RIP Pankaj Udhas: పంకజ్ ఉదాస్ టాప్ టెన్ సాంగ్స్.. చిట్టి ఆయి హై నుంచి ఆహిస్తా వరకు.. ఇక్కడ చూసేయండి

ప్రముఖ గజల్ గాయకుడు పంకజ్ ఉదాస్ పాడిన టాప్ టెన్ సాంగ్స్ ఏషియానెట్ న్యూస్ పాఠకుల కోసం ఒక చోట చేర్చి అందిస్తున్నాం.
 

ghazal singer pankaj udhas top ten songs kms

ప్రముఖ క్లాసికల్ సింగర్, గజల్ గాయకుడు పంకజ్ ఉదాస్ ఈ రోజు మరణించారు. కానీ, ఆయన గొంతు మాత్రం ఎప్పటికీ నిలిచే ఉండనుంది. ఆయన మరణవార్తతో అభిమానులు పంకజ్ పాడిన పాటలను గుర్తు చేసుకుంటున్నారు. ఆయన పాడిన టాప్ టెన్ పాటలను ఇక్కడ చూడండి, ఆలకించండి.

‘పద్మశ్రీ పంకజ్ ఉదాస్ 2024 ఫిబ్రవరి 26వ తేదీన తుది శ్వాస విడిచినట్టు భారమైన హృదయంతో, విచారంతో తెలియజేస్తున్నాం. దీర్ఘకాల అనారోగ్యంతో ఈ రోజు ఆయన కన్నమూశారు’ అని పంకజ్ ఉదాస్ కూతురు నయాబ్ ఉదాస్ ఇన్ స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు.

Also Read: ‘ఇంతకుమించి ఏమీ పీకలేవు’.. రచ్చకెక్కుతున్న ఆంధ్రా టీమ్ క్రికెట్.. హనుమా విహారికి పృథ్వీరాజ్ కౌంటర్

భారత్‌లో సుపరిచతమైన గజల్ సింగర్ పంకజ్ ఉదాస్ 1951 మే 17వ తేదీన జన్మించారు. ఆయన తన గజల్ ఆలాపనలతో ప్రసిద్ధి చెందారు. 1980, 90 దశకాల్లో ఆయన తన కెరీర్ ఉచ్ఛదశలో ఉన్నారు. మన దేశంలోని ప్రముఖ గజల్ సింగర్‌లలో ఒకరిగా నిలిచారు. ఆయన శ్రావ్యమైన, మెలోడియస్ గళంతో ఉద్వేగభరిత గాన కచేరీలో చేశారు. ఆయన గాత్రానికి దేశ, విదేశాల నుంచి అభిమానులు ఉన్నారు.

చిట్టి ఆయిహై, ఔర్ అహిస్తా కీజియే బాతే, చాంది జైసా రంగ్ హై తేరా, న కజ్రే కి దార్ వంటి గజల్స్ పంకజ్ ఉదాస్ పాడిన వాటిల్లో పేరేన్నిక గలవి. మరికొందరు సంగీత కళాకారులతో కలిసి ఆయన పలు పాటల ఆల్బమ్‌లు విడుదల చేశారు. సంగీత పరిశ్రమలో చేసిన కృషికి గాను ప్రభుత్వం ఆయనకు 2006లో పద్మ శ్రీ పురస్కారం ఇచ్చి సత్కరించింది.

చిట్టి ఆయి హై :

చాంది జైసా రంగ్ హై :

ఔర్ ఆహిస్తా కీజియే బాతే :

ఆహిస్తా :

ముకరార్ :

జియే తో జియే కైసే :

నా కజ్రే కీ దార్ :

ఔర్ ఆహిస్తా కీజియే బాతే :

జిందగీ జబ్ భీ :

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios