Asianet News TeluguAsianet News Telugu

Today Top Stories: ముగిసిన రేవంత్ ఢిల్లీ పర్యటన.. ఓటుకు నోటు కేసుపై 'సుప్రీం' విచారణ.. ఆసీస్ పై విజయం

Today Top Stories: శుభోదయం..ఈ రోజు టాప్ సోర్టీస్ లో ముగిసిన సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన, కీలక ఘట్టానికి ‘ఆదిత్య’.. జనవరి 6న ఎల్‌1 కక్ష్యలోకి!, ఓటకు నోటు కేసు.. రేవంత్ రెడ్డి పిటిషన్ పై సుప్రీం విచారణ, ఉత్తమ పోలీస్ స్టేషన్‌గా రాజేంద్రనగర్ పీ ఎస్.. సీఎం అభినందనలు, సంక్రాంతికి టీడీపీ ఫస్ట్ లిస్ట్.., కీలక ఘట్టానికి ‘ఆదిత్య’.. , ఆరంభం అదిరింది.. ఆస్ట్రేలియాపై భారత్ ఘన విజయం వంటి పలు వార్తల సమాహారం.

Today Top Stories Top 10 Telugu News for January 6th 2024 Andhra pradesh, Telangana updates Headlines KRJ
Author
First Published Jan 6, 2024, 6:25 AM IST

Today Top Stories: ముగిసిన సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన..

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రెండు రోజుల ఢిల్లీ పర్యటన ముగిసింది. ఈ రెండు రోజులు బిజీబిజీ షెడ్యూల్ తర్వాత సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ వచ్చారు. ఢిల్లీ పర్యటనలో వరుసగా కేంద్ర మంత్రులను, UPSC చైర్మన్ తో భేటీ అయ్యారు. తొలి రోజు రాష్ట్ర పున‌ర్విభ‌జ‌న చ‌ట్టం స‌మ‌స్య‌ల‌పై చ‌ర్చించేందుకు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. పాల‌మూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా క‌ల్ప‌న కోసం జ‌ల్‌ శ‌క్తి మంత్రి గజేంద్ర‌సింగ్ షెకావ‌త్‌ను, హైద‌రాబాద్ మెట్రో విస్త‌ర‌ణ‌, మూసీ రివ‌ర్ ఫ్రంట్ అభివృద్ధి, ఇందిర‌మ్మ ఇళ్ల మంజూరు కోసం కేంద్ర గృహ‌నిర్మాణం, ప‌ట్ట‌ణాభివృద్ధి శాఖ‌ల మంత్రి హ‌ర్‌దీప్‌ సింగ్ పురీతో భేటీ అయ్యారు.

ఓటకు నోటు కేసు.. రేవంత్ రెడ్డి పిటిషన్ పై సుప్రీం విచారణ   

Telangana CM: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు ఫిబ్రవరిలో విచారించనుంది. హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ రేవంత్ రెడ్డి ఓ పిటిషన్ వేశారు. రేవంత్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌తోపాటు మరికొన్ని పిటిషన్లు తాజాగా సుప్రీంకోర్టు ధర్మాసనం ముందుకు వచ్చింది. ఈ పిటిషన్లను న్యాయమూర్తులు సంజీవ్ ఖన్నా, దీపాంకర్ దత్తాల ధర్మాసనం విచారిస్తుండగా.. అందులో ఒక న్యాయవాది కుటుంబంలో విషాదం నెలకొందనే విషయం తెలిసింది. దీంతో ఆ పిటిషన్ల విచారణను ఫిబ్రవరి నెలకు వాయిదా వేశారు. 2015లో.. అంటే రేవంత్ రెడ్డి టీడీపీలో ఉన్నప్పుడు ఓటుకు నోటు కేసు మొదలైంది. నామినేటెడ్ ఎమ్మెల్యే ఎల్విస్ స్టీఫెన్సన్‌కు రూ. 50 లక్షల లంచం ఇవ్వజూపినట్టు ఆరోపణలు వచ్చాయి. తద్వార ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ నామినీ వేమ్ నరేందర్ రెడ్డికి మద్దతు కోసం ఈ లంచం ఇచ్చారు. ఆ సమయంలో రేవంత్ రెడ్డిని ఏసీబీ పట్టుకుంది. మే 31వ తేదీన రేవంత్ రెడ్డి డబ్బు కట్టలతో పట్టుబడ్డారు. అప్పుడు రేవంత్ రెడ్డితోపాటు మరికొందరిని ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. 

