ఆకాశాన్ని తాకిన టమాటాల ధరలు దిగి రావడం లేదు. దేశంలో ఎక్కడ చూసిన ఇదే పరిస్థితి కనిపిస్తోంది. తమిళనాడులోని కోయంబేడు మార్కెట్ టమాటా ఆల్ టైమ్ రికార్డు గరిష్ట స్థాయికి చేరింది. అక్కడ ఆదివారం కిలో టామాటా రూ.200కు అమ్ముడుపోయింది.

టమాటాల ధరలు తగ్గుముఖం పట్టడం లేదు. దాదాపు నెలన్నర నుంచి ఈ కూరగాయ ధర అదుపులోకి రావడం లేదు. పంట సరైన దిగుబడి రాకపోవడం, కొత్త పంట చేతికి అందడానికి ఇంకా కొంత సమయం పట్టే అవకాశం ఉన్న నేపథ్యంలో మార్కెట్ లోకి డిమాండ్ కు సరిపడా సప్లయ్ లేదు. దీంతో టమాటాల ధరలు అమాంతం పెరిగిపోతున్నాయి. తాజాగా దేశంలో ఎక్కడా లేనంతగా ఆదివారం తమిళనాడులోని కొయంబేడు రిటైల్ మార్కెట్ లో కిలో టామాటా ధర రూ.200 పలికింది. 

సోదరులారా.. నా కొడుకును అప్పగించండి - కిడ్నాపర్లకు జవాన్ జావేద్ తల్లి భావోద్వేగ విజ్ఞప్తి

కూరగాయల సరఫరాలో కొరతే ధర పెరగడానికి కారణమని వ్యాపారులు చెబుతున్నారు. కాగా.. ఇదే టమాటా ధర హోల్ సేల్ మార్కెట్ లో కిలో టమాటా ధర రూ.150 పలుకుతోంది. కర్ణాటకలోని ఎస్ ఎన్ పురం, కోలార్, చిక్ మగళూరు, ఆంధ్రప్రదేశ్ లోని శ్రీనివాసపురం, ఒట్టపల్లి, తమిళనాడులోని కృష్ణగిరి, రావకోట్టై, ధర్మపురి నుంచి టమోటాలను దిగుమతి చేసుకుంటున్నారు. తాజా పంట వస్తేనే టమోటా ధర తగ్గే అవకాశం ఉందని, దీనికి కొంత సమయం పట్టవచ్చని వ్యాపారులు సూచిస్తున్నారు.

నేను ఒక్క పైసా కమీషన్ తీసున్నానని ఒక్కరు చెప్పినా.. రాజకీయాల్లో నుంచి తప్పుకుంటా - కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ

కోయంబేడు మార్కెట్ కు గతంలో ప్రతీ రోజూ 1,200 టన్నుల టమాటాలు వస్తుండగా.. అవి ఇటీవల దాదాపు 300 టన్నులకు పడిపోయింది, ఇది రిటైల్ మార్కెట్లో టమోటా ధర పెరగడానికి దారితీసింది. ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన వ్యాపారులు కూడా కూరగాయలను ఇక్కడి నుంచి తరలిస్తుండగా.. స్థానికంగా కొరత ఏర్పడుతోంది.

జ్ఞానవాపి సముదాయాన్ని ‘మసీదు’ అనలేం.. ముస్లిం సమాజం చారిత్రాత్మక తప్పును అంగీకరించాలి - యూపీ సీఎం యోగి

కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వర్షాలు తగ్గుముఖం పట్టడంతో ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. కాగా.. ఏపీలోని మదనపల్లె మార్కెట్ లో కూడా శనివారం రికార్డు స్థాయిలో టమాటా ధర పలికింది. రాయలసీమ ప్రాంతంలోని వివిధ ప్రాంతాలకు చెందిన రైతులకు మదనపల్లె మార్కెట్ కే ఈ కూరగాయను తీసుకొని వస్తారు. హోల్ సేల్ వ్యాపారులకు పోటీ ధరకు టమాటాలు లభించే ప్రదేశం ఇదే. ఇక్కడి నుంచే ఏపీ ప్రభుత్వం కూడా టమాటాలను కొని, రైతు బజార్లలో సబ్సిడీపై అమ్ముతోంది.

మసీదుల్లో ఆలయాల కోసం బీజేపీ వెతికితే, ఆలయాల్లో బౌద్ధ మఠాల కోసం వెతుకులాట ప్రారంభమౌతుంది - స్వామి ప్రసాద్ మౌర్య

దీంతో కేంద్ర ప్రభుత్వం కూడా మదనపల్లె నుంచి కొనుగోలు చేసి ఢిల్లీ సహా ఉత్తరాది రాష్ట్రాల్లో విక్రయించడం ప్రారంభించింది. అయితే శనివారం మదనపల్లెలో టమాటాలకు డిమాండ్ ఉన్నప్పటికీ.. కేవలం 253 టన్నులు మాత్రమే మార్కెట్ కు వచ్చాయి. మొదటి గ్రేడ్ టమోటా కిలో రూ.196 అత్యధిక ధర పలికింది.