ముఖేష్ అంబానీని దాటిన గౌతమ్ అదానీ: ఆసియాలోనే అత్యంత ధనవంతుడు
ఆసియా ఖండంలో అత్యంత ధనవంతుడిగా అదానీ గ్రూప్ సంస్థ చైర్మెన్ గౌతం అదానీ నిలిచాడు.
న్యూఢిల్లీ:బ్లూమ్ బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ (బీబీఐ) లో రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మెన్ ముఖేష్ అంబానీని కంటే అదానీ గ్రూప్ ఆఫ్ కంపెనీల చైర్ పర్సన్ అదానీ ముందంజలో నిలిచారు. ఆసియాలోనే అత్యంత సంపన్న వర్గాల్లో అదానీ అగ్రస్థానంలో నిలిచాడు.
అదానీ తన ఆస్తుల విలువ ప్రపంచ ర్యాంకింగ్ లో 12వ స్థానానికి చేరుకున్నాడు. అంబానీ ప్రపంచ ర్యాంకింగ్స్ లో 13వ స్థానంలో ఉన్నారు.గత ఏడాది నుండి వీరిద్దరూ తమ స్థానాల్లో పైకి ఎగబాకుతూ వస్తున్నారు.
2023 డిసెంబర్ లో అదానీ 15 15వ స్థానంలో నిలిచాడు. అదే మాసంలో రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ 14వ స్థానంలో నిలిచిన విషయం తెలిసిందే.
అదానీ గ్రూప్ ఆస్తుల విలువ
రూ.97.6 బిలియన్ల నికర విలువతో అదానీ గ్రూప్ వ్యవస్థాపకుడు అదానీ ప్రపంచంలో 12వ అత్యంత సంపన్నుడిగా నిలిచాడు. అంతేకాదు అత్యంత సంపద కలిగిన భారతీయుడే కాదు. ఆసియాకు చెందిన వ్యక్తిగా ఆయన రికార్డు సృష్టించాడు.
గత ఏడాది ఆరంభంలో అదానీ తన నికర విలువను కోల్పోయారు. 2023 జనవరి మాసంలో న్యూయార్క్ కు చెంది హిండెన్ బర్గ్ రీసెర్చ్ నివేదిక అదానీ సంస్థను ఇబ్బంది పెట్టింది. అదానీ సంస్థ అకౌంటింగ్ అక్రమాలకు పాల్పడిందని ఆరోపించింది.ఈ ఆరోపణలను అదానీ గ్రూప్ సంస్థ తోసిపుచ్చింది. హిండెన్ బర్గ్ నివేదిక నేపథ్యంలో అదానీ గ్రూప్ సంపద 60 శాతం క్షీణించింది.
గౌతమ్ అదానీ నేతృత్వంలోని అదానీ గ్రూప్ భారత దేశంలోని కీలకమైన మౌలిక సదుపాయాల రంగంలో కీలకంగా వ్యవహరిస్తుంది. అదానీ గ్రూప్ దేశంలో అతి పెద్ద ప్రైవేట్ ఓడరేవును కూడ కలిగి ఉంది.ప్రపంచంలో బొగ్గు వ్యాపారంలో అదానీ సంస్థ కార్యకలాపాలు సాగిస్తుంది. 2
ఆర్‌బీఐ నివేదిక ప్రకారంగా అదానీ కంపెనీలతో పాటు ఆ సంస్థ ప్రమోటర్ గ్రూప్ ద్వారా, అదానీ ఫ్యామిలీ ట్రస్ట్ ద్వారా పలు సంస్థలు నడుస్తున్నాయి.
అదానీ ఎంటర్ ప్రైజెస్ (73 శాతం), అదానీ గ్రీన్ ఎనర్జీ (56 శాతం), అదానీ పోర్ట్స్ (66 శాతం), అదానీ పవర్ (70 శాతం), అదానీ ట్రాన్స్ మిషన్ (68 శాతం), అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ (73 శాతం), అదానీ టోటల్ గ్యాస్ (73 శాతం) ఉన్నట్టుగా ఆర్‌బీఐ నివేదిక తెలుపుతుంది.
రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్) అధినేత అంబానీ 97 బిలియన్ల సంపదతో ప్రపంచంలో 13వ స్థానంలో ఉన్నాడు. భారత్ లో, ఆసియా ఖండంలో సంపన్నుల్లో అంబానీ రెండో స్థానంలో నిలిచాడు.
బీబీఐ టాప్ 50 జాబితాలో ఉన్న భారతీయుల్లో షాపూర్ మిస్త్రీ రూ.34.6 బిలియన్లు, శివ్ నాడార్ రూ.33 బిలియన్లతో 45వ స్థానంలో నిలిచారు.