జమ్మూకాశ్మీర్‌పై భారత్-పాక్‌ల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గురువారం లఢఖ్‌లోని డిఫెన్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హై ఆల్టిట్యూడ్ రీసెర్చ్ సెంటర్ నిర్వహించిన 26వ కిసాన్-జవాన్ విజ్ఞాన్ మేళాను ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా రాజ్‌నాథ్ మాట్లాడుతూ.. ఉగ్రవాదులను పెంచి పోషిస్తూ.. భారత్‌ను నాశనం చేయాలని చూస్తోన్న పాకిస్తాన్‌తో ఏమీ మాట్లాడగలం.. పాక్‌తో మంచి సంబంధాలు కొనసాగించాలనే తాము కోరుకుంటున్నామని రాజ్‌నాథ్ స్పష్టం చేశారు.

పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఎప్పటికీ భారత్‌లో అంతర్భాగమేనన్నారు. ముందు ఉగ్రవాదాన్ని అరికట్టేందుకు పాక్ తగిన చర్యలు తీసుకోవాలని ఆయన తెలిపారు.

కాగా.. జమ్మూకాశ్మీర్‌కు ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేసి...కేంద్రం రాష్ట్రాన్ని రెండు భాగాలుగా విభజించిన సంగతి తెలిసిందే. ఈ పరిణామాల తర్వాత లడఖ్‌ను రాజ్‌నాథ్ సింగ్ మొదటిసారిగా సందర్శించారు. 

కాంగ్రెస్ కి మరో ఝలక్: మోదీకి జై కొట్టిన జ్యోతిరాదిత్య సింధియా

 

కాంగ్రెస్ కు ఝలక్: ఆర్టికల్ 370 రద్దుకు ఎమ్మెల్యే జగ్గారెడ్డి మద్దతు

సొంత పార్టీకి షాక్.. కేంద్రం నిర్ణయానికి జైకొట్టిన కాంగ్రెస్ ఎమ్మెల్యే

ఇండియాను చైనాలా, కశ్మీర్ ను పాలస్తీనాలా మారుస్తారా?: ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఆగ్రహం

కాశ్మీర్ విభజనను వ్యతిరేకిస్తే దేశ ద్రోహులుగా చూస్తున్నారు: నామా

పార్లమెంట్‌లో అబద్దాలు: అమిత్ షా పై ఫరూక్ అబ్దుల్లా

ఆర్టికల్ 370 రద్దు: సుప్రీంకోర్టులో పిటిషన్

కాశ్మీర్ విభజన బిల్లు: లోక్‌సభ నుండి టీఎంసీ వాకౌట్