Asianet News TeluguAsianet News Telugu

Hanuma Vihari: ఆ రాజకీయ నేత వల్లే కెప్టెన్సీకి రాజీనామా.. సంచలన విషయాలు బయటపెట్టిన విహారి

ఇండియన్ బ్యాట్‌మన్ హనుమా విహారి సంచలన పోస్టు పెట్టాడు. ఇన్‌స్టాగ్రామ్ తాను ఎందుకు కెప్టెన్సీకి రాజీనామా చేయాల్సి వచ్చిందో వివరించాడు. ఒక రాజకీయ నాయకుడు అసోసియేషన్‌కు చెప్పి తనతో రాజీనామా చేయించాడని ఆరోపించాడు. ఇక పై ఆంధ్రా టీమ్‌లో ఆడబోనని స్పష్టం చేశాడు.
 

hanuma vihari resigned for andhra team captaincy because a politician asked association to take action says in instagram kms
Author
First Published Feb 26, 2024, 3:29 PM IST

ఇండియన్ క్రికెటర్ హనుమా విహారి సోషల్ మీడియా లో ఓ సంచలన పోస్టు పెట్టాడు. రంజీ ట్రోఫీలో మధ్యప్రదేశ్‌పై ఆంధ్రప్రదేశ్ టీమ్ ఓడిపోయిన తర్వాత ఆయన కొన్ని కఠోర వాస్తవాలను వెల్లడించాలని నిర్ణయించుకున్నాడు. వాటిని సూటిగా ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పంచుకున్నాడు. మీడియాలో వార్తలు వచ్చినట్టుగా ఆయన తన బ్యాటింగ్ పై ఫోకస్ పెట్టాలనో లేక మరో కారణంతోనో తాను ఏపీ టీమ్‌ కెప్టెన్సీకి రాజీనామా చేయలేదని స్పష్టం చేశారు.

తాము చివరి వరకు కష్ట పడ్డాం. కానీ, ఓడిపోయాం. నేను ఈ పోస్టును కొన్ని వాస్తవాలను మీ ముందుకు తేవడానికి పెడుతున్నాను.

‘ఫస్ట్ గేమ్ బెంగాల్‌తో ఆడినప్పుడు నేను కెప్టెన్. ఆ సమయంలో నేను 17వ ప్లేయర్ పై అరిచాను. అతను రాజకీయ నాయకుడైనా తన తండ్రికి నా మీద ఫిర్యాదు చేశాడు. దీనికి ఆయన తండ్రి నాపై యాక్షన్ తీసుకోవాలని అసోసియేషన్‌కు చెప్పాడు. గతేడాది ఫైనలిస్టు జట్టు బెంగాల్ పై మేం 410 పరుగులు చేశాం. అయినా.. నన్ను కెప్టెన్సీకి రాజీనామా చేయాలని ఆదేశించారు. నా వైపు ఎలాంటి తప్పు లేకున్నా నన్ను రాజీనామా చేయమని అన్నారు. వాస్తవానికి నేను ఆ ప్లేయర్‌ను వ్యక్తిగతంగా ఎలాంటి మాట అనలేదు. కానీ, మన అసోసియేషన్‌కు గత ఏడేళ్లలో ఆంధ్రాను ఐదు సార్లు నాక్ ఔట్‌కు తీసుకెళ్లినా.. 16 అంతర్జాతీయ టెస్టులు ఆడిన.. ఆటకే అంకితమైన ప్లేయర్(విహారీనే) కంటే.. ఆ ప్లేయర్ ముఖ్యమైనవాడిగా కనిపించాడు’

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Hanuma vihari (@viharigh)

‘నాకు చాలా అవమానం అనిపించింది. అయినా.. ఇవాళ్టి వరకు ఆడుతున్నానంటే అదికేవలం ఈ ఆటపై, మా టీమ్ పై ఉన్న గౌరవమే. నేను భంగపడ్డా, అవమానానికి గురైనా ఇవాళ్టి వరకు ఈ విషయాలను బయటికి వెల్లడించలేదు. కానీ, నేను ఒక నిర్ణయం తీసుకున్నానుం. నా ఆత్మగౌరవం పోయిన ఆంధ్రా టీమ్‌ కోసం ఇకపై ఆడదలచుకోలేదు. కానీ, ఆ టీమ్ అంటే ప్రేమ. ప్రతి సీజన్‌కు మేం వృద్ధి చెందుతున్న తీరు కూడా ఇష్టం. కానీ, ఈ అసోసియేషన్ మమ్మల్ని ఎదగనివ్వడం లేదు’ అని హనుమా వివాహరి సంచలన పోస్టు పెట్టాడు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios