నటిపై పలుమార్లు వ్యాపారవేత్త అత్యాచారం.. పెళ్లి చేసుకుంటానని నమ్మించి లైంగిక దోపిడి..

పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఓ వ్యాపారవేత్త ఓ నటిపై లైంగిక దాడికి ఒడిగట్టాడు. ఇలా పలుమార్లు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. దీనిపై బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. నిందితుడిపై ఫిర్యాదు చేసింది.

The businessman raped the actress several times..ISR

ఆమె ఓ నటి. ఓ వ్యాపారి ఆమెకు పరిచయం అయ్యాడు. కొంత కాలం తరువాత పెళ్లి చేసుకుంటానని ఆమెకు ప్రతిపాదన పెట్టాడు. దీనిని ఆ నటి అంగీకరించింది. దీంతో ఆమెను అతడు శారీరకంగా వాడుకున్నాడు. అనంతరం ఆమెను మోసం చేశాడు. పెళ్లి చేసుకోబోనని ఆ నటికి తేల్చి చెప్పాడు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. ఆ వ్యాపారవేత్తపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

ప్రముఖ వార్తా సంస్థ ‘ఏఎన్ఐ’ ట్వీట్ లో వెల్లడించిన వివరాల ప్రకారం.. మహారాష్ట్ర రాజధాని ముంబైకి చెందిన ఓ నటికి టాంజానియాకు చెందిన వ్యాపారి వీరేన్ పటేల్‌ తో పరిచయం ఏర్పడింది. అనంతరం ఆమెను పెళ్లి చేసుకుంటానని నమ్మించి, పలుమార్లు అత్యాచారం చేశాడు. తరువాత ముఖం చాటేశాడు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించి, నిందితుడిపై ఫిర్యాదు చేసింది. 

బాధితురాలు ఫిర్యాదు మేరకు ఎన్‌ఎం జోషి మార్గ్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. దర్యాప్తు మొదలుపెట్టారు. కేసు విచారణ కొనసాగిస్తున్నామని పోలీసులు పేర్కొన్నారు. కాగా.. ఈ నెల 26వ తేదీన కూడా ముంబైలో ఇలాంటి ఘటనే ఒకటి వెలుగులోకి వచ్చింది. పెళ్లి చేసుకుంటానని చెప్పి ఓ మహిళపై ఓ దుండుగుడు లైంగిక దాడికి ఒడిగట్టాడు. వివరాలు ఇలా ఉన్నాయి. ముంబాయికి చెందిన 33 ఏళ్ల మహిళకు పబ్జీ గేమ్ గేమ్ ఆడుతుండేది. అయితే ఆ గేమ్ లో రెండున్నర సంవత్సరాల కిందట ఓ వ్యక్తి పరిచయం అయ్యాడు. వారి పరిచయం స్నేహంగా మారింది. తరువాత ఇద్దరూ అనుకొని ఒకే సంస్థలో ఉద్యోగంలో జాయిన్ అయ్యారు.

ఈ సందర్భంగా ఆ మహిళపై అతడికి వ్యామోహం కలిగింది. ఆమెను పెళ్లి చేసుకుంటానని నమ్మించారు. పలుమార్లు లైంగిక దాడికి ఒడిగట్టాడు. అయితే ఈ ఏడాది ప్రారంభంలో ఆ మహిళకు ఓ షాకింగ్ విషయం చెప్పాడు. ఆమెను పెళ్లి చేసుకోబనని తేల్చి చెప్పాడు. కానీ మళ్లీ తనతో మునపటిలాగే ఉండాలని కోరారు. దీనికి ఆమె నిరాకరించింది. 

దీంతో అతడు ఆమెను బ్లాక్ మెయిల్ చేయడం మొదలుపెట్టారు. తనతో సన్నిహితంగా ఉండకపోతే గతంలో ఏకాంతంగా ఉన్న వీడియోలను తాను రికార్డు చేసి ఉంచానని, వాటిని సోషల్ మీడియాలో పెడతానని బెదిరించాడు. అతడి వేధింపులను కొంత కాలం భరించిన ఆమె.. వాటిని తట్టుకోలేకపోయింది. అనంతరం పోలీసులను ఆశ్రయించి, తనకు జరిగిన అన్యాయాన్ని వివరించింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios