MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • National
  • వందేమాతర గేయాన్ని సోనియా గాంధీ అడ్డుకున్నారా.? పంద్రాగ‌స్టు రోజు అస‌లేం జ‌రిగింది.?

వందేమాతర గేయాన్ని సోనియా గాంధీ అడ్డుకున్నారా.? పంద్రాగ‌స్టు రోజు అస‌లేం జ‌రిగింది.?

Vande Mataram: స్వాతంత్ర దినోత్సవం రోజు దేశవ్యాప్తంగా ‘వందేమాతరం’ గీతం మార్మోగిన వేళ.. కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఓ సంఘటన రాజకీయ వివాదానికి దారితీసింది. అసలు ఆగస్టు 15న ఏం జరిగిందంటే.?

3 Min read
Author : Narender Vaitla
Published : Aug 16 2026, 05:48 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఆగస్టు 15న కాంగ్రెస్ కార్యాలయంలో అసలేం జరిగింది?
Image Credit : Amit Malviya/X

ఆగస్టు 15న కాంగ్రెస్ కార్యాలయంలో అసలేం జరిగింది?

కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు నిర్వహించారు. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సహా పలువురు సీనియర్ నాయకులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ‘వందేమాతరం’ గేయాన్ని ఆలపించారు. అయితే సాధారణంగా వినిపించే తొలి భాగంతో ఆపకుండా గీతాన్ని పూర్తి రూపంలో ఆలపించడం ఈసారి ప్రత్యేకంగా చర్చకు వచ్చింది.

గీతం కొనసాగుతున్న సమయంలో సోనియా గాంధీ ఖర్గే వైపు చూస్తూ కొన్ని సంజ్ఞలు చేయడం వీడియోలో కనిపించింది. దీంతో సోనియా గాంధీ ‘వందేమాతరం’ ఆలాపనను ఆపాలని సూచించారని పెద్ద ఎత్తున విమ‌ర్శ‌ల‌కు దారి తీసింది. బీజేపీ సైతం కాంగ్రెస్ పార్టీపై అటాక్ చేయ‌డం మొద‌లు పెట్టింది. ఈ ఆరోపణలతో వివాదం ఒక్కసారిగా రాజకీయ రంగు పులుముకుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
సోనియా గాంధీపై బీజేపీ ఆరోపణలు ఏంటి?
Image Credit : X

సోనియా గాంధీపై బీజేపీ ఆరోపణలు ఏంటి?

వీడియోను ఆధారంగా చేసుకున్న బీజేపీ నేతలు కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు చేశారు. ‘వందేమాతరం’ దేశ స్వాతంత్ర పోరాటంతో ముడిపడిన జాతీయ గీతం కావడంతో దాన్ని పూర్తిగా ఆలపించడాన్ని అడ్డుకునే ప్రయత్నం చేయడం దేశభక్తి భావాలను దెబ్బతీయడమేనని బీజేపీ నేతలు ఆరోపించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాజస్థాన్‌లోని చిత్తోర్‌గఢ్‌లో జరిగిన కార్యక్రమంలో ఈ అంశాన్ని ప్రస్తావించారు. సోనియా గాంధీ పూర్తి ‘వందేమాతరం’ ఆలాపనను ఆపాలని ప్రయత్నించారని ఆయన ఆరోపించారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం కాంగ్రెస్ జాతీయ గేయాన్ని అవమానించిందని విమర్శిస్తూ.. ఇందుకు దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజలు ఈ విషయాన్ని క్షమించరని అన్నారు. బీజేపీకి చెందిన పలువురు ఇతర నేతలు కూడా ఇదే అంశంపై కాంగ్రెస్‌ను లక్ష్యంగా చేసుకున్నారు. పార్టీ నేతలు, ఎంపీలు సోనియా గాంధీ తీరును ప్రశ్నించారు.

35
బంకిమ్ చంద్ర వారసుడి ఆవేదన.. సోనియాకు లేఖ
Image Credit : Asianet News

బంకిమ్ చంద్ర వారసుడి ఆవేదన.. సోనియాకు లేఖ

ఈ వివాదంపై పశ్చిమ బెంగాల్‌లోని నైహాటి నియోజకవర్గం బీజేపీ ఎమ్మెల్యే సుమిత్రో ఛటర్జీ కూడా స్పందించారు. ‘వందేమాతరం’ రచయిత బంకిమ్ చంద్ర చట్టోపాధ్యాయ కుటుంబ వారసుడిగా తనకు ఈ పరిణామం మరింత బాధ కలిగించిందని పేర్కొన్నారు. సోనియా గాంధీకి రాసిన లేఖలో ఆయన కాంగ్రెస్‌ నాయకత్వాన్ని తీవ్రంగా ప్రశ్నించారు. స్వాతంత్ర దినోత్సవం వంటి సందర్భంలో ‘వందేమాతరం’కు సంబంధించిన వివాదం చోటుచేసుకోవడం దురదృష్టకరం అని అన్నారు. ఈ గీతం ఏ ఒక్క రాజకీయ పార్టీకి చెందినది కాదని.. స్వాతంత్ర ఉద్యమ చరిత్రతో దీనికి విడదీయరాని సంబంధం ఉందని పేర్కొన్నారు.

1937లో కాంగ్రెస్‌ నాయకత్వం ‘వందేమాతరం’లోని తొలి రెండు చరణాలను మాత్రమే జాతీయ కార్యక్రమాల్లో ఉపయోగించాలన్న నిర్ణయాన్ని తీసుకున్న చారిత్రక నేపథ్యాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. అప్పటి పరిస్థితులను నేటి ఘటనతో అనుసంధానిస్తూ కాంగ్రెస్‌పై విమర్శలు చేశారు. ఈ వ్యవహారంపై దేశ ప్రజలకు, ముఖ్యంగా బెంగాల్ ప్రజలకు కాంగ్రెస్ క్షమాపణ చెప్పాలని సుమిత్రో ఛటర్జీ డిమాండ్ చేశారు. జాతీయ భావోద్వేగాలకు సంబంధించిన అంశాల్లో రాజకీయ లాభనష్టాల కంటే చారిత్రక గౌరవానికి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.

45
కాంగ్రెస్ ఇచ్చిన సమాధానం ఏంటంటే.?
Image Credit : CHATGPT

కాంగ్రెస్ ఇచ్చిన సమాధానం ఏంటంటే.?

బీజేపీ చేస్తున్న ఆరోపణలను కాంగ్రెస్ పూర్తిగా ఖండించింది. సోనియా గాంధీ ‘వందేమాతరం’ను ఆపాలని ఎలాంటి సూచన చేయలేదని కాంగ్రెస్ నాయకులు స్పష్టం చేశారు. కార్యక్రమం జరుగుతున్న సమయంలో పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చాలాసేపు నిలబడి ఉన్నారని.. ఆయన కోసం కుర్చీ ఏర్పాటు చేయాలని సోనియా గాంధీ సూచించారని కాంగ్రెస్ వివరణ ఇచ్చింది. వీడియోలో కనిపించిన ఆమె సంజ్ఞలను ‘గీతాన్ని ఆపాలని చేసిన సూచన’గా బీజేపీ తప్పుగా అర్థం చేసుకుంటోందని పార్టీ నేతలు చెప్పారు.

55
పోలీసులకు ఫిర్యాదు.. మరింత ముదిరిన రాజకీయ వివాదం
Image Credit : Asianet News

పోలీసులకు ఫిర్యాదు.. మరింత ముదిరిన రాజకీయ వివాదం

వివాదం రాజకీయ విమర్శలకే పరిమితం కాలేదు. ఆగస్టు 16న కర్ణాటకలోని ఉర్వా పోలీస్ స్టేషన్‌లో బీజేపీ నాయకులు సోనియా గాంధీపై ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ‘వందేమాతరం’ ఆలాపనకు సంబంధించిన ఘటనను ప్రస్తావిస్తూ ఈ ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఇదే సమయంలో బీజేపీ నేతలు కాంగ్రెస్‌పై విమర్శలు కొనసాగిస్తుండగా.. కాంగ్రెస్ మాత్రం ఈ ఆరోపణలను రాజకీయంగా సృష్టించిన వివాదంగా కొట్టేస్తోంది. దీంతో స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జరిగిన ఒక వీడియో క్లిప్ చుట్టూ మొదలైన చర్చ.. ఇప్పుడు ‘వందేమాతరం’ చరిత్ర, జాతీయ భావన, కాంగ్రెస్‌ గత వైఖరి, ఓటు బ్యాంకు రాజకీయాలు వంటి అంశాలపై పెద్ద రాజకీయ పోరుగా మారింది.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News. He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor. He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
స్వాతంత్య్ర దినోత్సవం
భారత దేశం
సోనియా గాంధీ
అమిత్ షా
 

Latest Videos
Recommended Stories
Recommended image1
India Bullet Train: రూ. 2 లక్షల కోట్ల ప్రాజెక్ట్.. 350 కిమీ స్పీడ్‌తో భారత్ సొంత బుల్లెట్ ట్రైన్ చూశారా?
Recommended image2
US India Trade: అమెరికా-ఇండియా ట్రేడ్ పెరిగితే భారతీయులకు ఏం ప్రయోజనం?
Recommended image3
LPG Subsidy: ఎల్పీజీ గ్యాస్ వినియోగదారులకు బిగ్ అలర్ట్.. అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్ !
Related Stories
Recommended image1
ల‌క్ష‌న్న‌ర స్మార్ట్ ఫోన్ కేవ‌లం రూ. 58 వేల‌కే.. సామ్‌సంగ్ గ్యాల‌క్సీ ఎస్‌25 అల్ట్రాపై క‌ళ్లు చెదిరే ఫీచ‌ర్లు
Recommended image2
Shanarthi: శ‌నార్తి అంటే అర్థం ఏంటో తెలుసా.? అస‌లీ ప‌దం ఎక్క‌డి నుంచి వ‌చ్చిందంటే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved