నేను ఒక్క పైసా కమీషన్ తీసున్నానని ఒక్కరు చెప్పినా.. రాజకీయాల్లో నుంచి తప్పుకుంటా - కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ
తాను ఒక్క పైసా అయినా కమీషన్ తీసుకున్నానని చెప్పే వ్యక్తి దేశంలో ఎవరూ లేరని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. కుల, మతం, భాషకు తాను ప్రాధాన్యత ఇవ్వనని అన్నారు. వాటి ఆధారంగా ఎవరూ గొప్పవారు కాలేరని, చర్యలు, లక్షణాలే మనుషులను గొప్పగా మారుస్తాయని తెలిపారు.

రాజకీయాల్లోకి ప్రవేశించినప్పటి నుంచి ఒక్క పైసా కూడా కమీషన్ తీసుకోలేదని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. అలా తీసుకున్నానని దేశంలో ఏ ఒక్కరు చెప్పినా.. తాను రాజకీయాల్లో నుంచి తప్పుకుంటానని అన్నారు. ముంబాయిలో ఆదివారం ఆయన ఓ కార్యక్రమానికి హాజరై ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘గడ్కరీకి ఒక్క పైసా ఇచ్చానని చెప్పే వ్యక్తి దేశంలో ఎక్కడా దొరకరు. రాజకీయాలు డబ్బు సంపాదించే వ్యాపారం కాదు’’ అని అన్నారు.
తాను హిందీ, మరాఠీ, ఇంగ్లీషు భాషల్లో ప్రసంగిస్తానని అన్నాను. ఆ ప్రసంగాలను యూట్యూబ్ లో ఎంతో మంది వింటున్నారని అన్నారు. అమెరికాలో కూడా తన ప్రసంగాలు వినేవారు ఉన్నారని, దీని వల్ల యూట్యూబ్ తనకు ప్రతీ నెల రూ.3 లక్షలు చెల్లిస్తోందని అన్నారు. ‘‘నేను యూట్యూబ్ నుండి నెలకు రూ. 3 లక్షలు సంపాదిస్తున్నాను. దేవుడు నన్ను ఆశీర్వదించాడు’’ అని అన్నారు.
తనకు చిన్నతనంలో బ్యాంకులో ఉద్యోగంలో చేరనమి, లేదా న్యాయవాదిగా మారి ఇంటి బయట బోర్డు పెట్టుకోవాలని తల్లిదండ్రులు కోరారని అన్నారు. కానీ తాను ఉద్యోగం చేసే వ్యక్తిని కాదని, ఉద్యోగం ఇచ్చే వ్యక్తిని అవుతానని ఆరోజే చెప్పానని అన్నారు. ఎమర్జెన్సీ పరిస్థితుల్లో తాను ఎక్కువగా చదువుకోలేకపోయానని తెలిపారు. తాను ఇంజనీర్ కాలేకపయానని చెప్పారు. కానీ ఎంతో మంది ఇంజనీర్లకు నేడు నేతృత్వం వహిస్తున్నాని అన్నారు.
బ్రేకింగ్ : జైపూర్-ముంబై రైలులో నలుగురు ప్రయాణికులను కాల్చి చంపిన ఆర్ పీఎఫ్ కానిస్టేబుల్..
కులం, మతం, భాషల ఆధారంగా గొప్పవారు కాలేరని నితిన్ గడ్కరీ అన్నారు. చర్యలు, లక్షణాల ద్వారా మాత్రమే గొప్పవారు అవుతారని చెప్పారు. తాను కులం గురించి మాట్లాడనని అన్నారు. అయినా తాను కూడా రాజకీయ నాయకుడినే అని, ప్రతీ కులం ఓట్లు తనకు అవసరం అని తెలిపారు. “అన్ని కులాల వాళ్ళు నా అన్నదమ్ములు, నా కుటుంబం.. ఈ విషయం నాకు అర్థమైంది..ఇప్పటి వరకు చేసిన వ్యాపారంలో రెండున్నర వేల కోట్ల టర్నోవర్ ఉంది. నేను ప్రారంభించిన వ్యాపారంలో 15,000 మందికి ఉద్యోగాలు ఇచ్చాను. వారిలో 200 మంది కూడా నా కులానికి చెందిన వారు లేరు.’’ అని అన్నారు.