Asianet News TeluguAsianet News Telugu

హిందువుల పూజలపై అభ్యంతరం.. జ్ఞానవాపి మసీదు కమిటీ పిటిషన్ కొట్టేసిన అలహాబాద్ హైకోర్టు

వివాదాస్పద జ్ఞానవాపి మసీదు కింద వున్న నేళమాళిగ (VyasTehkhana)లో హిందువులు పూజలు నిర్వహించుకోవచ్చునంటూ వారణాసి జిల్లా కోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ జ్ఞానవాపి మసీదు కమిటీ దాఖలు చేసిన పిటిషన్‌ను ఆలహాబాద్ హైకోర్టు సోమవారం కొట్టివేసింది.  

Allahabad High Court DISMISSES Gyanvapi Mosque Committees challenge to Varanasi Courts order allowing Puja inside Vyas Tehkhana ksp
Author
First Published Feb 26, 2024, 10:30 AM IST

వివాదాస్పద జ్ఞానవాపి మసీదు కింద వున్న నేళమాళిగ (VyasTehkhana)లో హిందువులు పూజలు నిర్వహించుకోవచ్చునంటూ వారణాసి జిల్లా కోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ జ్ఞానవాపి మసీదు కమిటీ దాఖలు చేసిన పిటిషన్‌ను ఆలహాబాద్ హైకోర్టు సోమవారం కొట్టివేసింది.  

 

ఈ మేరకు జ్ఞానవాపి మసీదు దక్షిణ సెల్లార్‌లో జరుగుతున్న పూజపై స్టే విధించేందుకు అలహాబాద్ హైకోర్టు ఫిబ్రవరి 26న నిరాకరించింది. జ్ఞానవాపి మసీదు సముదాయంలో ‘వ్యాస్ కా తెహ్‌ఖానా’ ప్రాంతంలో హిందూ భక్తులను ప్రార్ధనలు చేసుకోవడానికి అనుమతిస్తూ వారణాసి జిల్లా న్యాయమూర్తి ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ అంజుమన్ ఇంతేజామియా మసీదు కమిటీ (ఏఐఎంసీ) అప్పీల్‌పై అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రోహిత్ రంజన్ అగర్వాల్ తీర్పును వెలువరించారు. 

జ్ఞానవాపి మసీదును నిర్వహించే ఏఐఎంసీ .. వారణాసి జిల్లా కోర్టు ఆదేశాలకు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించడానికి హైకోర్టును ఆశ్రయించాలని సుప్రీంకోర్ట్ ఆదేశించింది. జ్ఞానవాపి మసీదు దక్షిణ సెల్లార్‌లోని విగ్రహాలకు పూజారి ప్రార్ధనలు చేయవచ్చని వారణాసి జిల్లా కోర్ట్ ఈ ఏడాది జనవరి 31న తీర్పును వెలువరించిన సంగతి తెలిసిందే. మసీదు నేలమాళిగలో నాలుగు తహ్‌ఖానాలు (సెల్లార్‌లు) వున్నాయి. వాటిలో ఒకటి ఇప్పటికీ అక్కడ నివసించే వ్యాస్ కుటుంబం ఆధీనంలో వుంది. అంతకుముందు ఆల్ ఇండియా మజ్లిస్ ఏ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ మాట్లాడుతూ.. జ్ఞానవాపి మసీదు సముదాయంలోని ‘‘వ్యాస్ కా తెఖానా ’’ ప్రాంతంలో హిందూ భక్తులు ప్రార్ధనలు చేయడానికి వారణాసి కోర్టు ఇచ్చిన తీర్పు.. ప్రార్ధన స్థలాల ఆరాధనా చట్టాన్ని ఉల్లంఘించడమేనన్నారు. 

ఈ తీర్పు వెలువరించిన న్యాయమూర్తి పదవి విరమణకు ముందు చారిత్రాత్మక నిర్ణయంఅల తీసుకున్నారు. జనవరి 17న జిల్లా మేజిస్ట్రేట్‌ను రిసీవర్‌గా నియమించిన న్యాయమూర్తి చివరకు నేరుగా తీర్పును వెలువరించారు. 1993 నుంచి ప్రార్ధనలు చేయలేదని.. 30 ఏళ్లు కావొస్తుందని స్వయంగా చెప్పారు. లోపల విగ్రహం ఉందని అతనికి ఎలా తెలుసు..? ఇది ప్రార్ధన స్థలాల చట్టాన్ని ఉల్లంఘించడమేనని ఒవైసీ పేర్కొన్నారు 
 

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios