అన్నిట్లో యూపీ నెంబర్ వన్ ... ఆ ఒక్కదాంట్లో మాత్రం ఏపీ టాప్

ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్‌లో దేశంలోనే ఉత్తరప్రదేశ్ అగ్రస్థానంలో నిలిచింది. చాలా విషయాల్లో యూపీ నెంబర్ వన్ గా నిలిస్తే ఒక్క విషయంలో మాత్రం ఏపీ టాప్ లో నిలిచింది. అదేంటో తెలుసా?

UP achieves top rank in Ayushman Bharat Digital Mission initiatives AKP

లక్నో : ఏడేళ్ళక్రితం ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ పాలనా పగ్గాలు చేపట్టిన విషయం తెలిసిందే. ఇలా యోగి సర్కార్ ఏర్పడిన తర్వాత యూపీ హెల్త్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను బలోపేతం చేయడానికి, రోగులకు నాణ్యమైన, చవకైన చికిత్సను అందించడానికి అనేక నిర్ణయాలు తీసుకుంది. నేడు దీని ప్రభావం మొత్తం రాష్ట్రంలో కనిపిస్తుంది. ఇప్పుడు రాష్ట్ర ప్రజలు చికిత్స కోసం ఎక్కడెక్కడికో తిరగాల్సిన అవసరం లేదు. యోగి సర్కార్ పర్యవేక్షణ, దృఢ సంకల్పం కారణంగానే ఉత్తరప్రదేశ్ ఆరోగ్య సంరక్షణలో దేశంలోనే తన జెండాను ఎగురవేసింది. ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ యొక్క వివిధ విభాగాలలో ఉత్తరప్రదేశ్ దేశంలో మొదటి స్థానంలో ఉంది.

ఈ సందర్భంగా యూపీ ఆరోగ్య, వైద్య కార్యదర్శి రంజన్ కుమార్ మాట్లాడుతూ... ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆదేశాల మేరకు ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ (ABDM) కింద రాష్ట్ర ప్రజల ఆరోగ్యానికి సంబంధించి ప్రత్యేక ఐడీలను యుద్ధప్రాతిపదికన రూపొందించే పని జరుగుతోందన్నారు. ఉత్తరప్రదేశ్ ABDM యొక్క వివిధ విభాగాలను రూపొందించడంలో దేశంలోనే మొదటి స్థానంలో ఉందన్నారు. వీటిలో యూపీ ABHA ఐడీ, హెల్త్ ప్రొఫెషనల్ రిజిస్ట్రీ, హెల్త్ ఫెసిలిటీ రిజిస్ట్రీ, 100 మైక్రోసైట్ ప్రాజెక్ట్, స్కాన్ & షేర్ మాడ్యూల్ విషయంలో దేశంలోనే మొదటి స్థానంలో ఉండగా, ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్‌లో దేశంలో రెండవ స్థానంలో ఉందని తెలిపారు.

ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ కింద ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ (ABHA) గత సంవత్సరం నుండి రాష్ట్రంలో అమలు చేయబడింది. ఇప్పటివరకు రాష్ట్రం దాదాపు 12.45 కోట్ల ఆయుష్మాన్ భారత్ ఐడీలను సృష్టించి దేశంలోనే మొదటి స్థానంలో ఉంది. రెండవ స్థానంలో మహారాష్ట్ర ఉంది. ఇక్కడ ఇప్పటివరకు దాదాపు 5.46 కోట్ల ఆభా ఐడీలు సృష్టించబడ్డాయి.

ఇక హెల్త్ ప్రొఫెషనల్ రిజిస్ట్రీ (HPR) లో వైద్యులు, నర్సులు, సిహెచ్ఓలు, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు వంటి వివిధ స్థాయిలో ప్రజలకు వైద్యం అందించేవారు, అధికారులను  నమోదు చేస్తున్నారు. ఇప్పటివరకు 74,789 మంది నమోదు చేసుకున్నారు. ఈ విషయంలోనూ యూపీ దేశంలోనే మొదటి స్థానంలో ఉంది. రెండవ స్థానంలో కర్ణాటక ఉంది, ఇక్కడ ఇప్పటివరకు దాదాపు 58,919 హెల్త్ ప్రొఫెషనల్ రిజిస్ట్రీలు సృష్టించబడ్డాయి.

