Asianet News TeluguAsianet News Telugu

సోదరులారా.. నా కొడుకును అప్పగించండి - కిడ్నాపర్లకు జవాన్ జావేద్ తల్లి భావోద్వేగ విజ్ఞప్తి

ఇండియన్ ఆర్మీ జవాన్ జావేద్ ను విడిచిపెట్టాలని అతడి తల్లి కిడ్నాపర్లకు విజ్ఞప్తి చేసింది. తన కుమారుడు అమాయకుడు అని, దయచేసి తనకు అప్పగించాలని అభ్యర్థించారు.

Brothers.. hand over my son - Jawan Javed's mother's emotional appeal to kidnappers..ISR
Author
First Published Jul 31, 2023, 2:06 PM IST

దక్షిణ కశ్మీర్ లోని కుల్గాం జిల్లా అస్తాల్ ప్రాంతంలో అదృశ్యమైన ఆర్మీ జవాను తల్లి తన కుమారుడిని తిరిగి అప్పగించాలని కిడ్నాపర్లకు మరో భావోద్వేగ విజ్ఞప్తి చేసింది. కిడ్నాపర్లను సోదరులారా అని సంబోధిస్తూ.. కుమారుడిని తన వద్దకు చేర్చాలని కోరింది. ‘‘ నాకు నా జావేద్ తిరిగి కావాలి. అతడిని విడుదల చేయాలని నా సోదరులను కోరుతున్నాను. మీరు అతన్ని చూస్తే నాకు మాకు చెప్పమని సోదరులను అభ్యర్థిస్తున్నాను. నాకు నా జావేద్ తిరిగి కావాలి. నేను అలిసిపోయాను. దయచేసి నా జావేద్ ను తిరిగి ఇవ్వండి. అది నా హృదయాన్ని కుదిపేసింది. నా జావేద్ ను ఇచ్చేయండి’’ అని ఆమె కోరారు.

జ్ఞానవాపి సముదాయాన్ని ‘మసీదు’ అనలేం.. ముస్లిం సమాజం చారిత్రాత్మక తప్పును అంగీకరించాలి - యూపీ సీఎం యోగి

కాగా.. అంతకు ముందు కూడా జావేద్ కోసం ఆమె ఓ వీడియో సందేశంలో కూడా ఇలాంటి విజ్ఞప్తి చేశారు. అందులో ‘‘ నా కొడుకు అమాయకుడు. చాలా చిన్నవాడు. నా కొడుకు ఏదైనా తప్పు చేసి ఉంటే క్షమించమని కోరుతున్నాను. నా కుమారుడిని స్వదేశానికి రప్పించేందుకు అందరూ అనుమతించాలని విజ్ఞప్తి చేస్తున్నాను’’ అని ఆమె పేర్కొన్నారు. 

మసీదుల్లో ఆలయాల కోసం బీజేపీ వెతికితే, ఆలయాల్లో బౌద్ధ మఠాల కోసం వెతుకులాట ప్రారంభమౌతుంది - స్వామి ప్రసాద్ మౌర్య

కుల్గాం జిల్లాలోని అచతల్ ప్రాంతానికి చెందిన జావేద్ అహ్మద్ వనీ లద్దాఖ్ లోని లేహ్లో విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే ఆయన ఈద్-ఉల్-అజ్హా నుంచి సెలవులో ఇంటి వద్ద ఉన్నారు. ఆదివారం తిరిగి విధులకు హాజరవ్వాల్సి ఉన్నందున్న శనివారం సాయంత్రం మాంసం కొనుగోలు చేసేందుకు తన కుమారుడిని తీసుకొని కారులో మార్కెట్ కు వెళ్లాడు. అంతకు ముందే తనను ఆదివారం ఎయిర్ పోర్టులో డ్రాప్ చేయాలని సోదరుడికి చెప్పాడు.

నేను ఒక్క పైసా కమీషన్ తీసున్నానని ఒక్కరు చెప్పినా.. రాజకీయాల్లో నుంచి తప్పుకుంటా - కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ

అయితే బయటకు వెళ్లిన కుమారుడు ఎంతకీ తిరిగిరాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెంది, గాలింపు చర్యలు చేపట్టారు. కాగా పరాన్హాల్ గ్రామంలో జావేద్ కారు కనిపించింది. అతడి కారులో ఒక జత చెప్పులు, రక్తపు మరకలు ఉన్నట్టు గుర్తించారు. దీంతో వెంటనే పోలీసులకు కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. పోలీసులు పరాన్హాల్ గ్రామానికి చేరుకున్నారు. వాహాన్ని అన్ లాక్ చేశారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఆర్మీ అధికారులకు దీనిపై సమాచారం అందించారు. దీంతో ఆర్మీ కూడా రంగంలోకి దిగింది. పోలీసులు, ఆర్మీ కలిసి సైనికుడి కోసం గాలిస్తున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios