Asianet News TeluguAsianet News Telugu

Today's Top Stories: డీఎస్సీ నోటిఫికేషన్ రద్దు.. వైసీపీ 8వ జాబితా విడుదల .. జమిలి ఎన్నికలకు లా కమిషన్‌ ఓకే..

Today's Top Stories: శుభోదయం.. ఇవాళ్టీ telugu.asianetnews.com టాప్ 10 తెలుగు వార్తలలో  Dairymilk Chocolate ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్..   అవుటర్ టోల్ టెండర్లపై ఎంక్వయిరీ..  సీఎం రేవంత్ ఆదేశం, డీఎస్సీ నోటిఫికేషన్ రద్దు, వైసీపీ 8వ జాబితా విడుదల ,  నా నాలుగో పెళ్లాం నువ్వే జగన్ .. అయితే రా : పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు, 2029 నాటికి జమిలి ఎన్నికలు! రాజ్యాంగ సవరణకు లా కమిషన్ సిఫార్సులు, జార్ఖండ్‌లో ఘోర రైలు ప్రమాదం : 12 మంది దుర్మరణం, టెస్టు క్రికెట్‌లో అత్యంత వేగంగా 1000 ప‌రుగులు సాధించిన టాప్-5 భార‌త క్రికెట‌ర్లు వీరే !, డిస్నీ, రిలయన్స్ విలీనం .. రూ 11,500 కోట్ల డీల్ , ఛైర్మన్‌గా నీతా అంబానీ వంటి వార్తల సమాహారం. 

today top telugu stories, top 10 telugu news, latest telugu news, online Telugu news, breaking news february 29 th headlines krj
Author
First Published Feb 29, 2024, 7:44 AM IST

Today's Top Stories: (పూర్తి కథనం కోసం హెడ్డింగ్ పై క్లిక్ చేయండి)

Dairymilk Chocolate ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్.

క్యాడ్‌బరీ డైరీ మిల్క్ చాక్లెట్స్ గురించి తాజాగా తెలంగాణ స్టేట్ ఫుడ్ ల్యాబరేటరీ సంచలన నిజాలను వెల్లడించింది. క్యాడ్‌బరీ డైరీ మిల్క్ చాక్లెట్స్ తినడం సురక్షితం కాదని నిర్దారించింది. ఆ చాక్లెట్స్ తినకూడదని వాటికి దూరంగా ఉండాలని ప్రజలకు విజ్నప్తి చేసింది. అయితే..  క్యాడ్‌బరీకి చెందిన అన్ని రకాల చాక్లెట్స్ కాకుండా కేవలం రోస్ట్ ఆల్మండ్, ఫ్రూట్ అండ్ నట్ చాక్లెట్స్ మాత్రమే సురక్షితం కాదని తెలంగాణ స్టేట్ ఫుడ్ ల్యాబోరేటరీ స్పష్టం చేసింది. 

ORR Toll Tenders:  అవుటర్ టోల్ టెండర్లపై ఎంక్వయిరీ..  సీఎం రేవంత్ ఆదేశం 

ORR Toll Tenders:  తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. అవుటర్ రింగ్ రోడ్డు టోల్ టెండర్లలో జరిగిన అవకతవకలు జరిగినట్టు వస్తున్న ఆరోపణలపై సమగ్ర విచారణ చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి  ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ ఆదాయానికి గండి పడేలా తక్కువ రేటుకు టెండర్లు కట్టబెట్టిన తీరుపై సీఎం రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీస రేట్ నిర్ణయించకుండా టెండర్లు ఎలా పిలిచారని హెచ్ఎండీఏ అధికారులను నిలదీశారు. ఈ టెండర్ల ప్రక్రియలో ఎవరెవరి ప్రమేయముందో? ఏయే సంస్థలున్నాయో? ఎవరెవరు బాధ్యులెవరో ? అన్ని కోణాల్లో దర్యాప్తు జరపాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. 

DSC Notification:  డీఎస్సీ నోటిఫికేషన్ రద్దు.. భారీ పోస్టులతో.. 

DSC Notification: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో జారీ చేసిన తెలంగాణ డీఎస్సీ నోటిఫికేషన్‌ను రద్దు (DSC) చేసింది. గతేడాది సెప్టెంబర్‌లో 5,089 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి బీఆర్ఎస్ సర్కార్ నోటిఫికేషన్ ఇచ్చింది.  ఆ నోటిఫికేషన్ రద్దు చేస్తూ ‘కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్’ ఆదేశాలు జారీ చేశారు. అతి త్వరలో కొత్త నోటిఫికేషన్ జారీ చేయనున్నట్టు పాఠశాల విద్య శాఖ వెల్లడింది. ఇప్పటికే 11,062 టీచర్‌ పోస్టులను విద్యాశాఖ ప్రతిపాదించగా దీనికి ఆర్థిక శాఖ అనుమతి కూడా లభించింది. కాగా.. గతంలో డీఎస్సీ కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని విద్యాశాఖ స్పష్టం చేసింది. 

YSRCP 8th List: వైసీపీ 8వ జాబితా విడుదల 

YSRCP 8th List: ఏపీలో రెండోసారి అధికారంలోకి రావడమే లక్ష్యంగా అధికార వైఎస్సార్‌సీపీ పావులు కదుపుతోంది. ఈ మేరకు పలు నియోజకవర్గాలకు, పార్లమెంటరీ స్థానాలకు సమన్వయకర్తలను(ఇన్‌ఛార్జిలను) మారుస్తోంది. తాజాగా బుధవారం రాత్రి ఐదుగురు సభ్యులతో కూడిన ఎనిమిదో జాబితాను వైఎస్సార్‌సీపీ విడుదల చేసింది. 


నారా లోకేష్ మెడకు రెడ్ బుక్ వివాదం.. మరోసారి విచారణ వాయిదా..

రెడ్ బుక్ లో పేర్లు రాశామని దర్యాప్తు అధికారులను టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ బెదిరిస్తున్నారని సీఐడీ పిటీషన్ దాఖలు చేసిన విషమం తెలిసిందే. తాజాగా రెడ్ బుక్ కేసులో నారా లోకేశ్ ను అరెస్టు చేయడానికి అనుమతి ఇవ్వాలని కోర్టును కోరింది  సీఐడీ.  ఈ తరుణంలో సీఐడీ దాఖలు చేసిన పిటీషన్ విచారణను ఏసీబీ కోర్టు వాయిదా వేసింది.  ఈ పిటీషన్ పై విచారణ జరిపిన కోర్టు కౌంటర్ దాఖలు చేయాలని లోకేష్ తరపు న్యాయవాదులకు ఆదేశించింది. ఈ తరుణంలో  ఈ కేసును ఒకటి లేదా రెండు రోజులు వాయిదా వేయాలని సీఐడీ తరపు న్యాయవాదులు కోరగా.. కౌంటర్ కు తమకు సమయం కావాలని కోరిన లోకేష్ తరపున న్యాయవాది అభ్యర్ధించారు. దీంతో ఈ కేసును మార్చి 11 కు వాయిదా వేస్తున్నట్టు  ఏసీబీ కోర్టు పేర్కొంది.
 

మరోసారి ఢిల్లీకి చంద్రబాబు, పవన్ కల్యాణ్ 

ఆంధ్రప్రదేశ్లో  ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయ వేడి పెరుగుతోంది. ఇది ఇప్పుడు ఢిల్లీని తాకుతోంది. టిడిపి జనసేన పొత్తుతో ఎన్నికలకు వెళ్ళబోతున్నాయి. ఈ క్రమంలోనే ఇప్పటికే వందకు పైగా సీట్లను ప్రకటించాయి ఈ ఉమ్మడి పార్టీలు. ఉమ్మడిగా అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసిన ఈ రెండు పార్టీలు బుధవారం నాడు తాడేపల్లి వేదికగా తొలి ఉమ్మడి సభ నిర్వహించబోతున్నాయి. దీనికోసం పెద్ద సంఖ్యలో కార్యకర్తలను సభాస్థలికి  చేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మరో ఒకటి రెండు రోజుల్లో పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడులు ఢిల్లీ వెళ్తారని ప్రచారం కొనసాగుతోంది. మరోవైపు రేపు ఢిల్లీలో బిజెపి కీలక సమావేశం జరగనుంది. 

  
నా నాలుగో పెళ్లాం నువ్వే జగన్ .. అయితే రా : పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు


పొత్తులో భాగంగా తాను టీడీపీ నుంచి కేవలం 24 సీట్లు మాత్రమే తీసుకోవడంపై వైసీపీ చేస్తున్న విమర్శలకు కౌంటరిచ్చారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. బుధవారం తాడేపల్లిగూడెంలో జరిగిన  జనసేన టీడీపీ ‘జెండా’ బహిరంగసభలో ఆయన ప్రసంగిస్తూ.. పొత్తులో భాగంగా 24 అసెంబ్లీ సీట్లు తీసుకున్నానని , 24 సీట్లేనా అని అవతలిపక్షం విమర్శించిందన్నారు. బలి చక్రవర్తి కూడా వామనుడిని చూసి ఇంతేనా అన్నారని.. నెత్తిన కాలుపెట్టి తొక్కితే ఎంతో అని తెలిసిందని పవన్ చురకలంటించారు.  మాట్లాడితే నాలుగు పెళ్లిళ్లు అంటాడని.. ఆ నాలుగో పెళ్లాం ఎవరో తనకు తెలియదన్నారు. లేని నాలుగో పెళ్లాం అంటే నువ్వే.. రా జగన్ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. 

One Nation-One Election: 2029 నాటికి జమిలి ఎన్నికలు!  

One Nation-One Election: గత కొన్ని రోజులుగా ’ఒకే దేశం - ఒకే ఎన్నిక’ అనే చర్చ జరుగుతోంది. ఈ మేరకు మోడీ సర్కార్ కూడా వేగంగా పావులు కదుపుతోంది. లా కమిషన్ కూడా ఇందుకు తగినట్టు సిఫార్సులు చేయనున్నట్టు తెలుస్తోంది. అయితే.. ఇందుకోసం రాజ్యాంగంలో కొత్త చాప్టర్‌ను చేర్చేందుకు లా కమిషన్‌ ప్రతిపాదనలు చేయనున్నది. కానీ,  వాటి అమలు మాత్రం .. ఇప్పటికిప్పుడు కుదరకపోవచ్చని , 2029 లోక్‌సభ ఎన్నికల నాటికి అమల్లోకి తీసుకొచ్చే అవకాశాలున్నాయని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.

జార్ఖండ్‌లో ఘోర రైలు ప్రమాదం : 12 మంది దుర్మరణం.

జార్ఖండ్‌లోని జమ్తారా - కర్మతాండ్‌ మార్గంలోని కల్జారియా సమీపంలో ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 12 మంది ప్రాణాలు కోల్పోయినట్లుగా తెలుస్తోంది. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే రైల్వే పోలీసులు, రెవెన్యూ , అగ్నిమాపక, స్థానిక పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. ఈ ప్రాంతంలో చిమ్మ చీకట్లు నెలకొనడంతో సహాయ చర్యలకు ఆటంకం కలుగుతోందని అధికారులు తెలిపారు. క్షతగాత్రుల్లో పలువురి పరిస్ధితి విషమంగా వుండటంతో సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు.

టెస్టు క్రికెట్‌లో అత్యంత వేగంగా 1000 ప‌రుగులు సాధించిన టాప్-5 భార‌త క్రికెట‌ర్లు వీరే !
 
Team India: టెస్టు క్రికెట్లో అత్యంత వేగంగా 1000 పరుగులు పూర్తి చేసిన భారత బ్యాట్స్ మన్ గా వినోద్ కాంబ్లీ రికార్డు సృష్టించాడు. 23 ఇన్నింగ్స్ ల‌లో 1000 పరుగుల మైలురాయిని అందుకున్నాడు భార‌త మాజీ ప్లేయ‌ర్ సంజయ్ మంజ్రేకర్. భార‌త క్రికెట్ చరిత్ర‌లో అత్యంత వేగంగా టెస్టు క్రికెట్ లో 1000 ప‌రుగులు పూర్తి చేసిన ప్లేయ‌ర్ల లిస్టును గ‌మ‌నిస్తే.. 

డిస్నీ, రిలయన్స్ విలీనం .. రూ 11,500 కోట్ల డీల్ , ఛైర్మన్‌గా నీతా అంబానీ
 
దేశీయ మీడియా రంగంలో భారీ విలీనం చోటు చేసుకుంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, వాల్ట్ డిస్నీ ఇండియా సంస్థల మధ్య కీలక ఒప్పందం కుదిరింది. తమ మీడియా వ్యాపారాలైన వయోకామ్ 18, స్టార్ ఇండియా విలీనానికి ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఇరు సంస్థలు కలిసి 70,352 వేల కోట్ల రూపాయల విలువైన జాయింట్ వెంచర్‌ ఏర్పాటుకు నిర్ణయించాయి. ఈ వెంచర్‌లో రిలయన్స్ రూ.11,500 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. ఈ డీల్ గురించి మీడియాలో ఎప్పటి నుంచో ఊహాగానాలు వినిపిస్తుండగా.. దానికి తెరదించుతూ ఇరుసంస్థలు తాజాగా ప్రకటన విడుదల చేశాయి. 

Follow Us:
Download App:
  • android
  • ios