కర్ణాటక మాజీ మంత్రి రాసలీలల కేసు ఊహించని మలుపులు తిరుగుతోంది.  ఇప్పటికే ఉద్యోగం ఇప్పిస్తానంటూ మంత్రి రమేష్.. యువతితో రాసలీలు నిర్వహించిన వీడియో వైరల్ అయిన సంగతి తెలిసిందే. దాని తర్వాత ఆయనను మంత్రి పదవి నుంచి కూడా తొలగించారు. కాగా..  తాజాగా.. ఈ కేసులో కీలకమైన వ్యక్తి అయిన సదరు యువతి కిడ్నాప్ కి గురైందంటూ ఆ యువతి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడం తీవ్ర కలకలం రేపుతోంది.

ఈ కేసును సిట్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా.. బెలగాం పోలీసులు కూడా ఈ కేసుకు సంబంధించి పూర్తి సమాచారాన్ని సిట్ అధికారుల ముందు ఉంచారు. దీంతో.. యువతి నిజంగా కిడ్నాప్ అయ్యిందా లేదా అనే కోణంలో అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు.  ఈ కేసుతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరినీ విచారిస్తున్నట్లు తెలుస్తోంది.

మంత్రిని ఈ వ్యవహారంలో ఇరికించేందుకు యువతితో కొందరు కీలక రాజకీయ నాయకులు ఈ వ్యవహారం నడిపించినట్లు అనుమానలు కలుగుతున్నాయి. ఈ విషయమై యువతి ఇద్దరు సోదరులను కూడా పోలీసులు విచారించారు.

అసలు వీడియోని ఎవరు విడుదల చేశారు..? ఎక్కడి నుంచి విడుదల చేశారనే విషయంపై కూడా విచారణ కొనసాగుతోంది. ఆ సీడీ బయటకు వచ్చిన తర్వాత కూడా యువతి ఆమె తన ఇద్దరు సోదరులతో కాంటాక్ట్ లో ఉందనే విషయం తెలుస్తోంది. ఆమె వారికి చేసిన వాట్సాప్ మెసేజ్ లే అందుకు సాక్ష్యం అని పోలీసులు చెబుతున్నారు

ఈ సమాచారమంతా సేకరించిన బెలగాం పోలీసులు... వాటిని సిట్ అధికారులకు అందజేసినట్లు సమాచారం. ఇదిలా ఉండగా.. యువతి కిడ్నాప్ అయ్యిందంటూ ఆమె తండ్రి బెలగాంలో ఫిర్యాదు చేయగా... ఆ కేసును బెంగళూరుకు తరలించారు.