SSMB29 : ‘ఎస్ఎస్ఎంబీ29’లో మహేశ్ బాబు ఒక్కడే కాదు.. దిమ్మతిరిగిపోయే అప్డేట్!
టాలీవుడ్ లో ఇప్పుడంతా మహేశ్ బాబు - ఎస్ఎస్ రాజమౌళి ప్రాజెక్ట్ SSMB29పైనే టాక్ నడుస్తోంది. ఈ సినిమా గురించి గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా దిమ్మతిరిగే అప్డేట్ అందింది.
‘ఆర్ఆర్ఆర్’ తర్వాత దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి (SS Rajamouli) సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu)తో భారీ చిత్రాన్ని తెరకెక్కించబోతున్న విషయం తెలిసిందే.
రీసెంట్ గా మమేశ్ బాబు ‘గుంటూరు కారం’ (Guntur Kaaram) కూడా విడుదల అవడంతో ఇప్పుడు టాపిక్ అంతా SSMB 29పైనే పడింది. ఈ ప్రాజెక్ట్ అఫిషీయల్ అనౌన్స్ మెంట్ కోసం దేశ వ్యాప్తంగా ఆడియెన్స్ ఎదురుచూస్తున్నారు.
ఈ ఏడాది మేలో చిత్రాన్ని అధికారికంగా ప్రకటించబోతున్నట్టు తెలుస్తోంది. ఇందుకోసం రాజమౌళి భారీ స్కేచ్ వేసినట్టు తెలుస్తోంది. ఇంటర్నేషనల్ లెవల్లో ఈ చిత్ర ప్రకటన ఉంటుందని సమాచారం.
ఇదిలా ఉంటే.. తాజాగా ఈ సినిమా గురించి దిమ్మతిరిగే అప్డేట్ ఒకటి అందింది. ఈ భారీ ప్రాజెక్ట్ లో మహేశ్ బాబు ఒక్కడే కాకుండా మరో ఇద్దరు లేదా ముగ్గురు స్టార్ హీరోలు స్పెషల్ అపీయరెన్స్ ఇవ్వబోతున్నారని తెలుస్తోంది.
అమెజాన్ అడవుల్లో సాగే ఈ చిత్రం గురించి ఇప్పటికే భారీ అంచనాలుండగా.. మరో ముగ్గురు హీరోలు కూడా ఉంటానరడంతో మరింత హైప్ క్రియేట్ అయ్యింది. ఇంతకీ ఆ స్టార్స్ ఎవరై ఉంటారనేది ఆసక్తికరంగా మారింది.
ఇక ‘ఎస్ఎస్ఎంబీ29’లో మహేశ్ బాబు సరసన బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె (Deepika Padukone) నటిస్తోంది. ఇండియోనేషియా నటి చెల్సియా ఎలిజబెత్ ఇస్లాన్ (Chelsea Elizabeth Islan) కూడా ఉందని తెలుస్తోంది. ఇక ఈ చిత్రానికి టాప్ టెక్నీషియన్లు వర్క్ చేస్తుండటం విశేషం.