జార్ఖండ్ ఎగ్జిట్ పోల్: హేమంత్ సోరెన్ vs NDA? ఎవరిది గెలుపు?
Jharkhand Assembly Election Exit Polls : జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల రెండో దశ పూర్తయింది. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఊహించని విధంగా ఉన్నాయి. ఇండియా కూటమి ఓడిపోతుందా? గెలుస్తుందా?
Jharkhand Assembly Election exit polls:: జార్ఖండ్‌లోని 81 అసెంబ్లీ స్థానాలకు జరుగుతున్న ఎన్నికల్లో రెండో దశ బుధవారం ముగిసింది. రెండో దశలో 38 స్థానాలకు పోలింగ్ జరిగింది. ఈ క్రమంలోనే వెలువడిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఊహించని విధంగా ఉన్నాయి. అభ్యర్థుల భవిష్యత్తు ఈవీఎంలలో బంధీ అయింది. కానీ ఎగ్జిట్ పోల్స్ అంచనాలు కొన్ని పార్టీలకు ఆందోళన కలిగిస్తుండగా, మరికొన్నింటికి ఉపశమనం కలిగిస్తున్నాయి. ఎగ్జిట్ పోల్స్ ప్రకారం, జార్ఖండ్‌లో ఇండియా కూటమికి ఎదురుదెబ్బ తగిలి అధికారం కోల్పోయే అవకాశం ఉంది. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంది. జార్ఖండ్ ఎన్నికల ఫలితాలకు సంబంధించి వివిధ ఎగ్జిట్ ఫోల్ ఫలితాలు ఇలా ఉన్నాయి..
MATRIZE ఎగ్జిట్ పోల్ సర్వే ప్రకారం, హేమంత్ సోరెన్ ప్రభుత్వం ఈసారి తిరిగి అధికారంలోకి రావడం లేదు. ఎన్డీఏ ఈసారి మెజారిటీ స్థానాలతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. ఎన్డీఏకు 46 స్థానాలు, ఇండియాకు 29 స్థానాలు, ఇతరులకు 6 స్థానాలు వస్తాయి.
న్యూస్ 18-మ్యాట్రిక్స్ ప్రకారం, ఎన్డీఏకు 42-47 స్థానాలు, ఇండియాకు 25-37 స్థానాలు, ఇతరులకు 5-9 స్థానాలు వస్తాయి.
పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్ ప్రకారం, ఎన్డీఏకు 44-53 స్థానాలు, ఇండియాకు 25-37 స్థానాలు, ఇతరులకు 5-9 స్థానాలు వస్తాయి.
జెవిసి ఎగ్జిట్ పోల్ ప్రకారం, ఎన్డీఏకు 40-44 స్థానాలు, ఇండియాకు 30-40 స్థానాలు, ఇతరులకు 1 స్థానం వస్తుంది.
చాణక్య స్ట్రాటజీస్ ఎగ్జిట్ పోల్ ప్రకారం, ఎన్డీఏకు 45-50 స్థానాలు, ఇండియాకు 35-38 స్థానాలు, ఇతరులకు 3-5 స్థానాలు వస్తాయి.
యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్ ప్రకారం, ఇండియాకు మెజారిటీ వస్తుంది. ఈ కూటమికి 53 స్థానాలు, ఎన్డీఏకు 25 స్థానాలు, ఇతరులకు 3 స్థానాలు వస్తాయి.
పి-మార్క్ ఎగ్జిట్ పోల్ ప్రకారం, ఎన్డీఏకు 31-40 స్థానాలు, ఇండియాకు 37-47 స్థానాలు, ఇతరులకు సున్నా స్థానాలు వస్తాయి.
సి-ఓటర్ ప్రకారం, ఎన్డీఏకు 34 స్థానాలు, ఇండియాకు 26 స్థానాలు వస్తాయి.
జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీ ఎంతమంది అభ్యర్థులను నిలబెట్టింది?
జార్ఖండ్‌లో 81 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఇక్కడ రెండు దశల్లో పోలింగ్ జరిగింది. మొదటి దశలో నవంబర్ 13న 43 స్థానాలకు, రెండో దశలో నవంబర్ 20న 38 స్థానాలకు పోలింగ్ జరిగింది. ఇక్కడ ప్రధాన పోటీ ఎన్డీఏ, ఇండియా కూటముల మధ్య ఉంది. ఎన్డీఏలో బిజెపి, ఏజెఎస్‌యు ఉన్నాయి. ఇండియా కూటమిలో జెఎంఎం, కాంగ్రెస్, ఆర్జెడి, లెఫ్ట్ పార్టీలు ఉన్నాయి. ఇక్కడ హేమంత్ సోరెన్ నేతృత్వంలో ఇండియా కూటమి ప్రభుత్వం ఉంది.