ఉత్తమ పోలీస్ స్టేషన్‌గా రాజేంద్రనగర్ పీ ఎస్.. సీఎం అభినందనలు..

Rajendra Nagar Police Station: తెలంగాణలోని రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ కు అరుదైన గౌరవం దక్కింది. ఈ పోలీస్ స్టేషన్ పనితీరు పరంగా దేశంలోనే 'బెస్ట్ పోలీస్ స్టేషన్'గా నిలిచింది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ (ఎంహెచ్‌ఏ) జనవరి 5 న (శుక్రవారం) ఈ అవార్డును అందుకుంది. జైపూర్‌లో జరిగిన అన్ని రాష్ట్రాల డీజీపీల సమావేశంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా నుంచి స్టేషన్ హౌస్ ఆఫీసర్ (ఎస్‌హెచ్‌ఓ) బి నాగేంద్రబాబు ట్రోఫీని అందుకున్నారు. ఈ ఘనత సాధించిన రాజేంద్రనగర్‌ ఎస్‌హెచ్‌ఓ నాగేంద్రబాబు‌ను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అభినందించారు.  డీజీపీల కాన్ఫరెన్స్‌లో కేంద్ర హోంశాఖమంత్రి నుంచి ట్రోఫీని అందుకున్న రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్‌కు హృదయపూర్వక అభినందనలు అని ట్వీట్ చేశారు.

సంక్రాంతికి టీడీపీ ఫస్ట్ లిస్ట్..

ఏపీలో పొలిటికల్ హీట్ నెమ్మదిగా పెరుగుతోంది. ఓ వైపు అధికార వైసీపీ ఇంఛార్జుల మార్పుతో ఇప్పటికే రెండు లిస్టులు విడుదల చేసింది. మరోవైపు జనసేనతో పొత్తుపెట్టుకున్న టీడీపీ లిస్టు విషయంలో ఆలస్యం అవుతోంది. ఈ క్రమంలో సంక్రాంతికి టీడీపీ ఫస్ట్ లిస్ట్ రానున్నట్టు సమాచారం. గతంలోనే లిస్టు విడుదల చేయనున్నట్లుగా టీడీపీ అధినేత చంద్రబాబు అనౌన్స్ చేశారు. కానీ పొత్తులు, సీట్ల సర్దుబాటుతో లిస్టు ఆలస్యమవుతోందని తెలుస్తోంది. ఇప్పటికే అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. ఈ మేరకు 70 నుంచి 80 స్థానాలకు అభ్యర్థుల జాబితాను చంద్రబాబు సిద్ధం చేసుకున్నట్టు సమాచారం. 

కేశినేని నాని సంచలన నిర్ణయం.. తర్వలో పార్టీకి రాజీనామా..

Keshineni Nani: విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని సంచలన నిర్ణయం తీసుకున్నారు. టిడిపి హై కమాండ్ తనని దూరం పెట్టడంతో తర్వలో తాను పార్టీకి వీడ్కోలు పలుకుతానని స్పష్టం చేశారు. తన అవసరం పార్టీ, పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకి లేదని భావించిన తరువాత తాను పార్టీలో కొనసాగటం కర్టెక్ కాదని తాను భావిస్తున్నానని పేర్కొన్నారు. ఈ మేరకు తాను త్వరలో ఢిల్లీకి వెళ్లాననీ, లోక్ సభ స్పీకర్ కలసి తన సభ్యత్వానికి రాజీనామా చేసి,  ఆ మరుక్షణం పార్టీకి రాజీనామా చేస్తానని తెలిపారు.  తిరువూరు టీడీపీ సభకు టీడీపీ హైకమాండ్ కేశినేని చిన్నిని నియమించిన సంగతి తెలిసిందే. అలాగే తనను పార్టీ కార్యక్రమంలో కలగజేసుకోవద్దని  పార్టీ అధినేత చంద్రబాబు ఆదేశాలు ఇచ్చారని టీడీపీ నేతలు చెప్పారని కేశినేని నాని ఇప్పటికే వెల్లడించారు. ఈ క్రమంలో తాను పార్టీ అధినేత ఆదేశాలను పాటిస్తానని, చంద్రబాబు ప్రతిపాదనను అంగీకరిస్తూ తాను పోటీ నుంచి తప్పుకున్నట్లు తెలిపారు. ఈ క్రమంలోనే తీవ్ర అసంతృప్తికి గురైన కేశినేని నాని రాజీనామాకు సిద్ధం అయ్యారని సమాచారం.

కీలక ఘట్టానికి ‘ఆదిత్య’.. జనవరి 6న ఎల్‌1 కక్ష్యలోకి!

Aditya L1: శనివారం సాయంత్రం 4 గంటలకు ఖగోళంలో అద్భుతం జరగనుంది. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) ప్రయోగించిన ఆదిత్య-ఎల్1 తుది అంకానికి చేరుకోనుంది. ఫైనల్ ఆర్బిట్‌లోకి రేపు చేరనుంది. భారత్ ప్రయోగించిన తొలి సోలార్ మిషన్ ఇది. భూమికి 15 లక్షల కిలోమీటర్ల దూరం(సూర్యుడు, భూమికి మధ్య గల దూరంలో ఒక శాతం దూరం)లో ఆదిత్య ఎల్1 లాగ్రేంజ్ పాయింట్ 1లోకి చేరి సూర్యుడిని అధ్యయనం చేయనుంది.0

ఆరంభం అదిరింది.. ఆస్ట్రేలియాపై భారత్ ఘన విజయం   

INDW vs AUSW 1st T20:  భారత్ - ఆస్ట్రేలియా మహిళల జట్టు మధ్య జరుగుతోన్న టీ20 సిరీస్‌లోని మొదటి మ్యాచ్‌లో టీమిండియా తొమ్మిది వికెట్ల తేడాతో విజయం సాధించింది. ముంబైలోని డివై పాటిల్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో భారత జట్టు టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 141 పరుగులు చేసింది. భారత్ ఒక వికెట్ కోల్పోయి లక్ష్యాన్ని సాధించి మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. 

ముఖేష్ అంబానీని దాటిన గౌతమ్ అదానీ.. ఆసియాలోనే అత్యంత ధనవంతుడు

ఆసియా ఖండంలో అత్యంత ధనవంతుడిగా  అదానీ గ్రూప్ సంస్థ చైర్మెన్ గౌతం అదానీ నిలిచాడు. బ్లూమ్ బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ (బీబీఐ) లో రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మెన్ ముఖేష్ అంబానీని కంటే  అదానీ గ్రూప్ ఆఫ్ కంపెనీల చైర్ పర్సన్  అదానీ  ముందంజలో నిలిచారు. ఆసియాలోనే  అత్యంత సంపన్న వర్గాల్లో  అదానీ అగ్రస్థానంలో నిలిచాడు. అదానీ తన ఆస్తుల విలువ ప్రపంచ ర్యాంకింగ్ లో  12వ స్థానానికి చేరుకున్నాడు.  అంబానీ  ప్రపంచ ర్యాంకింగ్స్ లో  13వ స్థానంలో ఉన్నారు.గత ఏడాది నుండి వీరిద్దరూ తమ స్థానాల్లో  పైకి ఎగబాకుతూ వస్తున్నారు. 2023 డిసెంబర్ లో  అదానీ 15 15వ స్థానంలో  నిలిచాడు. అదే మాసంలో రిలయన్స్ అధినేత  ముఖేష్ అంబానీ  14వ స్థానంలో నిలిచిన విషయం తెలిసిందే.

టీ20 వరల్డ్ కప్ షెడ్యూల్ విడుదల.. 
 
T20 World Cup 2024: క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐసీసీ టీ20 వరల్డ్ కప్(ICC T20 World Cup 2024) షెడ్యూల్ విడుదలైంది. జూన్ 1వ తేదీ నుంచి ఈ వరల్డ్ కప్ మ్యాచ్‌లు ప్రారంభం కానున్నాయి. పాకిస్తాన్‌తో టీమిండియా మ్యాచ్ జూన్ 9వ తేదీన జరగనుంది. ఈ మ్యాచ్‌ న్యూయార్క్‌లో జరుగుతుంది.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios