ప్రకృతి విలయంతో అతలాకుతలమైన కేరళ రాష్ట్రానికి స్థానిక పార్లమెంట్ సభ్యుడు, ఏషియానెట్ న్యూస్ నెట్ వర్క్ ఛైర్మన్ రాజీవ్ చంద్రశేఖర్ రూ.25లక్షలు విరాళం ప్రకటించారు. కేరళకు సాయం అందించడానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి సహాయ నిధికి గానీ ప్రధాని సహాయ నిధికి గానీ తమ విరాళాలను అందజేయాల్సిందిగా ఆయన కోరారు. 

అదే సమయంలో ఏషియానెట్ న్యూస్ నెట్ వర్క్ తన వంతు కృషిలో భాగంగా కేరళకు సాయం చేయడానికి విరాళాలను సేకరిస్తోంది. కేరళకు సాయం అందించడానికి అసియా నెట్ న్యూస్ టీవీ, సువర్ణ న్యూస్ టీవీ, ఆసియానెట్ న్యూస్ నెట్ వర్క్ కార్యాలయానికి పెద్ద యెత్తున దాతలు వస్తున్నారు. నిధులను, వస్తువులను విరాళంగా ఇస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను రాజీవ్ చంద్రశేఖర్ ట్విట్టర్ లో పోస్టు చేశారు.

తమ విజ్ఞప్తి మేరకు విరాళాలు అందజేయడానికి పెద్ద యెత్తున దాతలు ముందుకు వస్తుండడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. వారందరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు.