Asianet News TeluguAsianet News Telugu

మిగితా క‌రెన్సీల‌తో పోలిస్తే రూపాయి బ‌లంగానే ఉంది - కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్

ఇతర దేశాల కరెన్సీతో పొలిస్తే ఇండియా కరెన్సీ అయిన రూపాయి బలంగానే ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. పూణెలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. 

Rupee remains strong against other currencies - Union Finance Minister Nirmala Sitharaman
Author
First Published Sep 25, 2022, 10:18 AM IST

డాలర్ తో రూపాయి మారకం విలువ నిరంతరం బలహీనపడుతుండటంపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వివరణ ఇచ్చారు. ప్రపంచంలోని మిగతా కరెన్సీల కంటే రూపాయి పటిష్టంగానే ఉందని చెప్పారు. ‘‘ అమెరికా డాలర్ తో పోలిస్తే రూపాయి చాలా బలంగా ఉన్నట్లు కనిపిస్తోంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నాయి ’’ అని ఆమె అన్నారు. 

ఆరేండ్ల త‌ర్వాత సోనియా గాంధీతో నితీష్ కుమార్, లాల్ ప్ర‌సాద్ యాద‌వ్ ల భేటీ

కేంద్ర ప్రాయోజిత పథకాల స‌మీక్షా స‌మావేశాన్ని శనివారం పూణెలో నిర్వ‌హించారు. ఇతర కరెన్సీలతో పోల్చితే అస్థిరతను తట్టుకుని నిలిచిన కరెన్సీ ఏదైనా ఉందంటే అది భారత రూపాయి అని సీతారామన్ తెలిపారు. రూపాయి దాని పోటీదారులలో చాలా మంచి పట్టు సాధించింద‌ని, బాగా పుంజుకుందని చెప్పారు.

ఈ స‌మావేశానికి హాజ‌రైన  జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ మాట్లాడుతూ.. ‘‘యూఎస్ 10 సంవత్సరాల బాండ్ ఈల్డ్ పెరుగుదల, బలమైన డాలర్ ఇండెక్స్ ఎఫ్‌ఐఐలను (విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు) అభివృద్ధి చెందుతున్న మార్కెట్ల నుండి పారిపోయేలా ప్రభావితం చేశాయి. బ్యాంకింగ్ వ్యవస్థలో లిక్విడిటీ పతనం, బలహీన కరెన్సీ, ప్రస్తుత ప్రీమియం వాల్యుయేషన్ సమీప కాలానికి మార్కెట్ ఔట్‌లుక్‌ను బేరిష్‌గా సెట్ చేసింది ’’ అని అన్నారు.

రాజ‌స్థాన్ సీఎం పీఠం మార్పు.. ? నేడు అశోక్ గెహ్లాట్ ఇంట్లో స‌మావేశం..

భారతీయ దృష్టాంతాన్ని ప్రస్తావిస్తూ.. కేంద్ర బ్యాంకుల దూకుడు ద్రవ్య విధాన చర్యలతో, ప్రపంచ వృద్ధి ఇంజన్లు మందగమనంలో ఉన్నాయని అన్నారు. అయితే భారతదేశం ప్రస్తుతం క్రెడిట్ వృద్ధిలో పుంజుకోవడం, పన్నుల పెరుగుదలతో మెరుగైన స్థితిలో ఉందని చెప్పారు. ప్రస్తుత అస్థిరత కొంతకాలం కొనసాగవచ్చని ఆయ‌న అంచ‌నా వేశారు.

కాగా.. శుక్రవారం US డాలర్ తో రూపాయి 81 రూపాయలకు చేరుకుంది. గత కొన్ని నెలలుగా రూపాయి విలువ క్రమంగా క్షీణిస్తోంది. దీనిపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. శుక్రవారం నాడు 83 పైసల పతనం నమోదైంది, గత ఏడు నెలల్లో ఒకే రోజులో ఇదే అతిపెద్ద పతనంగా ప‌రిగ‌ణిస్తున్నారు. అంతకు ముందు అమెరికా డాలర్ తో రూపాయి మారకం విలువ 19 పైసలు పడిపోయి 80.98 కనిష్ట స్థాయికి చేరుకుంది.

అంత్యక్రియలు జరిగిన మ‌రుస‌టి రోజు 'చనిపోయిన' మహిళ రిట‌ర్న్.. పూడ్చిన శ‌వాన్ని బ‌య‌ట‌కు తీసి..

రోజు రోజుకు రూపాయి పతనం రికార్డులు నమోదవుతున్నాయి. అమెరికాలో వడ్డీ రేట్లు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి (US Rate Hike). ఈ వారం US సెంట్రల్ బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ వరుసగా మూడోసారి వడ్డీ రేటును భారీగా 0.75 శాతం పెంచింది. డాలర్ తో పోలిస్తే ప్రపంచ వ్యాప్తంగా కరెన్సీలు భారీగా పతనమవుతున్నాయి, రేట్ల పెంపులో ఎలాంటి మందగమనం లేదు. ఫెడరల్ రిజర్వ్ నుండి సంకేతాలు పొందిన తరువాత, పెట్టుబడిదారులు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మార్కెట్ల నుండి డబ్బును ఉపసంహరించుకుంటున్నారు. సెక్యూరిటీ కోసం US డాలర్ లో త‌మ పెట్టుబడిని పెడుతున్నారు. దీని కారణంగానే భారతీయ కరెన్సీ అయిన  రూపాయితో  పాటు అన్ని ఇతర కరెన్సీలకు ప్ర‌స్తుతం చెత్త ద‌శ‌ను కొన‌సాగిస్తున్నాయి. 
 

Follow Us:
Download App:
  • android
  • ios