61,015 హెల్త్ ఫెసిలిటీ రిజిస్ట్రీలు నమోదు 

హెల్త్ ఫెసిలిటీ రిజిస్ట్రీ (HFR) లో అన్ని వైద్య సంస్థలు, ఆసుపత్రులు, ఆరోగ్య కేంద్రాలు, ఉప కేంద్రాలు, ప్రైవేట్ ఆసుపత్రులు, క్లినిక్‌లు, డయాగ్నస్టిక్స్ మొదలైనవి నమోదు చేసుకోవాల్సి వుటుంది. ఇప్పటివరకు యూపీలో 61,015 హెల్త్ ఫెసిలిటీ రిజిస్ట్రీలు నమోదు చేయబడ్డాయి. ఈ విషయంలో కూడా ఉత్తరప్రదేశ్ ప్రస్తుతం దేశంలోనే మొదటి స్థానంలో ఉంది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ వైద్య సంస్థలు, ఆసుపత్రులు, ఉప కేంద్రాల నమోదు 100% పూర్తయింది. ఈ హెల్త్ ఫెసిలిటీ రిజిస్ట్రీలో కర్ణాటక రెండవ స్థానంలో  ఉంది. ఇక్కడ ఇప్పటివరకు దాదాపు 60,743 హెల్త్ ఫెసిలిటీ రిజిస్ట్రీలు సృష్టించబడ్డాయి.

ABDM కింద నడుస్తున్న స్కాన్ & షేర్ మాడ్యూల్ ద్వారా ప్రభుత్వ ఆసుపత్రులలో నమోదులో ఎదురయ్యే ఇబ్బందులను విజయవంతంగా తగ్గిస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రులలో రోగులు లేదా వారి సంరక్షకులు ఓపిడి నమోదు కోసం దాదాపు 50 నిమిషాలు వేచి ఉండాల్సిన పరిస్థితిని స్కాన్ & షేర్ మాడ్యూల్ ద్వారా తగ్గించారు... ఇప్పుడు వెయిటింగ్ సమయం దాదాపు 5 నిమిషాలుగా వుంది. ఈ స్కాన్ & షేర్ మాడ్యూల్‌లో ఉత్తరప్రదేశ్ దేశంలోనే మొదటి స్థానంలో ఉంది. ప్రస్తుతం 1.42 కోట్లకు పైగా టోకెన్‌లను సృష్టించడం ద్వారా రోగులకు ప్రయోజనం చేకూరుస్తోంది, రెండవ స్థానంలో బీహార్ ఉంది, ఇక్కడ 95 లక్షలకు పైగా టోకెన్‌లు సృష్టించబడ్డాయి.

రాష్ట్రవ్యాప్తంగా 35 మైక్రోసైట్లు

భారత ప్రభుత్వ జాతీయ ఆరోగ్య అథారిటీ అమలు చేస్తున్న 100 మైక్రోసైట్ ప్రాజెక్ట్‌లో 35 యూపీలో నిర్వహిస్తున్నారు. ప్రైవేట్ రంగంలో ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్‌ను స్వీకరించడానికి మైక్రోసైట్‌లను ప్రవేశపెట్టారు. ఇందులో ప్రస్తుతం అత్యధిక ఆరోగ్య రికార్డులను రాష్ట్రం నుండే జోడిస్తున్నారు. ఇందులో రాజధాని లక్నో దేశంలోనే మొదటి మైక్రోసైట్, ఇది నిర్దేశించిన లక్ష్యాన్ని మొదటగా సాధించింది. దీని ద్వారా రోగులకు సౌకర్యాలు కల్పించడమే కాకుండా, ఆసుపత్రులలో మెరుగైన క్యూ మేనేజ్‌మెంట్, ఆసుపత్రి నిర్వహణ, డేటా నిర్వహణ ద్వారా వైద్య వ్యవస్థలను మరింత పారదర్శకంగా, సులభతరం చేస్తున్నారు.

ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్ (EHR/PHR) సృష్టించడానికి ఆసుపత్రిలో ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ కంప్లైంట్ హెల్త్ మేనేజ్‌మెంట్ ఇన్ఫర్మేషన్ ఉండటం అవసరం. దీని ద్వారా రోగుల డేటాను ఆసుపత్రిలో స్థానికంగా నిర్వహించవచ్చు. రాష్ట్రంలో ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్‌లను సృష్టించడానికి వివిధ ఆసుపత్రులలో ల్యాబ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఇంటిగ్రేషన్ జరుగుతోంది.

రాష్ట్రంలో ఇప్పటివరకు దాదాపు 5.25 కోట్ల ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్‌లు సృష్టించబడ్డాయి. ప్రస్తుతం రాష్ట్రం భారతదేశంలో రెండవ స్థానంలో ఉంది, మొదటి స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉంది, ఇది ఇప్పటివరకు 5.32 కోట్ల ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్‌లను సృష్టించింది. త్వరలోనే రాష్ట్రం ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్‌లను సృష్టించడంలో దేశంలోనే మొదటి స్థానంలో నిలుస్తుందని యూపీ ఆరోగ్య, వైద్య కార్యదర్శి రంజన్ కుమార్ ఆశాభావం వ్యక్తం చేసారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios