మద్యం మత్తులో స్నేహితుడి రక్తం తాగాలని ప్రయత్నం.. ప్రాణాలకే ముప్పు తెచ్చిన కోరిక.. అసలేమైందంటే ?
స్నేహితులతో కలిసి మద్యం తాగిన ఓ వ్యక్తికి కలిగిన వింత కోరిక అతడి ప్రాణాల మీదకి తెచ్చింది. స్నేహితుడి రక్తం తాగాలని ప్రయత్నించి ప్రాణాలు పోగొట్టుకున్నాడు. ఈ ఘటన మహారాష్ట్రలో జరిగింది.
వారంతా స్నేహితులు. సరదాగా కలిసి మద్యం సేవించారు. కొంత సమయం తరువాత అందులో ఓ స్నేహితుడికి వింత కోరిక కలిగింది. తనకు రక్తం తాగాలని ఉందని చెప్పాడు. కొంత సమయం తరువాత ఎవరి రక్తం తాగాలనేది నిర్ణయించుకున్నాడు. ఆ స్నేహితుడి మెడ కొరికాడు. కానీ ఆ ప్రయత్నం అతడి ప్రాణాలు పోయేందుకు కారణం అయ్యింది. మహారాష్ట్రలో ఈ వింత ఘటన జరిగింది.
కారుకు దారివ్వాలని గొడవ.. ఆదివాసిపై బీజేపీ ఎమ్మెల్యే కుమారుడి కాల్పులు..
వివరాలు ఇలా ఉన్నాయి. పింప్రి చించ్వాడ్ జిల్లా భోసారి ప్రాంతానికి చెందిన 24 ఏళ్ల రాహుల్ లోహర్, 26 ఏళ్ల ఇష్తియాక్ ఖాన్ స్నేహితులు. వీరిద్దరూ బుధవారం మరో ఇద్దరు స్నేహితులను కలిశారు. అదే రోజు సాయత్రం పార్టీ చేసుకోవాలని భావించారు. దాని కోసం ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. ఓ ప్రాంతంలో తీరిగ్గా కూర్చొని మద్యం తాగడం మొదలు పెట్టారు.
నటిపై పలుమార్లు వ్యాపారవేత్త అత్యాచారం.. పెళ్లి చేసుకుంటానని నమ్మించి లైంగిక దోపిడి..
ఈ క్రమంలో ఏవేవో విషయాలు మాట్లాడుకున్నారు. కొంత సమయం తరువాత ఇష్తియాక్ ఖాన్ కు వింత కోరిక కలిగింది. తనకు రాహుల్ లోహర్ రక్తం తాగాలని ఉందని తన మనసులో మాట ఆ ముగ్గురు స్నేహితుల ముందు బయటపెట్టాడు. ఇది విన్న ముగ్గురూ షాక్ అయ్యారు. వారంతా షాక్ లోనే ఉండగా.. ఇష్తియాక్ తన పని మొదలుపెట్టాడు. రాహుల్ మెడను వెళ్లి కొరికాడు. దీంతో ఆ ఇద్దరు స్నేహితుల మధ్య వాగ్వాదం జరిగింది. కొంత సమయం తరువాత రాహుల్ ఆ ప్రాంతం నుంచి వెళ్లిపోయాడు.
విషాదం.. నదిలో పడ్డ బస్సు, ముగ్గురు మృతి.. 24 మందికి తీవ్ర గాయాలు
అయితే ఇష్తియాక్ ఇలా క్రూరంగా మెడ కొరకడం పట్ల అతడికి తీవ్రంగా నొప్పి వేసింది. దీంతో అతడికి ఇష్తియాక్ పై చాలా కోపం కలిగింది. మద్యం మత్తులోనే రాహుల్.. తన స్నేహితుడిని హతమార్చాలని నిర్ణయించుకున్నాడు. రాత్రి 11.30 గంటల ప్రాంతంలో ఇష్తియాక్ ఉండే ప్రదేశానికి మరో స్నేహితుడిని తీసుకొని చేరుకున్నాడు. ఆ సమయంలో అతడు మరో స్నేహితుడి కలిసి నిద్రపోతున్నాడు.
చికాగో వీధుల్లో ఆకలితో అలమటిస్తున్న హైదరాబాదీ మహిళకు బాసటగా నిలిచిన భారత ఎంబసీ.. అసలేమైందంటే ?
కోపంతో రగిలిపోతున్న రాహుల్ ఇష్తియాక్ తలపై బండరాయితో మోదాడు. దీంతో అతడు అక్కడే మరణించాడు. దీనిపై సమాచారం రావడంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. దీనిపై విచారణ చేపడుతున్నారు.