చికాగో వీధుల్లో ఆకలితో అలమటిస్తున్న హైదరాబాదీ మహిళకు బాసటగా నిలిచిన భారత ఎంబసీ.. అసలేమైందంటే ?
అమెరికాలోని చికాగోలో దిక్కుతోచని స్థితిలో తిరుగుతూ అనారోగ్యానికి గురైన హైదరాబాద్ కు చెందిన మహిళ ప్రస్తుతం కోలుకుంది. ఆమెను భారత్ కు తీసుకొచ్చేందుకు ఇండియన్ ఎంబసీ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
గత నెలలో చికాగోలోని వీధుల్లో ఆకలితో అలమటిస్తూ, దయనీయ స్థితిలో ఉన్న హైదరాబాద్ మహిళకు అమెరికాలోని ఇండియన్ ఎంబసీ బాసటగా నిలించింది. ఆమెకు వైద్యం అందించి, తిరిగి స్వదేశానికి పంపించేందుకు ఏర్పాట్లు చేసింది. ఈ విషయాన్ని ఆ మహిళ తల్లికి కూడా తెలియజేసింది. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం కుదుటపడింది.
కారుకు దారివ్వాలని గొడవ.. ఆదివాసిపై బీజేపీ ఎమ్మెల్యే కుమారుడి కాల్పులు..
హైదరాబాద్ కు చెందిన సైదా లులు మిన్హాజ్ జైదీ 2021 ఆగస్టులో అమెరికాలోని డెట్రాయిట్లోని ట్రిన్ యూనివర్సిటీలో ఇన్ఫర్మేషన్ సైన్స్ లో మాస్టర్స్ చేయడానికి అమెరికా వెళ్లింది. కానీ అక్కడికి వెళ్లిన తరువాత ఆమె వస్తువులన్నీ చోరీకి గురయ్యాయి. దీంతో ఆమె డిప్రెషన్ కు గురైంది.
ఆకలితో అలమటిస్తూ ధయనీయ స్థితికి వెళ్లిపోయింది. రెండు నెలల నుంచి తల్లితో కూడా టచ్ లో లేదు. ఆమెను తెలంగాణకు చెందిన మజ్లిస్ బచావో తెహ్రీక్ (ఎంబీటీ) అధికార ప్రతినిధి అంజేద్ ఉల్లాఖాన్ గమనించారు. ఆమె గురించి తెలుసుకొని సైదా ప్రస్తుత పరిస్థితిని వెలుగులోకి తీసుకొచ్చారు.
అర్థరాత్రి కాలువలోకి దూసుకెళ్లిన కారు.. ముగ్గురి మరణం.. మరో ముగ్గురికి గాయాలు
ఆమె పరిస్థితి తల్లికి కూడా తెలిసింది. దీంతో తన కూతురును స్వదేశానికి తీసుకురావాలని ఆమె తల్లి సయీదా వహాజ్ ఫాతిమా విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ కు లేఖ రాసింది. దీంతో ఆయన వెంటనే స్పందించారు. సైదాను భారత్ కు తిరిగి పంపించేందుకు ఏర్పాట్లు చేయాలని ఆయన ఇండియన్ ఎంబసీని కోరారు.
నటిపై పలుమార్లు వ్యాపారవేత్త అత్యాచారం.. పెళ్లి చేసుకుంటానని నమ్మించి లైంగిక దోపిడి..
దీంతో తక్షణమే ఇండియన్ ఎంబసీ సైదా కోసం గాలించింది. ఆమె ఎక్కడ ఉంటుందో గుర్తించింది. అయితే సైదా ప్రస్తుతం ప్రయాణానికి అనుకూలంగా లేదని అధికారులు గుర్తించారు. ఇక్కడే వైద్యం అందిస్తామని, కోలుకున్న తరువాత ఇండియాకు పంపిస్తామని కేంద్ర విదేశాంగ మంత్రికి తెలియజేశారు. కొన్ని రోజుల ట్రీమ్మెంట్ తరువాత సైదా కోలుకుంది. దీంతో ఆమెను భారత్ కు పంపిచేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ విషయాన్ని సైదా తల్లికి కూడా తెలియజేశారు.