నారా లోకేష్ మెడకు రెడ్ బుక్ వివాదం.. మరోసారి విచారణ వాయిదా..

Nara Lokesh: రెడ్ బుక్ కేసులో నారా లోకేశ్ ను అరెస్టు చేయడానికి అనుమతి ఇవ్వాలని సీఐడీ వేసిన పిటీషన్ విచారణను ఏసీబీ కోర్టు వాయిదా వేసింది. 

ACB court adjourns the hearing of petition on Lokesh's Red Book issue KRJ

Nara Lokesh: ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాజకీయం రసవత్తరంగా మారుతోంది. అధికార, ప్రత్యార్థుల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఇంకో రకంగా చెప్పాలంటే.. పచ్చగడ్డి వేస్తే భంగుమనేలా ఉంది. ఇదిలా ఉంటే.. టీడీపీ నాయకులపై జగన్ సర్కార్ అక్రమ కేసులు బనాయిస్తుందనే ఆరోపణలు కూడా లేకపోలేదు. ఈ తరుణంలో రెడ్ బుక్ కేసు తెరపైకి వచ్చింది. రెడ్ బుక్ లో పేర్లు రాశామని దర్యాప్తు అధికారులను టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ బెదిరిస్తున్నారని సీఐడీ పిటీషన్ దాఖలు చేసిన విషమం తెలిసిందే. 

తాజాగా రెడ్ బుక్ కేసులో నారా లోకేశ్ ను అరెస్టు చేయడానికి అనుమతి ఇవ్వాలని కోర్టును కోరింది  సీఐడీ.  ఈ తరుణంలో సీఐడీ దాఖలు చేసిన పిటీషన్ విచారణను ఏసీబీ కోర్టు వాయిదా వేసింది.  ఈ పిటీషన్ పై విచారణ జరిపిన కోర్టు కౌంటర్ దాఖలు చేయాలని లోకేష్ తరపు న్యాయవాదులకు ఆదేశించింది. ఈ తరుణంలో  ఈ కేసును ఒకటి లేదా రెండు రోజులు వాయిదా వేయాలని సీఐడీ తరపు న్యాయవాదులు కోరగా.. కౌంటర్ కు తమకు సమయం కావాలని కోరిన లోకేష్ తరపున న్యాయవాది అభ్యర్ధించారు. దీంతో ఈ కేసును మార్చి 11 కు వాయిదా వేస్తున్నట్టు  ఏసీబీ కోర్టు పేర్కొంది.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios