శబరిమలలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. ఇద్దరు మహిళలు అయ్యప్ప దర్శనం కోసం రావడంతో భక్తులు వారిని పంబ వద్ద అడ్డుకున్నారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు పరిస్థితి అదుపు తప్పకుండా ఇద్దరు మహిళలను భద్రత నడుమ నీలక్కల్‌లోని బేస్ క్యాంప్‌కు తరలించారు.

మరోవైపు హిందూ సంఘాలు, అయ్యప్ప భక్తులు పంబ వద్ద ఆందోళనకు దిగారు. వీరిద్దరిని కేరళకు చెందిన షాలిని రాజేశ్, రెహ్మాన్‌లుగా పోలీసులు గుర్తించారు. ఈ సంఘటనకు తోడు నిన్న కేరళ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు సమర్పించిన నివేదిక ఆందోళనకారుల్లో మరింత ఆగ్రహాన్ని తెప్పించింది.
51 మంది మహిళలు స్వామిని దర్శించుకున్నారని, మరో 7 వేల మంది మహిళలు రిజిస్ట్రేషన్ చేసుకున్నారని ప్రభుత్వం చెప్పిన అంశాన్ని అయ్యప్ప భక్తులు ఖండించాయి. అవన్నీ తప్పుడు లెక్కలేనని, అయ్యప్పను అంతమంది మహిళలు దర్శించుకోలేదని వారు చెబుతున్నారు.
అయ్యప్ప భక్తులు చంపేస్తారు: సుప్రీంను ఆశ్రయించిన ‘‘ఆ ఇద్దరు మహిళలు’’
51 మంది మహిళలు అయ్యప్పను దర్శించుకున్నారు: సుప్రీంకు కేరళ సర్కార్ నివేదిక
శబరిమలలోకి మహిళల ఆలయ ప్రవేశం.. సగం మీసంతో ఆందోళన
శబరిమల వివాదం.. ప్రధాన అర్చకుడికి చుక్కెదురు