కేరళకు రిలయన్స్ భారీ విరాళం...ఉచిత జియో సేవలు

https://static.asianetnews.com/images/authors/26af83d2-0ed6-5e66-b49b-5078caf01292.jpg
First Published 22, Aug 2018, 4:39 PM IST
Reliance Foundation announced a donation of Rs 21 crore to the Kerala.
Highlights

వరద భీభత్సంతో అతలాకుతలమైన కేరళను ఆదుకునేందుకు పలువురు ముందుకు వస్తున్నారు. తాజగా వరద బాధితులను ఆదుకునేందుకు రిలయన్స్ సంస్థ ముందుకొచ్చింది. 

ముంబై: వరద భీభత్సంతో అతలాకుతలమైన కేరళను ఆదుకునేందుకు పలువురు ముందుకు వస్తున్నారు. తాజగా వరద బాధితులను ఆదుకునేందుకు రిలయన్స్ సంస్థ ముందుకొచ్చింది. తమ సంస్థ తరపున 21 కోట్లరూపాయల విరాళాన్ని ప్రకటించింది. ఈ 21 కోట్ల విరాళాన్ని కేరళ సీఎం రిలీఫ్ ఫండ్ కు అందజేసినట్లు రిలయన్స్ సంస్థ ప్రకటించింది. దాంతో పాటు 50 కోట్ల విలువ చేసే వస్తువులను వరద బాధితులకు పంపిణీ చేయనున్నట్లు తెలిపింది.

 అలాగే రిలయన్స్ సంస్థలో భాగమైన రిలయన్స్ రిటైల్, జియో సహకారంతో వరద బాధితులకు అన్ని విధాలుగా ఆపన్న హస్తం అందిస్తూ, సహకార చర్యల్లో తమ వంతు సహకారం అందిస్తున్నట్లు రిలయన్స్ పేర్కొంది.
 
వరద బాధిత ప్రాంతాల్లో ఇప్పటికే రిలయన్స్ ఫౌండేషన్ సహాయక చర్యల్లో పాల్గొందని గుర్తు చేసింది. ఆగస్ట్ 14 నుంచి వయనాడ్, త్రిస్సుర్, అలప్పుళ, ఎర్నాకుళంతోపాటు పలు జిల్లాలలో తమ వాలంటీర్లు పనిచేస్తున్నారని తెలిపింది. 

రిలయన్స్ రిటైల్ తరుపున 160 ప్రభుత్వ పునరావాస కేంద్రాల్లో బాధితులకు ఆహారపదార్థాలు, గ్లూకోజ్, శానిటరీ నాప్కిన్స్‌ను పంపిణీ చేసినట్లు స్పష్టం చేసింది. వీటితోపాటు కేరళలో వారం రోజుల పాటు ఉచిత వాయిస్, డేటా సేవలను అందించనున్నట్లు రిలయన్స్ జియో ప్రకటించింది.

ఈ వార్తలు కూడా చదవండి

కూతురి పెళ్లికి దాచిన డబ్బును వరద బాధితులకు విరాళమిచ్చిన మేయర్

కేరళకు ఇండియన్ రైల్వే భారీ విరాళం

కేరళ రాష్ట్రానికి ఎంపి రాజీవ్ చంద్రశేఖర్ రూ.25లక్షల విరాళం

కేరళ: రూ.1.5 లక్షలు ప్రకటించిన చేపలమ్ముకొనే విద్యార్థిని

loader