Asianet News TeluguAsianet News Telugu

జార్ఖండ్ సీఎం కు షాక్: ఎమ్మెల్యేగా అనర్హతకు ఈసీ సిఫారసు

జార్ఖండ్ సీఎం హేమంత్ సోరేన్ ను ఎమ్మెల్యేగా అనర్హుడిగా భారత ఎన్నికల సంఘం సిఫారసు చేసింది. ఈ మేరకు ఈ సిఫారసు లేఖను గవర్నర్ కు పంపింది.  

EC Recommends Jharkhand CM Hemant Soren's Disqualification From Assembly
Author
New Delhi, First Published Aug 25, 2022, 1:37 PM IST

రాయ్‌పూర్:ఎన్నికల చట్టాన్ని ఉల్లంఘించినందుకు గాను జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరేన్ ను ఎమ్మెల్యేగా అనర్హుడిగా ప్రకటించాలని భారత ఎన్నికల సంఘం సిఫారసు  చేసింది. ఈ మేరకు గవర్నర్ కు ఈసీ జార్ఖండ్ గవర్నర్ కు లేఖను పంపిందని జాతీయ మీడియా సంస్థ ఎబీపీ న్యూస్ తెలిపింది.ఈసీ సీల్డ్ కవర్లో  జార్ఖండ్ రాజ్ భవన్ కు ఈ సిఫారసును పంపింది. జార్ఖండ్ గవర్నర్ రమేష్ బైస్ ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నారు.

ముఖ్యమంత్రి హేమంత్ సోరేన్ తన పదవిని దుర్వినియోగం చేశారని బీజేపీ ఆరోపించింది. మైనింగ్ లీజును సీఎం తన కంపెనీకి కేటాయించుకున్నారని బీజేపీ  ఆరోపించింది. ఆర్టీఐ కార్యకర్త శివశంకర్ శర్మ జార్ఖండ్ మైనింగ్ స్కాంపై సీబీఐ, ఈడీ దర్యాప్తునకు డిమాండ్ చేస్తూ కోర్టులో పిల్ దాఖలు చేశారు. మైనింగ్ కోసం క్వారీ గనిని లీజును స్వంతం చేసుకొనేందుకు సీఎం హేమంత్ సోరేన్ తన పదవిని దుర్వినియోగం చేశారని  ఆయన ఆరోపించారు. సోరెన్ కుటుంబం షెల్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టిందని  ఆర్టీై కార్యకర్త ఆరోపించారని ఏబీపీ న్యూస్ వెల్లడించింది. ముఖ్యమంత్రి హేమంద్ సోరేన్ పై మనీలాండరింగ్, మైనింగ్ లీజు మంజూరు చేసే సమయంలో అవకతవలు జరిగాయని దాఖలైన పిల్ లపై జార్ఖండ్ హైకోర్టులో విచారణను సుప్రీంకోర్టు బుధవారం నాడు నిలిపివేసింది.
 

Follow Us:
Download App:
  • android
  • ios