Asianet News TeluguAsianet News Telugu

Top Ten News: ఫిబ్రవరి 26.. టాప్ టెన్ వార్తలు

ఇవాళ్టి టాప్ టెన్ వార్తలను ఒకే చోట చదవండి.
 

todays top ten news in asianet, evening news wrap kms
Author
First Published Feb 26, 2024, 6:59 PM IST

గజల్ సింగర్ పంకజ్ ఉదాస్ కన్నుమూత

గజల్ సింగర్ పంకజ్ ఉదాస్ 73 ఏళ్ల వయసులో మరణించారు. ఫిబ్రవరి 26వ తేదీన తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆమె కుమార్తె నయాబ్ ధ్రువీకరించారు. పూర్తి కథనం

పంకజ్ సింగ్ టాప్ టెన్ సాంగ్స్

పంకజ్ ఉదాస్ గజల్ పాటలతో చిరకాలం నిలిచి ఉండిపోతారు. ఆయన పాడిన పాటల గురించి అభిమానులు ఆసక్తిగా వెతుకుతున్నారు. పంకజ్ ఉదాస్ టాప్ టెన్ పాటలు చూసేయండి. పూర్తి కథనం

‘ఎస్ఎస్ఎంబీ29’లో మహేశ్ బాబు ఒక్కడే కాదు

తాజాగా ఎస్ఎస్ఎంబీ29 సినిమా గురించి దిమ్మతిరిగే అప్డేట్ ఒకటి అందింది. ఈ భారీ ప్రాజెక్ట్ లో మహేశ్ బాబు ఒక్కడే కాకుండా మరో ఇద్దరు లేదా ముగ్గురు స్టార్ హీరోలు స్పెషల్ అపీయరెన్స్ ఇవ్వబోతున్నారని తెలుస్తోంది. అమెజాన్ అడవుల్లో సాగే ఈ చిత్రం గురించి ఇప్పటికే భారీ అంచనాలుండగా.. మరో ముగ్గురు హీరోలు కూడా ఉంటానరడంతో మరింత హైప్ క్రియేట్ అయ్యింది. పూర్తి కథనం

ఆంధ్రా క్రికెట్ టీమ్‌లో రచ్చ

హనుమా విహారి సంచలన పోస్టు పెట్టారు. ఒక రాజకీయ నాయకుడి ఒత్తిడి వల్లే తాను కెప్టెన్సీని వదులుకోవాల్సి వచ్చిందని ఆరోపించారు. పూర్తి కథనం

జ్ఞానవాపి మసీదు పిటిషన్ కొట్టేసిన హైకోర్టు

వివాదాస్పద జ్ఞానవాపి మసీదు కింద వున్న నేళమాళిగ (VyasTehkhana)లో హిందువులు పూజలు నిర్వహించుకోవచ్చునంటూ వారణాసి జిల్లా కోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ జ్ఞానవాపి మసీదు కమిటీ దాఖలు చేసిన పిటిషన్‌ను ఆలహాబాద్ హైకోర్టు సోమవారం కొట్టివేసింది. పూర్తి కథనం

సిరీస్ భారత్ కైవసం

ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా ఇంగ్లాండ్‌తో రాంచీలో జరిగిన నాలుగో టెస్టులో భారత్ ఘన విజయం సాధించింది. దీంతో మరో టెస్ట్ మిగిలి వుండానే.. 3-1 తేడాతో సిరీస్ కైవసం చేసుకుంది. 192 పరుగుల లక్ష్యాన్ని భారత్ 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. రోహిత్ శర్మ (55) , శుభ్‌మన్ గిల్ (52), ధ్రువ్ జురెల్ (39), యశస్వి (37) రాణించారు.  పూర్తి కథనం

రెండ్రోజుల్లో టీడీపీలోకి వైసీపీ ఎమ్మెల్యే

మాజీ మంత్రి దేవినేని ఉమాతో కలిసి మైలవరంలో పనిచేసేందుకు సిద్ధమన్నారు ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్. దేవినేని ఉమాతో ఎలాంటి వ్యక్తిగత విభేదాలు లేవని, రాజకీయంగానే వున్నాయని ఆయన తెలిపారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అవ్వడానికి ఎవరితోనైనా కలిసి పనిచేసేందుకు సిద్ధమన్నారు. పూర్తి కథనం

గుంటూరు లోక్‌సభ వైసీపీ అభ్యర్ధిగా ఎమ్మెల్యే ఆర్కే

రాష్ట్ర రాజకీయాల్లో కీలక స్థానమైన గుంటూరు పార్లమెంట్ స్థానం విషయంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. గుంటూరు పార్లమెంట్ వైసీపీ అభ్యర్ధిగా ఆళ్ల రామకృష్ణారెడ్డిని బరిలోకి దించుతారని గాసిప్స్ షికారు చేస్తున్నాయి. పూర్తి కథనం

రాహుల్ ప్రధాని అయితేనే అది సాధ్యం: జగ్గారెడ్డి

కాంగ్రెస్ నేత, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీని ప్రధాని చేస్తేనే.. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయని అన్నారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రతో కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు తిరిగారని.. ప్రజల కష్టాలు నేరుగా తెలుసుకున్నారన్నారు. ఇప్పుడు న్యాయ యాత్ర కొనసాగుతోందన్నారు. పూర్తి కథనం

Follow Us:
Download App:
  • android
  • ios