Asianet News TeluguAsianet News Telugu

ఘోరం.. ఆరేళ్లుగా మైనర్ పై తండ్రి అత్యాచారం.. న‌ర‌క‌యాత‌న భ‌రించ‌లేక బాలిక ఆత్మ‌హ‌త్య

ఆరేళ్లుగా కన్న తండ్రి సొంత మైనర్ కూతురుపై అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో శారీరక, మానసిక వేధనను భరించలేక ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన మణిపూర్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. 

The father raped the minor for six years. The girl committed suicide because she couldn't bear the hellish pain.
Author
First Published Aug 23, 2022, 8:51 AM IST

స‌భ్య స‌మాజం త‌లదించుకునే ఘ‌ట‌న ఇది. క‌న్న తండ్రే సొంత కూతురుపై కామంతో కాటేశాడు. ఒక‌టి కాదు రెండు కాదు ఏకంగా ఆరేళ్ల పాటు ఆమెపై నిరంత‌రం అత్యాచారానికి పాల్ప‌డ్డారు. ఈ న‌ర‌క‌యాత‌న భ‌రించ‌లేక ఆ బాలిక ఆత్మ‌హ‌త్యకు పాల్ప‌డింది. బాధితురాలి కాపాడేందుకు వైద్య సిబ్బంది ఎంత ప్ర‌య‌త్నించినా ఫ‌లితం లేకుండా పోయింది. ఈ ఘ‌ట‌న మ‌ణిపూర్ లో చోటు చేసుకుంది. 

ఈ దారుణానికి సంబంధించి ‘హిందుస్థాన్ టైమ్స్’తో  పాటు ప‌లు మీడియా సంస్థ‌ల నివేదిక‌ల ప్ర‌కారం.. 15 ఏళ్ల బాలిక‌పై 2016 నుంచి ఆమె తండ్రి అత్యాచారానికి పాల్ప‌డుతున్నారు. తండ్రి త‌న‌పై జ‌రుగుతున్న అత్యాచారాన్ని భ‌రించ‌లేక ఆమె మాన‌సిక వేధ‌న‌కు గురయ్యింది. దీంతో ఆమె జూలై 31వ తేదీన విషం తాగి ఆత్మ‌హ‌త్యకు పాల్ప‌డింది. అయితే ఆగస్టు 3న ఇంఫాల్‌లోని జవహర్‌లాల్ నెహ్రూ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (JNIMS)లో ఆమె చేరింది. పరిస్థితి విషమంగా మారడంతో అదే రోజు మరో ప్రైవేట్ ఆసుపత్రికి డాక్ట‌ర్లు రిఫర్ చేశారు. 

బెళగావిలో మరోసారి చిరుత కలకలం.. ముందుజాగ్రత్తగా 22స్కూళ్లకు సెలవు...

విషం తాగ‌డం వ‌ల్ల కిడ్నీలు వైఫ‌ల్యం కావ‌డంతో ఆ హాస్పిట‌ల్ లో ఆమెకు డ‌యాల‌సిస్ నిర్వ‌హించారు. ఆ  త‌రువాత బాధితురాలిని ఆగస్టు 18న ఇంఫాల్‌లోని రీజనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (RIMS)లోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ICU)కి తరలించారు, అక్కడ ఆమె ఆదివారం రాత్రి 9:40 గంటలకు మరణించింది.

ఈ ఘ‌ట‌న‌లో బాధితురాలికి న్యాయం చేయాలని ఏర్పాటు చేసిన ప్రజా జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) కో-కన్వీనర్ మీడియాతో మాట్లాడుతూ.. బాలిక ఆత్మ‌హ‌త్య‌కు పాల్పిడిన నాటి నుంచి మూడు రోజులు పాటు ఎలాంటి చికిత్స లేకుండా ఇంట్లోనే ఉండిపోయింద‌ని అన్నారు. ఆగస్టు 3న  మొద‌టి హాస్పిట‌ల్ లో చేరింద‌ని చెప్పారు. “ వైద్యులు, నర్సులు, తౌబల్ జిల్లా శిశు సంరక్షణ విభాగం, సాంఘిక సంక్షేమ శాఖ, పోలీసులు ఎంత ప్రయత్నించినప్పటికీ బాధితురాలు కోలుకోలేదు. విషం తాగ‌డం వ‌ల్ల రెండు కిడ్నీలు పాడైపోయాయి.” అని చెప్పార‌ని హిందుస్థాన్ టైమ్స్ నివేదించింది. 

క్షుద్రపూజలు : భార్యకు నగ్నంగా నలుగురిలో స్నానం..మగపిల్లాడు పుట్టాలని, డబ్బులు రావాలని భర్త దారుణం..!

ఈ ఘ‌ట‌న‌పై భారత శిక్షాస్మృతిలోని సెక్షన్ 305, పోక్సో (లైంగిక నేరాల నుండి పిల్లలను రక్షించడం) చట్టం- 2012 సెక్షన్ 6 కింద తౌబాల్‌లోని మహిళా పోలీసు స్టేషన్‌లో కేసు న‌మోదు చేశారు. నిందితుడిని ఆగ‌స్టు 5వ తేదీన జ్యుడీషియల్ కస్టడీకి తీసుకొని అరెస్టు చేశారు. కాగా.. ఈ ఘ‌ట‌న‌పై ఆగ్రహించిన కొంద‌రు వ్య‌క్తులు అత‌డి ఇంటిపై దాడి చేసి ధ్వంసం చేశారు. 

కాగా.. బాధితురాలు మృతి చెంద‌క ముందు చైల్డ్‌లైన్‌కు స్టేట్‌మెంట్ ఇచ్చింది. త‌న‌కు సాయం చేయాల‌ని నానమ్మను సంప్రదించానని అయితే వారు నేరాన్ని కప్పిపుచ్చి బెదిరించారని పేర్కొంది. ఆమె తన స్నేహితులకు తన బాధ‌ను చెప్పుకుంది. అలాగే తన వ్యక్తిగత డైరీలో ఈ విష‌యాల‌ను రాసుకుంది. 2020లో ఆమె తన అత్త ద‌గ్గ‌ర ఉన్న‌ప్పుడు కొంచెం రిలాల్స్ గానే ఉంది. కానీ కొంత స‌మ‌యం త‌రువాత బాధితురాలిని తండ్రి శారీరకంగా, మానసికంగా వేధిస్తూనే ఉన్నాడ‌ని హిందూస్తాన్ టైమ్స్ పేర్కొంది. 

Follow Us:
Download App:
  • android
  • ios