Keshineni Nani:కేశినేని నాని సంచలన నిర్ణయం.. త్వరలో పార్టీకి ..!
Keshineni Nani: సిట్టింగ్ ఎంపీ కేశినేని నానీకి టిడిపి హై కమాండ్ షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. విజయవాడ నుంచి ఎంపీ టికెట్ ఇవ్వడం లేదని టీడీపీ హైకమాండ్ స్పష్టం చేసింది. విజయవాడ ఎంపీ టికెట్ ను వేరేవారికి కేటాయిస్తున్నట్లు స్పష్టం చేశారు. దీంతో కేశినేని సంచలన నిర్ణయం తీసుకున్నారు.
Keshineni Nani: విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని సంచలన నిర్ణయం తీసుకున్నారు. టిడిపి హై కమాండ్ తనని దూరం పెట్టడంతో తర్వలో తాను పార్టీకి వీడ్కోలు పలుకుతానని స్పష్టం చేశారు. తన అవసరం పార్టీ, పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకి లేదని భావించిన తరువాత తాను పార్టీలో కొనసాగటం కర్టెక్ కాదని తాను భావిస్తున్నానని పేర్కొన్నారు. ఈ మేరకు తాను త్వరలో ఢిల్లీకి వెళ్లాననీ, లోక్ సభ స్పీకర్ కలసి తన సభ్యత్వానికి రాజీనామా చేసి, ఆ మరుక్షణం పార్టీకి రాజీనామా చేస్తానని తెలిపారు.
తిరువూరు టీడీపీ సభకు టీడీపీ హైకమాండ్ కేశినేని చిన్నిని నియమించిన సంగతి తెలిసిందే. అలాగే తనను పార్టీ కార్యక్రమంలో కలగజేసుకోవద్దని పార్టీ అధినేత చంద్రబాబు ఆదేశాలు ఇచ్చారని టీడీపీ నేతలు చెప్పారని కేశినేని నాని ఇప్పటికే వెల్లడించారు. ఈ క్రమంలో తాను పార్టీ అధినేత ఆదేశాలను పాటిస్తానని, చంద్రబాబు ప్రతిపాదనను అంగీకరిస్తూ తాను పోటీ నుంచి తప్పుకున్నట్లు తెలిపారు. ఈ క్రమంలోనే తీవ్ర అసంతృప్తికి గురైన కేశినేని నాని రాజీనామాకు సిద్ధం అయ్యారని సమాచారం.
ఇటీవల తిరువూరు కేంద్రంగా కేశినేని నాని, కేశినేని చిన్నీల మధ్య గొడవలు తారాస్థాయికి చేరుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈనెల 7వ తేదీన తిరువూరులో జరిగే సభ ఏర్పాట్ల బాధ్యత కూడా కేశినేని చిన్నీకే అప్పగించారు. ఈ విషయంలో కలగజేసుకోవద్దని అధిష్టానం సమాచారం ఇచ్చింది. దీంతో అన్నాదమ్ముల మధ్య జరిగిన పోరుకు పుల్ స్టాప్ పడినట్టైందని పార్టీ నాయకులు భావించారు.