న్యూఢిల్లీ: భర్తతో విడాకులు తీసుకొన్న 10 మాసాలకు వివాహితకు కొడుకు పుట్టాడు. విడిపోయిన జంటను పుట్టిన శిశువు కలిపాడు. విడాకులు తీసుకొన్న జంట మరోసారి వివాహం చేసుకొన్నారు. ఈ ఘటన హర్యానా రాష్ట్రంలో చోటు చేసుకొంది.

హర్యానా రాష్ట్రంలోని జజ్జర్‌లో పెళ్లైన నాలుగేళ్ల తర్వాత ఓ జంట విడాకులు తీసుకొన్నారు. ఈ జంట విడాకులు తీసుకొన్న  పది మాసాల తర్వాత వివాహిత చిన్నారికి జన్మను ఇచ్చింది.

అయితే తన కొడుకుకు విడాకులు ఇచ్చిన తన భర్తే తండ్రి అంటూ వివాహిత కోర్టును ఆశ్రయించింది.. అయితే తాను మాత్రం తండ్రిని కాదని  భర్త కోర్టులో వాదించాడు. అయితే కోర్టు డీఎన్ఏ పరీక్షలకు ఆదేశించింది. ఈ పరీక్షలు రిపోర్ట్ వచ్చే లోపుగానే  ఆ చిన్నారికి తానే తండ్రి అంటూ అతను ఒప్పుకొన్నాడు. 

అంతేకాదు విడాకులు తీసుకొని విడిపోయిన ఆ జంట తిరిగి పెళ్లి చేసుకొన్నారు. హర్యానాలోని హిసార్ కు చెందిన యువతిని  ఆ వ్యక్తి 2014లో పెళ్లి చేసుకొన్నాడు. 2018లో ఆ జంట విడాకులు తీసుకొంది. ఈ ఏడాది జనవరి మాసంలో వివాహిత చిన్నారికి జన్మనిచ్చింది.