టీవీ యాక్టర్ దాష్టీకం: మత్తు పానీయం ఇచ్చి అమ్మాయిపై రేప్

TV reality show actor rapes 17 year old girl
Highlights

ఓ టీవీ యాక్టర్ నమ్మిన పాపానికి బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. పదిహేడేళ్ల బాలికను ఇంటికి తీసుకువెళ్లాడు.

ముంబై :  ఓ టీవీ యాక్టర్ నమ్మిన పాపానికి బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. పదిహేడేళ్ల బాలికను ఇంటికి తీసుకువెళ్లాడు. ఆమెకు మత్తుమందు కలిపిన కూల్ డ్రింక్ తాగించి అత్యాచారం జరిపిన దారుణ ఘటన ముంబైలో జరిగింది. ముంబై నగరంలోని నల్లసోపర ప్రాంతానికి చెందిన ఆదిత్యగుప్తా (20) టీవీ రియాల్టీ షో నటుడు. 

ఇతనికి ఇన్‌స్టాగ్రామ్ ద్వార ఓ పదిహేడేళ్ల బాలిక పరిచయమైంది. బాలికతో ఛాటింగ్ చేస్తూ వచ్చాడు. ఆదిత్య గుప్తా బాలికను నల్లసోపర ప్రాంతంలోని తన ఇంటికి తీసుకువెళ్లాడు. బాలికకు మత్తు మందు కలిపిన కూల్ డ్రింక్ ఇచ్చి మత్తులోకి  వెళ్లగానే ఆమెపై ఆదిత్య అత్యాచారం చేశాడు. 
ఆ తర్వాత బాలికను అంధేరీలోని మెక్ డొనాల్డ్ హోటల్ వద్ద వదిలిపెట్టి పారిపోయాడు. తన కూతురు కనిపించడం లేదని అంధేరీ ప్రాంతానికి చెందిన బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 

పోలీసులు గాలింపు చేపట్టడంతో బాలిక మెక్ డొనాల్డ్ వద్ద కనిపించింది. ఆమెను బాబా ఆసుపత్రికి తీసుకువెళ్లి పరీక్షించగా అత్యాచారానికి గురైందని తేలింది. సీసీటీవీ ఫుటేజ్, ఫోన్ కాల్ డేటా ఆధారంగా నిందితుడైన టీవీ నటుడు ఆదిత్య గుప్తాను అరెస్టు చేశారు. 

loader