 2025.
తెలుగు సినిమాలు
తెలుసు కదా
* దర్శకత్వం నీరజా కోన.
* సిధ్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా, శ్రీనిధి శెట్టి ప్రధాన పాత్రలు.
* సంగీతం థమన్ ఎస్.
* విడుదల తేదీ: అక్టోబర్ 17, 2025.
K-Ramp (కే-రాంప్)
* కిరణ్ అబ్బవరం, యుక్తి థారేజా హీరోహీరోయిన్లు.
* దర్శకత్వం జైన్స్ నాని.
* హస్య మూవీస్ బ్యానర్‌పై రూపొందింది.
* విడుదల తేదీ: అక్టోబర్ 18, 2025.
* బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ నటించిన హారర్ థ్రిల్లర్ కిష్కింధ పురి ZEE5లో అక్టోబర్ 17 సాయంత్రం 6 గంటలకు స్ట్రీమింగ్ ప్రారంభమైంది. కాగా జీ తెలుగులో అక్టోబర్ 19న టెలికాస్ట్ కానుంది.
ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలు కురిసే అవకాశం
రుతుపవనాల ఉపసంహరణ తర్వాత అక్టోబర్ 24 నాటికి ఆగ్నేయ బంగాళాఖాతం, అండమాన్ సముద్రం పరిసరాల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఇది తరువాత పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ వాయుగుండంగా బలపడే సూచనలు ఉన్నాయని పేర్కొంది. అక్టోబర్ 26 నాటికి ఇది తుఫానుగా మారే అవకాశం ఉండగా, తొలి దశలో ఉత్తర తమిళనాడు, దక్షిణ ఆంధ్ర తీరాల వైపు కదిలే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
ఈ వారమైనా స్పష్టత వస్తుందా.?
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలపై మరోసారి హైకోర్టు దృష్టి సారించింది. ఎన్నికలు ఆలస్యమవుతున్న కారణంపై స్పష్టత ఇవ్వాలని ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ను ఆదేశించింది. సురేందర్ అనే న్యాయవాది దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన సీజే ధర్మాసనం, ఇప్పటికే పాత రిజర్వేషన్ల ప్రకారం ఎన్నికలు నిర్వహించాలని ఇచ్చిన పూర్వ ఆదేశాలను గుర్తుచేసింది. సుప్రీంకోర్టు కూడా ఎన్నికలు తప్పనిసరిగా జరగాలని చెప్పిన నేపథ్యంలో, హైకోర్టు ఈసీ నుంచి స్పష్టమైన సమాధానం కోరింది. దీంతో వచ్చే వారంలో అయినా ఎన్నికల షెడ్యూల్‌పై స్పష్టత రావచ్చన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి. మరి తెలంగాణ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.
క్రికెట్ ప్రియులకు ఈ వారం పండగే
ఈ వారంలో శ్రీలంక తప్ప అన్ని జట్లు బరిలోకి దిగనున్నాయి.
మహిళల వరల్డ్‌కప్‌తో పాటు పురుషుల సిరీస్‌లు కూడా జోరందుకుంటున్నాయి.
న్యూజిలాండ్ vs ఇంగ్లాండ్ (మహిళల టీ20 సిరీస్)
తొలి టీ20: అక్టోబర్ 18
రెండో టీ20: అక్టోబర్ 20
మూడో టీ20: అక్టోబర్ 23. మూడు మ్యాచులతో సిరీస్ ముగియనుంది.
బంగ్లాదేశ్ vs వెస్టిండీస్ (వన్డే & టీ20 సిరీస్)
వన్డే సిరీస్ ప్రారంభం: అక్టోబర్ 18
రెండో వన్డే: అక్టోబర్ 21, మూడోది: అక్టోబర్ 23
టీ20 సిరీస్ తేదీలు: అక్టోబర్ 27, 29, 31
పాకిస్థాన్ vs సౌతాఫ్రికా
తొలి టెస్ట్ ప్రారంభం: అక్టోబర్ 20
టీ20 సిరీస్: అక్టోబర్ 28, 31, నవంబర్ 1
జింబాబ్వే vs ఆఫ్ఘనిస్తాన్
ఒకే ఒక టెస్ట్ మ్యాచ్: అక్టోబర్ 20న ప్రారంభమవుతుంది.
భారత జట్టు ఆస్ట్రేలియా పర్యటన (వైట్ బాల్ సిరీస్)
వన్డేలు: అక్టోబర్ 19 (పెర్త్), అక్టోబర్ 23 (అడిలైడ్), అక్టోబర్ 25 (సిడ్నీ)
టీ20లు: అక్టోబర్ 29 (మనుకా ఓవల్) నుంచి నవంబర్ 8 వరకు
మిగతా వేదికలు: మెల్‌బోర్న్, హోబర్ట్, గోల్డ్ కోస్ట్, బ్రిస్బేన్
2020 తర్వాత భారత జట్టు ఆస్ట్రేలియాలో వైట్ బాల్ సిరీస్ ఆడటం ఇదే మొదటి సారి.
ఆది కర్మయోగి అభియాన్
వికసిత్ భారత్@2047 లక్ష్యాన్ని చేరుకునేందుకు కేంద్ర ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. అన్ని రంగాల్లో సమగ్ర ప్రగతి సాధించేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. ఈ క్రమంలో గిరిజన అభివృద్ధి, నాయకత్వాన్ని ప్రోత్సహించేందుకు "ఆది కర్మయోగి అభియాన్" పై జాతీయ సదస్సు అక్టోబర్ 17న న్యూఢిల్లీలో నిర్వహించారు. 2047 నాటికి అభివృద్ధి చెందిన భారతదేశ నిర్మాణంలో గిరిజన సమాజం కీలక భాగస్వామ్యం కావడం ఈ సమావేశం ప్రధాన ఉద్దేశ్యం.
పుతిన్‌తో భేటీ కానున్న ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. రష్యా అధ్యక్షుడు వ్లాదమిర్ పుతిన్‌తో వచ్చే వారం లేదా తర్వాతి వారంలో భేటీ కానున్నట్లు ప్రకటించారు. ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలు మరోసారి ప్రపంచ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఉక్రెయిన్-రష్యా యుద్ధం, నాటో ఒత్తిళ్లు, గ్లోబల్ పవర్ బ్యాలెన్స్‌పై ఈ మీటింగ్ ప్రభావం ఉంటుందనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి.
