కుమారస్వామి ప్రమాణస్వీకారానికి అడ్డంకి

Rain plays spoilsport, people run for shelter around Vidhan Soudha
Highlights

ఈ రోజు ప్రమాణ స్వీకారం లేనట్టేనా..?

కర్ణాటక ముఖ్యమంత్రిగా కుమారస్వామి ప్రమాణ స్వీకారం ఈ రోజు జరగనట్టేనా..? ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే అవుననే సమాధానమే వినపడుతోంది.  ఈ రోజు సాయంత్రం ఆయన ముఖ్యమంత్రిగా
 ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంది. కాగా.. ఈ కార్యక్రమానికి అనుకోని అడ్డంకి వచ్చిపడింది.

బెంగళూరులో అకస్మాత్తుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. విధానసౌధ వద్ద ప్రమాణ స్వీకారం నిమిత్తం ఏర్పాటు చేసిన వేదిక వద్ద కూడా భారీగా వర్షం కురుస్తోంది. దీంతో ప్రమాణ స్వీకార కార్యక్రమంపై నీలినీడలు కమ్ముకున్నాయి. వర్షం తీవ్రత తగ్గిన తర్వాత ప్రమాణ స్వీకార కార్యక్రమం జరుగుతుందా లేక వాయిదా పడుతుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

loader