Asianet News TeluguAsianet News Telugu

ఇంగ్లాండ్‌పై భారత్ ఘన విజయం .. మరో టెస్ట్ మిగిలి వుండగానే, సిరీస్ టీమిండియా కైవసం

ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా ఇంగ్లాండ్‌తో రాంచీలో జరిగిన నాలుగో టెస్టులో భారత్ ఘన విజయం సాధించింది. దీంతో మరో టెస్ట్ మిగిలి వుండానే.. 3-1 తేడాతో సిరీస్ కైవసం చేసుకుంది. 192 పరుగుల లక్ష్యాన్ని భారత్ 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. రోహిత్ శర్మ (55) , శుభ్‌మన్ గిల్ (52), ధ్రువ్ జురెల్ (39), యశస్వి (37) రాణించారు. 

India vs England 4th Test : India beat England by 5 wickets, clinch series ksp
Author
First Published Feb 26, 2024, 1:54 PM IST

ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా ఇంగ్లాండ్‌తో రాంచీలో జరిగిన నాలుగో టెస్టులో భారత్ ఘన విజయం సాధించింది. దీంతో మరో టెస్ట్ మిగిలి వుండానే.. 3-1 తేడాతో సిరీస్ కైవసం చేసుకుంది. 192 పరుగుల లక్ష్యాన్ని భారత్ 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. రోహిత్ శర్మ (55) , శుభ్‌మన్ గిల్ (52), ధ్రువ్ జురెల్ (39), యశస్వి (37) రాణించారు. 

ఐదు టెస్టుల సిరీస్‌లో తొలుత ఫస్ట్ టెస్ట్‌లో ఇంగ్లాండ్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఓటమికి కుంగిపోకుండా టీమిండియా వరుస విజయాలు సాధిస్తోంది. విశాఖపట్నం, రాజ్‌కోట్‌ తాజాగా రాంచీ టెస్టులో ఇంగ్లీష్ జట్టులో విజయం సాధించింది. విరాట్ కోహ్లీ, మిడిలార్డర్‌లో కేఎల్ రాహుల్ లేకున్నా యువ ఆటగాళ్లు జట్టును విజయపథంలో నడిపిస్తున్నారు. 

రాంచీ టెస్టులో తొలుత టాస్ ఓడిన టీమిండియా బౌలింగ్ ఎంచుకుంది. తొలిరోజే అరంగేట్ర పేసర్ ఆకాశ్ దీప్ వరుసగా వికెట్లు పడగొట్టడంతో ఫస్ట్ సెషన్‌లోనే భారత్ పైచేయి సాధించింది. అశ్విన్, జడేజా స్పిన్ మాయాజలానికి ఇంగ్లీష్ జట్టు విలవిలలాడిపోయింది. 112 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయిన ఇంగ్లాండ్‌ను జో రూట్ ఆదుకున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో 353 పరుగులకు ఆలౌట్ అవ్వగా.. భారత్ 307 పరుగులకు ఆలౌట్ అయ్యింది. అలాగే ఇంగ్లాండ్ సెకండ్ ఇన్నింగ్స్‌లో 145 పరుగులకు చాప చుట్టేసి.. భారత్ ముందు 192 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. దీనిని భారత్ 61 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. 

ఇకపోతే ఈ మ్యాచ్‌లో య‌శ‌స్వి జైస్వాల్ అరుదైన ఘనత సాధించాడు. ఇంగ్లాండ్ స్పిన్నర్‌ షోయబ్‌ బషీర్‌ బౌలింగ్‌లో య‌శ‌స్వి జైస్వాల్‌ ఒక పరుగు సాధించి ఈ ఘనత సాధించాడు. ఈ టెస్టు సిరీస్‌లో జైస్వాల్ 55 పరుగులు చేసే సమయానికి 600 పరుగుల మార్కును దాటగలిగాడు. తద్వారా ఒక‌ టెస్ట్ సిరీస్‌లో 600+ పరుగులు చేసిన 5వ భారతీయ బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. అలాగే, ఈ 22 ఏళ్ల ఎడమచేతి వాటం బ్యాట్స్‌మెన్ జైస్వాల్ ఇప్పుడు విరాట్ కోహ్లీ, సునీల్ గవాస్కర్, రాహుల్ ద్రవిడ్, దిలీప్ సర్దేశాయ్ వంటి దిగ్గజ బ్యాట్స్‌మెన్‌ల సరసన చేరాడు.

టీమిండియా మాజీ కెప్టెన్లు విరాట్ కోహ్లీ, సునీల్ గవాస్కర్, రాహుల్ ద్రవిడ్ టెస్టు సిరీస్‌లో రెండుసార్లు 600+ పరుగులు చేశారు.  సునీల్ గవాస్కర్ మాత్రమే టెస్టు సిరీస్‌లో 700+ పరుగులు చేశాడు. టెస్టు సిరీస్‌లో సన్నీ రెండుసార్లు 700+ పరుగులు చేశాడు. ఇంకో మ్యాచ్ మిగిలివుంది కాబ‌ట్టి ఒక టెస్టు సిరీస్ లో అత్య‌ధిక ప‌రుగులు చేసిన రికార్డును కూడా య‌శ‌స్వి జైస్వాల్ అధిగ‌మించే అవ‌కాశ‌ముంది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios