రైలు ప్రమాదంలో ఓ మహిళ చనిపోయిందని భావించిన కుటుంబ సభ్యులు అంత్య క్రియలు నిర్వహించారు. అయితే.. మరుసటి రోజు ఉదయం ఆమె ఇంటికి వచ్చింది. దీంతో అందరూ షాక్ కు గురయ్యారు. అంతముందు పూడ్చిపెట్టిన శవాన్ని వెలికితీసి పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన తమిళనాడులోని చెంగల్పట్టు జిల్లాలో చోటు చేసుకుంది.
రైలు ప్రమాదంలో ఓ మహిళ చనిపోయిందనుకుని ఆమె కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు. కానీ, మరుసటి రోజు కర్మకాండ నిర్వహిస్తుండగా.. ఆకస్మికంగా చనిపోయిన ఆ మహిళ ఇంటికి తిరిగి వచ్చి.. అందర్నీ షాక్ కు గురి చేసింది. చనిపోయినందకు తమ తల్లి బతికే ఉందని ఆమె బిడ్డల ఆనందానికి ఆవధుల్లేకుండా పోయింది. అంతముందు పూడ్చిపెట్టిన శవాన్ని వెలికితీసి పోలీసులకు అప్పగించాడు. ఇంతకీ ఈ విచిత్ర ఘటన ఎక్కడ జరిగిందంటే?
వివరాల్లోకెళ్తే.. తమిళనాడులోని చెంగల్పట్టు జిల్లా గుడువంచెరుకి చెందిన చంద్ర(72) వృద్ధురాలు. తన పెద్ద కుమారుడు వడివేలు (48)తో కలిసి ఉంటుంది. ఆమె భర్త చాలా ఏళ్ల క్రితం చనిపోయాడు. అప్పటి నుంచి కాస్త డిప్రెషన్ లోకి వెళ్లింది. ఎప్పుడైనా నిరాశకు గురైనప్పుడు, చంద్ర తన ఇంటికి 22 కి.మీ దూరంలోని సింగపెరుమాళ్ కోయిల్‌లోని హనుమంతపురంలోని ఆలయానికి వెళ్ళేంది. అలాగే.. సెప్టెంబర్ 20 న ఆలయానికి వెళ్లిన చంద్ర.. రాత్రి అవుతున్న ఇంటికి రాలేదు. ఆమె కోసం కుటుంబ సభ్యులు తీవ్రంగా వెలికారు. కానీ ఫలితం లేదు. దీంతో మరుసటి రోజు ఆమె కుమారుడు వడివేలు పోలీసు ష్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
రెండు రోజులు గడిచిన తరువాత.. తాంబరం రైలు పట్టాలపై ఓ వృద్దురాలి శవం ఉన్నట్టు వడివేలుకు పోలీసులు సమాచారం అందించారు. శవాన్ని గుర్తించడానికి మార్చురీకి రమ్మని పిలిపించారు. ముఖం గుర్తుపట్టలేనంతగా దెబ్బతిన్నది. అయితే..మృతురాలి తన తల్లి వలె చీరను ధరించి ఉండటం.. దాదాపు తన తల్లిని పోలి ఉండటంతో మృతదేహం చంద్రదేనని నిర్ధారించారు. అనంతరం పోలీసులు లాంఛనాలు పూర్తి చేసి మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. అనంతరం బుధవారం కుటుంబీకులు మృతదేహాన్ని ఖననం చేశారు.
అయితే.. మరుసటి రోజు ఉదయం కుటుంబసభ్యులు మరోమారు కర్మకాండలో ఉండగా, చంద్ర ఇంటికి తిరిగి రావడంతో అందరూ ఉలిక్కిపడ్డారు. తమ తల్లి బతికి వచ్చిందని వారి ఆనందానికి అంతకులేకుండా పోయింది. ఇంతలో పోలీసులు రెవెన్యూ అధికారులకు సమాచారం అందించి మృతదేహాన్ని వెలికితీసి క్రోమ్‌పేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. తదుపరి విచారణలు కొనసాగుతున్నాయి. చంద్ర డిప్రెషన్‌లో ఉన్నాడని, సింగపెరుమాళ్‌కోయిల్‌లోని హనుమంతపురంలోని ఇతర దేవాలయాలను సందర్శించి, అక్కడ రెండు రోజులు గడిపిందని కుటుంబ సభ్యులు తెలిపారు. మృతురాలు చెన్నైలోని త్రిశూలం ప్రాంతానికి చెందిన పద్మ అని పోలీసుల విచారణలో తేలింది. వృద్ధురాలి మృతదేహాన్ని ఆమె కుటుంబసభ్యులకు అప్పగించారు పోలీసులు.
