కేఫ్ కాఫీ డే అధినేత వీజీ సిద్ధార్థ్ కనిపించకుండా పోవడం దేశ కార్పోరేట్ రంగాన్ని ఉలిక్కిపడేలా చేసింది. కాఫీ ప్లాంటేషన్ వ్యాపార కుటుంబంలో పుట్టిన సిద్ధార్థ అదే రంగాన్ని ఎంచుకుని.. భారతదేశంలో కాఫీకి బ్రాండ్ అంబాసిడర్‌గా ఎదిగారు.

కర్ణాటకలోని చిక్‌మగుళూరు జిల్లాలోని ఓ కాఫీ పంటను సాగుచేసే కుటుంబంలో పుట్టిన ఆయన మంగళూరు విశ్వవిద్యాలయం నుంచి మాస్టర్స్ పూర్తి చేశారు. కెరీర్ ప్రారంభంలో స్టాక్ మార్కెట్‌లో పనిచేసిన సిద్ధార్థ.. ముంబైలోని జేఎం ఫైనాన్సియల్ లిమిటెడ్‌లో మేనేజ్‌మెంట్ ట్రైనీగా చేరారు.

26 ఏళ్ల వయసులో ఉద్యోగాన్ని వదులుకుని.. సొంతంగా వ్యాపారం ప్రారంభించారు. 1984లో శివన్ సెక్యూరిటీస్ అనే సంస్థను కొనుగోలు చేసిన సిద్ధార్థ.. దానిని విజయవంతమైన పెట్టుబడి బ్యాంకింగ్‌గా నిలబెట్టారు.

అదే సమయంలో సిద్ధార్థ కుటుంబానికి 12 వేల ఎకరాలకు పైగా కాఫీ తోటలు ఉన్నాయి. ఆ కాఫీ గింజలను ఎవరికో అమ్మే బదులు తానే ఎందుకు అమ్మకూడదని నిర్ణయించుకున్నారు.

అలా 1992లో అమాల్గమేటెడ్ బీన్ కాఫీ ట్రేడింగ్ కంపెనీని స్థాపించారు. ఈ సంస్థ కాఫీ గింజలను విదేశాలకు ఎగుమతి చేస్తూ.. రెండేళ్లలో దేశంలోనే అతిపెద్ద కాఫీ ఎగుమతిదారుగా నిలిచింది.

అయితే తన వద్ద పండిస్తున్న కాఫీని ప్రజలకు రుచి చూపించాలనుకున్న సిద్ధార్థ 1996లో బెంగళూరు మహానగరంలోని బ్రిగేడ్ రోడ్‌లో ‘‘కేఫ్ కాఫీ డే’’ పేరుతో తొలి రిటైల్ ఔట్‌లెట్‌ను ప్రారంభించారు.

ఆయన ఈ సంస్థను స్థాపించే సమయానికి భారతీయులకు పెద్దగా కాఫీని ఇష్టపడేవారు కాదు. 23 ఏళ్ల క్రితమే ఒక కాఫీ, గంట పాటు ఇంటర్నెట్‌కు రూ. 100 ఛార్జ్  చేసేవారు. ఈ ఔట్ లెట్ జనాల్లోకి వెళ్లడంతో దేశంలోని మరిన్ని నగరాలకు ‘‘కేఫ్ కాఫీ డే’’ను విస్తరించారు.

ఇప్పుడు ఈ సంస్థ కాఫీకి కేరాఫ్‌ అడ్రస్‌గా నిలిచింది. ప్రస్తుతం ఈ సంస్ధకు 177 కేఫేలు, 48,000 వెండింగ మిషన్లు ఉన్నాయి. భారతదేశంతో పాటు వియన్నా, చెక్‌ రిపబ్లిక్, మలేషియా, నేపాల్, ఈజిప్ట్ లాంటి దేశాల్లోనే కేఫ్ కాఫీ డే శాఖలను సిద్ధార్థ్ పరిచయం చేశారు.

అలా అతి తక్కువ సమయంలోనే కాఫీ కింగ్‌గా సిద్ధార్థ్ పేరు దేశం మొత్తం మార్మోగింది. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నేత ఎస్ఎం కృష్ణ పెద్దకుమార్తె మాళవికను ఆయన వివాహం చేసుకున్నారు.

వీరికి ఇద్దరు కుమారులు. మైండ్ ట్రీలో పెట్టుబడులతో పాటు సెరాయ్ సికాడ పేరిట రెండు సెవెన్ స్టార్ హోటల్స్‌తో సక్సెస్‌ఫుల్‌గా సాగుతున్న ఆయన పన్ను ఎగవేత వివాదాల్లో చిక్కుకున్నారు.

కోట్ల రూపాయల ఆదాయపు పన్నును ఎగవేసినట్లు ఆరోపణలు రావడంతో 2017లో ఐటీ శాఖ.. ముంబై, చెన్నై, బెంగళూరు, చిక్‌మగుళూరు‌లోని కేఫ్ కాఫీ డే ఔట్‌లెట్స్‌పై దాడులకు దిగింది.

ఈ తనిఖీల్లో రూ. 650 కోట్ల విలువైన అక్రమాస్తులను గుర్తించి స్వాధీనం చేసుకుంది. దీంతో ఆయన ఆర్ధిక ఇబ్బందుల్లో కూరుకుపోయారు. కేఫ్ కాఫీ డే సైతం నష్టాల్లో సాగుతోంది. ఈ క్రమంలోనే కంపెనీలోని కొంత వాటాను కోకాకోలాకు విక్రయించాలని సిద్ధార్థ భావించి.. ఆ సంస్థ ప్రతినిధులతో చర్చలు సైతం జరిపారు.

వీజీ సిద్ధార్థ ఇష్యూ.. చివరిగా ఫోన్ లో ఎవరితో మాట్లాడారు?

కర్ణాటక మాజీ సీఎం అల్లుడు అదృశ్యం: వంతెనపై నడుస్తూ మాయం

అదృశ్యం కాదు.. ఆత్మహత్య: శవమై తేలిన ఎస్ఎం కృష్ణ అల్లుడు సిద్ధార్ధ

‘ ఓడిపోయాను’’.. సిద్ధార్థ్ రాసిన లేఖ పూర్తి పాఠం ఇదీ..

130ఏళ్లుగా సిద్ధార్థ కుటుంబం ఇదే వ్యాపారంలో...