Asianet News TeluguAsianet News Telugu

బేటీ బచావో అంటూ బాట‌క‌పు నినాదాలిచ్చేవారు రేపిస్టులను కాపాడుతున్నారు - రాహుల్ గాంధీ

ఆడపిల్లలను కాపాడండి అంటూ నినాదాలు చేసే వారే రేపిస్టిలను కాపాడుతున్నారని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ అన్నారు. బిల్కిస్ బానోకు న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. 

Those who shout 'Beti Bachao' are protecting rapists - Rahul Gandhi
Author
First Published Aug 25, 2022, 2:28 PM IST

‘బేటీ బచావో’ (కూతుళ్లను రక్షించండి) అంటూ బూటకపు నినాదాలు చేసేవారు రేపిస్టులను కాపాడుతున్నారని కాంగ్రెస్ నాయ‌కుడు, ఎంపీ రాహుల్ గాంధీ అన్నారు. బయటపడిన బిల్కిస్ బానో గ్యాంగ్ రేప్ కేసులో 11 మంది దోషులను విడుదల చేయ‌డంపై ఆయ‌న మండిప‌డ్డారు. బాధితురాలికి న్యాయం చేయాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు.

జార్ఖండ్ సీఎం కు షాక్: ఎమ్మెల్యేగా అనర్హతకు ఈసీ సిఫారసు

ఈ మేర‌కు ఆయ‌న ట్విట్ట‌ర్ లో “ బేటీ బచావో వంటి బోలు నినాదాలు ఇచ్చే వారు రేపిస్టులను కాపాడుతున్నారు. నేడు దేశంలోని మహిళల గౌరవం, అర్హత గురించిన ప్రశ్నఇది. బిల్కిస్ బానోకు న్యాయం చేయండి. ’’ అంటూ ట్వీట్ చేశారు.

కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా కూడా బానోకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కేసులో దోషుల విడుదలపై ప్రభుత్వం మౌనంగా ఉండ‌టం వ‌ల్ల త‌న వైఖ‌రి ఏంటో స్ప‌ష్టం చేసింద‌ని చెప్పారు. ‘‘ అత్యాచారానికి పాల్పడిన 11 మంది వ్యక్తుల విడుదలపై మౌనం వహించడం ద్వారా ప్రభుత్వం తన వైఖరిని స్పష్టం చేసింది ('సర్కార్ నే లేకర్ ఖీంచ్ లీ హైస‌). వారికి  స్వాగతం పలుకుతూ, మద్దతు తెలిపే చర్యలు కెమెరాలో చిక్కాయి ’’ అంటూ ఆమె  హిందీలో ట్వీట్ చేశారు. ‘‘ కానీ దేశంలోని మహిళలకు రాజ్యాంగంపై ఆశ ఉంది. న్యాయం కోసం పోరాడేందుకు చివరి వరుసలో నిలబడిన మహిళకు కూడా రాజ్యాంగం ధైర్యాన్నిస్తుంది. బిల్కిస్ బానోకు న్యాయం చేయండి’’ అని ఆమె పేర్కొన్నారు.

ఇదిలా వుండగా, బిల్కిస్ బానో కేసులో 11 మంది దోషులను విడుదల చేయడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై భారత అత్యున్నత న్యాయస్థానం గుజరాత్ ప్రభుత్వానికి, కేంద్రానికి గురువారం నోటీసు జారీ చేసింది. బిల్కిస్ బానో గుజరాత్‌లోని రంధిక్‌పూర్ గ్రామంలో సామూహిక అత్యాచారానికి గురయ్యారు. గోద్రా రైలు దహనం తర్వాత చెలరేగిన గుజరాత్ అల్లర్లలో ఆమె మూడేళ్ల కుమార్తెతో పాటు కుటుంబంలోని ఏడుగురు సభ్యులు మార్చి 3, 2002న హత్యకు గురయ్యారు. ఆ సమయంలో ఆమె వయస్సు 21 సంవత్సరాలు. ఐదు నెలల గర్భవతిగా ఉంది. 

16 ఏళ్ల బాలిక‌పై బంధువుల సామూహిక అత్యాచారం, దాడి.. అడ్డొచ్చిన అమ్మమ్మపై కూడా..

కాగా.. బిల్కిస్ బానో రేప్ కేసులో 11 మంది దోషులు ఆగస్టు 15న గుజరాత్ ప్రభుత్వ ఉపశమన విధానం ప్రకారం విడుదలయ్యారు, వారు 15 సంవత్సరాలకు పైగా జైలు శిక్షను పూర్తి చేశారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios