Asianet News TeluguAsianet News Telugu

శంకరాచార్య స్వామి స్వరూపానంద సరస్వతి వారసులు వీరే?

శంకరాచార్య స్వామి స్వరూపానంద సరస్వతి వారసుల పేర్లను ఆయ‌న వ్యక్తిగత కార్యదర్శి సుబోధానంద్  ప్రకటించారు. స్వామి అవిముక్తేశ్వరానందని  జ్యోతష్ పీఠం బద్రీనాథ్ అధిపతిగా, స్వామి సదానంద్ శారదా పీఠం ద్వారక అధిపతిగా నియమితులయ్యారు.

Swaroopanand Saraswati Successor
Author
First Published Sep 12, 2022, 5:42 PM IST

ద్విపీఠాధీశ్వర్ జగత్గురు శంకరాచార్య స్వామి స్వరూపానంద సరస్వతి జీ మహారాజ్ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఆదివారం కన్నుమూశారు. స్వరూపానంద సరస్వతి మృతితో ఆయన అనుచరులు, భ‌క్తులు శోకసంద్రంలో మునిగిపోయారు. మధ్యప్రదేశ్ నర్సింగపూర్‌లోని పరమహంసి గంగా ఆశ్రమంలో సోమవారం ఆయనకు సమాధి చేయ‌నునారు. ఈ తరుణంలో స్వరూపానంద సరస్వతి వారసుల పేర్లను ప్రకటించారు. 

శంకరాచార్య భౌతికకాయం ముందు వార‌సుల‌ పేరును ఆయ‌న‌ వ్యక్తిగత కార్యదర్శి సుబోధానంద్ ప్రకటించారు. స్వామి అవిముక్తేశ్వరానందని బద్రీనాథ్ లోని జ్యోతష్ పీఠ అధిపతిగా, స్వామి సదానంద్ ని  
ద్వారకలోని శారదా పీఠ అధిపతిగా ప్ర‌క‌టించారు.  
 
స్వామి స్వరూపానంద సరస్వతి జీకి మధ్యప్రదేశ్‌లోని చింద్వారా జిల్లాతో ప్రత్యేక అనుబంధం ఉంది. అతను సెప్టెంబరు 2, 1924న ప్రస్తుత సియోని జిల్లాలోని డిఘోరిలో జన్మించాడు. స్వామీజీ పుట్టిన సమయంలో సియోని జిల్లా అవిభాజ్య ఛింద్వారాలో భాగంగా ఉండేది. అతని తండ్రి దిఘోరీ సంపన్న వ్యాపారి. స్వామి స్వరూపానంద సరస్వతి చిన్ననాటి పేరు పోతిరామ్ ఉపాధ్యాయ. ఆయనకు ఐదుగురు సోదరులు.. 
 
పోతిరామ్ ఉపాధ్యాయ్ (స్వామి స్వరూపానంద సరస్వతి) తన తొమ్మిదేళ్ల వయసులోనే స‌న్యాస జీవితాన్ని ప్రారంభించారు. తొమ్మిదేళ్ల వయసులో ఇల్లు విడిచిపెట్టిన తరువాత.. ఆయ‌నకు కర్పాత్రి జీ మహారాజ్ సాంగత్యం లభించింది. ఆ సమయంలో కరపత్రి జీ మహారాజ్ సంత్ సమాగంలో ఇతర సాధువులతో కలిసి చింద్వారాకు వస్తున్నారు. కర్పాత్రి జీ మహారాజ్ సాంగత్యం పొందిన తర్వాత పోతిరామ్ ఉపాధ్యాయ జీవితం మారిపోయింది. ఎవరికీ సమాచారం ఇవ్వకుండా సాధువులతో కలిసి ప్రయాణం సాగించాడు.

కొంతకాలం తర్వాత పోతిరామ్ ఉపాధ్యాయ్ కర్పాత్రీజీ మహారాజ్‌తో కలిసి దండ దీక్ష తీసుకున్నాడు. ఈ క్ర‌మంలో పోతిరామ్ ..  స్వరూపానంద సరస్వతిగా మారారు. శంకరాచార్య కావాలనే ఆయన జీవిత ప్రయాణం ఇక్కడి నుంచే మొదలైంది. క్రమంగా ఆయ‌న‌ స్వామి స్వరూపానంద సరస్వతిగా ప్రసిద్ధి చెందారు. 1981లో శంకరాచార్య బిరుదు పొందారు. త‌ద‌నంత‌రం ద్వారకా పీఠం అలాగే ఉత్తరాఖండ్‌లోని జోషిమఠ్ జ్యోతిషీ పీఠానికి శంకరాచార్యుడు అయ్యాడు. సుదీర్ఘ న్యాయ పోరాటం తర్వాత జ్యోతిప్  పీఠం శంకరాచార్య బిరుదు పొందారు. స్వాతంత్య్ర పోరాటంలో బ్రిటిష్ వారిని ఎదిరించినందుకు జైలులో కూడా ఉంచబడ్డాడు. 

అదే సమయంలో శంకరాచార్యుల మరణంతో ఝోతేశ్వర్‌లో విషాద ఛాయలు అలముకున్నాయి. అంతిమ దర్శనం కోసం పెద్ద సంఖ్యలో ప్రజలు అక్కడికి చేరుకున్నారు. సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ కూడా స్వామీజీ చివరి దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా సీఎం భావోద్వేగానికి లోనయ్యారు. అంతిమ దర్శనం అనంతరం శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ.. ఆయ‌న మతానికి పతాకధారిని, మన సంస్కృతి, జీవన విలువలను పెంపొందించేవాడినని, దేశ విముక్తి కోసం పోరాడిన యోధుడు, సన్యాసి అని అన్నారు. దీంతో పాటు కోట్లాది మంది భక్తులు సన్మార్గంలో నడిచేలా స్ఫూర్తి నింపారు. అలాంటి పరమ పూజ్య శంకరాచార్య జీ మహారాజ్ ఇప్పుడు బ్రహ్మంగా మారారు. అని అన్నారు. 

వీరితో పాటు మాజీ సీఎం కమల్‌నాథ్, దిగ్విజయ్ సింగ్ కూడా నివాళులర్పించారు. ప్రభుత్వ లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు నిర్వహిస్తామని సీఎం తెలిపారు. తొమ్మిదేళ్ల వయస్సులో ఇంటిని విడిచిపెట్టిన ఆయ‌న  వేదాలు, ఉపనిషత్తులు, గ్రంథాలలో పాండిత్యం సంపాదించారు .

Follow Us:
Download App:
  • android
  • ios