కేరళలో వరదల కారణంగా నిరాశ్రయులైన వారిని ఆదుకొనేందుకుగాను కొచ్చి మేయర్ ముందుకొచ్చింది. తన కూతురు వివాహం కోసం  దాచి ఉంచిన సొమ్మును సీఎం సహాయనిధికి విరాళంగా ఇచ్చింది.


కొచ్చి: కేరళలో వరదల కారణంగా నిరాశ్రయులైన వారిని ఆదుకొనేందుకుగాను కొచ్చి మేయర్ ముందుకొచ్చింది. తన కూతురు వివాహం కోసం దాచి ఉంచిన సొమ్మును సీఎం సహాయనిధికి విరాళంగా ఇచ్చింది.

కేరళలో వరదల కారణంగా లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. కేరళలో వరదల కారణంగా నష్టపోయిన వారిని ఆదుకొనేందుకు విరాళాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. కొచ్చి మేయర్ సుమినీ జైన్ కూతురు వివాహం బుధవారం జరగాల్సిన ఉంది.

తన కూతురు వివాహం ఘనంగా చేసేందుకు ఆమె డబ్బులు దాచింది. అయితే కేరళలో భారీగా కురిసిన వర్షాలతో లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. వారందరినీ ఆదుకోనేందుకు గాను తన కూతురి వివాహన్ని నిరాడంబరంగా జరపాలని నిర్ణయం తీసుకొంది కొచ్చి మేయర్.

కూతురు పెళ్లి కోసం దాచుకొన్న డబ్బును వరద బాధితులకు విరాళంగా ఇచ్చేసింది. మేయర్ ఉదారతను పలువురు ప్రశంసిస్తున్నారు. ప్రజలు ఆపదలో ఉన్న సమయంలో వారికి తన వంతు సహాయాన్ని అందించేందుకు గాను ఈ డబ్బులను విరాళంగా ఇచ్చినట్టు మేయర్ చెప్పారు.

ఈ వార్తలు చదవండి

కేరళకు ఇండియన్ రైల్వే భారీ విరాళం

కేరళలో తగ్గుముఖం పట్టిన వరదలు: ఇళ్లలోకి చేరిన పాములు, మొసళ్లు

పంబా ఉధృతి: శబరిమలకు రావద్దని భక్తులకు సూచన