న్యూఢిల్లీ: మాజీ కేంద్రమంత్రి సుష్మా స్వరాజ్‌కు బుధవారం నాడు రాజ్యసభ నివాళులర్పించింది.

బుధవారం నాడు రాజ్యసభ ప్రారంభం కాగానే రాజ్యసభ చైర్మెన్ వెంకయ్యనాయుడు సుష్మాస్వరాజ్  మృతికి సంతాప తీర్మానాన్ని చదవి విన్పించారు. ఎమ్మెల్యేగా, ఎంపీగా, పలు శాఖలకు మంత్రిగా  ఆమె చేసిన సేవలను  ఆయన కొనియాడారు.

సుష్మా స్వరాజ్ మృతికి సంతాపంగా  రాజ్యసభ మౌనం పాటించి తమ సంతాపాన్ని తెలిపింది.ప్రజల సమస్యలను చట్టసభల్లో ప్రతిబింబించేలా ఆమె పనిచేసిందని ఆయన ఈ సందర్భంగా సుష్మాస్వరాజ్  సేవలను ఆయన కొనియాడారు.

మంగళవారం రాత్రి గుండెపోటుతో మాజీ కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ మృతి చెందారు.  సుష్మా స్వరాజ్ అతి చిన్న వయస్సులోనే మంత్రిగా బాధ్యతలను  చేపట్టారు.


సంబంధిత వార్తలు

సుష్మా స్వరాజ్ మృతి: కన్నీళ్లు పెట్టుకొన్న మోడీ

సుష్మాని కించపరుస్తూ కామెంట్... పాక్ నెటిజన్ కి కేటీఆర్ కౌంటర్

ట్విట్టర్ ఫైటర్ ని కోల్పోయా...సుష్మామృతి పై పాక్ మంత్రి కామెంట్

మాజీ కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ కన్నుమూత

సుష్మా స్వరాజ్ చివరి ట్వీట్ ఇదే...

సుష్మా స్వరాజ్ మృతికి కేసీఆర్, జగన్, చంద్రబాబు సంతాపం

విద్యార్ధి నేత నుండి విదేశాంగ మంత్రిగా: సుష్మా స్వరాజ్ ప్రస్థానం

చిన్నమ్మ మృతి... కంటతడి పెట్టిన కిషన్ రెడ్డి

సాయంత్రం సుష్మా స్వరాజ్ అంత్యక్రియలు